Keerthy Suresh: కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన జనవరి 12 విడుదల పోస్టర్.. పల్లెటూరి పడుచులా!

Keerthy Suresh: జనవరి 12 విడుదల మూవీ టీమ్ నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని ఆమె లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. పల్లెటూరి పడుచులా ఉన్న ఆమె పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

Published on: Oct 17, 2026, 13:26:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'జనవరి 12 విడుదల'. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన జనవరి 12 విడుదల పోస్టర్.. పల్లెటూరి పడుచులా! (x/Shine_Screens)
కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన జనవరి 12 విడుదల పోస్టర్.. పల్లెటూరి పడుచులా! (x/Shine_Screens)

కీర్తి సురేష్ బర్త్ డే

ఇవాళ (అక్టోబర్ 17) కీర్తి సురేష్ బర్త్ డే. ఈ సందర్భంగా జనవరి 12 విడుదల సినిమాలో ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే క్యాచీ ట్యాగ్‌లైన్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేస్తోంది.

లతా రెడ్డిగా కీర్తి సురేష్

ఇప్పటికే ఈ జనవరి 12 సినిమా నుంచి విడుదలైన వెంకటేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్లకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈరోజు మహానటి కీర్తి సురేష్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్ పల్లెటూరి వాతావరణంలో, సాంప్రదాయ పర్పుల్ కలర్ లంగావోణి డ్రెస్ వేసుకుని, ముఖంపై అందమైన చిరునవ్వుతో కనిపిస్తోంది. పొలంలో ట్రాక్టర్ పై ఈ భామ పోజులిచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో ఆమె 'లతా రెడ్డి' అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది. సినిమాలో ఈమె పాత్ర అత్యంత ఆసక్తికరంగా, కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం.

ఊటీలో ల్యాండ్ అయిన టీమ్

ప్రస్తుతం ఈ జనవరి 12 విడుదల సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ ఊటీలోని అందమైన లోకేషన్లలో జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

పదో హిట్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు జనవరి 12 విడుదల సినిమాతో వరుసగా పదో హిట్ అందుకోవాలని అనిల్ రావిపూడి చూస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More