ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎప్పటికప్పుడు కొన్ని సినిమాలు వెళ్లిపోతూ ఉంటాయి. అలా ఈ అక్టోబర్ నెలలో 6 థ్రిల్లర్ మూవీస్ కూడా వదిలిపోనున్నాయి. మరి వీటిని మీరు ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.
నెట్‌ఫ్లిక్స్ నుండి వెళ్లిపోతున్న థ్రిల్లర్ మూవీస్ ఇవే
1. బుల్లెట్ ట్రైన్

బ్రాడ్ పిట్ ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక పని మీద బుల్లెట్ ట్రైన్ ఎక్కిన ఒక తెలివైన హంతకుడి చుట్టూ తిరుగుతుంది. అతను అనుకోకుండా మరో ఐదుగురు ప్రమాదకరమైన హంతకుల చేతుల్లో చిక్కుకుంటాడు. ఈ సినిమాలో బ్రాడ్ పిట్‌తో పాటు జోయ్ కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రయాన్ టైరీ హెన్రీ, ఆండ్రూ కోజి, సాండ్రా బుల్లక్ తదితరులు నటించారు.
2. ఇండియానా జోన్స్ అండ్ ది రేడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్
స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ఇది ఓ పురావస్తు శాస్త్రవేత్త చుట్టూ తిరుగుతుంది. సైన్యాన్ని అజేయంగా మార్చే శక్తి ఉన్న ఒక బైబిల్ కళాఖండం.. నాజీ దళాల చేతికి చిక్కకుండా దాన్ని తిరిగి పొందడానికి అతను ప్రయత్నిస్తాడు. హారిసన్ ఫోర్డ్ టైటిల్ పాత్రలో నటించాడు. కారెన్ అలెన్ ఫోర్డ్ ఫిమేల్ లీడ్ కాగా.. పాల్ ఫ్రీమాన్ విలన్ గా నటించారు.
3. డీప్ ఇంపాక్ట్
ఈ డీప్ ఇంపాక్ట్ ఓ సైన్స్ ఫిక్షన్ డిజాస్టర్ మూవీ. ఒక తోకచుక్క భూమిని ఢీకొట్టి, భారీ వినాశనాన్ని సృష్టించే ప్రమాదం ఉన్నప్పుడు జరిగే పరిణామాల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ చిత్రంలో రాబర్ట్ డువాల్, టీ లియోని, ఎలిజా వుడ్, వనెస్సా రెడ్‌గ్రేవ్, మాక్సిమిలియన్ షెల్, మోర్గాన్ ఫ్రీమాన్ వంటి నటీనటులు నటించారు.
4. ది పీస్‌మేకర్
జార్జ్ క్లూనీ, నికోల్ కిడ్మాన్ నటించిన ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. రాజకీయ కుట్ర, యాక్షన్‌ను మిళితం చేసి తీశారు. అణు వార్హెడ్లను రవాణా చేసేటప్పుడు అవి కనిపించకుండా పోతాయి. అప్పుడు తలెత్తే అణు యుద్ధ ప్రమాదం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాను 'వన్ పాయింట్ సేఫ్' అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు.
5. డోనీ బ్రాస్కో
{{/usCountry}}జార్జ్ క్లూనీ, నికోల్ కిడ్మాన్ నటించిన ఇంటెన్స్ థ్రిల్లర్ ఇది. రాజకీయ కుట్ర, యాక్షన్‌ను మిళితం చేసి తీశారు. అణు వార్హెడ్లను రవాణా చేసేటప్పుడు అవి కనిపించకుండా పోతాయి. అప్పుడు తలెత్తే అణు యుద్ధ ప్రమాదం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాను 'వన్ పాయింట్ సేఫ్' అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు.
5. డోనీ బ్రాస్కో
{{/usCountry}}అల్ పాసినో, జానీ డెప్ నటించిన ఈ ఆస్కార్ నామినేటెడ్ క్రైమ్ థ్రిల్లర్.. ఒక ఎఫ్‌బిఐ అండర్‌కవర్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. అతను ఒక క్రైమ్ కుటుంబంలోకి చొరబడి, అక్కడి బాస్‌తో స్నేహం చేసి క్రమంగా ఎదుగుతాడు. జానీ డెప్ సీక్రెట్ ఏజెంట్‌గా, అల్ పాసినో క్రైమ్ లార్డ్‌గా నటించారు.
6. ది యూజువల్ సస్పెక్ట్స్
సస్పెన్స్, మిస్టరీలతో కూడిన ఒక ఎడ్జీ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే ఈ సినిమా మిస్ కావద్దు. ఐఎండీబీలో 8.5 స్కోరుతో, 'ది యూజువల్ సస్పెక్ట్స్' చివరి వరకు మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. ఈ కథ ఒక మోసగాడి (కెవిన్ స్పేసీ) చుట్టూ తిరుగుతుంది. స్టీఫెన్ బాల్డ్‌విన్, గాబ్రియేల్ బైర్న్, బెనిసియో డెల్ టోరో, కెవిన్ పొల్లాక్, చాజ్ పాల్మింటేరి మరియు పీట్ పోస్ట్‌లెత్‌వైట్ ఈ చిత్రంలో నటించారు.