Weekend OTT: వీకెండ్ వినోదాల విందు.. ఓటీటీలోని ఈ క్రేజీ తెలుగు, తమిళ సినిమాలు మిస్ అవొద్దు.. ఎందుకు చూాడాలంటే?
Weekend OTT: ఈ వారం ఓటీటీలోకి అదిరిపోయే కంటెంట్ వచ్చింది. ఈ వీకెండ్ కు ఓటీటీలో ఏం చూద్దామని ఆలోచిస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీ కోసమే. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ క్రేజీ తెలుగు, తమిళం రిలీజ్ లపై ఓ లుక్కేయండి. ఇందులో డిఫరెంట్ జోనర్ల సినిమాలున్నాయి.
Weekend OTT: థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఎలా ఉన్నా, వీకెండ్ వచ్చిందంటే చాలు హోమ్ స్క్రీన్స్‌పై డిజిటల్ కంటెంట్ చూసే ఆడియన్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జూన్ చివరి వారానికి సంబంధించి సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ విభిన్న జానర్ల చిత్రాలను ఓటీటీలు రంగంలోకి దించాయి. ఈ వారం లిస్ట్‌లో ఉన్న ఈ క్రేజీ సినిమాలపై ఓ లుక్కేయండి.

1. బ్లాస్ట్ (Blast) – నెట్‌ఫ్లిక్స్
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో సుభాష్ కె. రాజ్ తెరకెక్కించిన పవర్‌ఫుల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. ఒక కరాటే మాస్టర్ కుటుంబం కార్పొరేట్ బిజినెస్ మాఫియా వల్ల ఎలాంటి ఇబ్బందులు పడింది, వారి కూతురు మార్షల్ ఆర్ట్స్‌తో ఎలా ఎదురొడ్డి నిలిచింది అనేది ఇందులో హైలైట్. ఇది ఓటీటీలో అదరగొడుతోంది.
2. బాహుబలి: ది టార్చ్‌బేరర్ (Baahubali: The Torchbearer) – నెట్‌ఫ్లిక్స్
భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ అద్భుతమైన డాక్యు-సిరీస్‌ను తీసుకొచ్చారు. ప్రభాస్, రానా, రాజమౌళిల తదితరుల ఇంటర్వ్యూలు, సినిమా మేకింగ్ వెనుక ఉన్న అన్‌టోల్డ్ సీక్రెట్స్‌తో ఈ లెగసీ సిరీస్ సాగుతోంది.
3. మమ్మతియాన్ స్టార్స్ (Mammatiyaan Stars) – జీ5
వైభవ్ మురుగేషన్, లావణ్య నటించిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సిరీస్ క్రికెట్ లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎంఎస్ ధోని (MS Dhoni) మ్యాచ్ చూడటానికి ఎంతో ఉత్సాహంగా చెన్నై వెళ్లిన కొందరు పల్లెటూరి మిత్రులకు ఫేక్ టికెట్లు దొరికితే, ఆ తర్వాత వారు మ్యాచ్ చూడటానికి చేసే క్రేజీ అడ్వెంచర్ చుట్టూ ఈ కామెడీ డ్రామా తిరుగుతుంది.
4. బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) – ప్రైమ్ వీడియో
ఒక యంగ్ కపుల్ విడిపోవాలని అనుకుంటారు. వీళ్లు మ్యారేజ్ కౌన్సిలర్ వద్దకు వెళ్తారు. అక్కడ వారికి తెలిసిన మరో సమాంతర ప్రేమకథ వారి బంధంలోని లోపాలను ఎలా సరిచేసింది అనే పాయింట్‌తో గాంధీ కృష్ణ ఈ రిలేషన్‌షిప్ డ్రామాను క్లాస్‌గా తెరకెక్కించారు.
5. లింగమ్ (Lingam) – జియోహాట్‌స్టార్
కదిర్, దివ్య భారతి నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ప్రతిభావంతుడైన కబడ్డీ ఛాంపియన్ పోలీస్ ఆఫీసర్ కావాలనే కలను, ఒక ముఖ్యమైన మ్యాచ్ రోజు జరిగిన ఊహించని క్రైమ్ సంఘటన ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథాంశం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


