Niharika Bonam: బోనమెత్తిన మెగా డాటర్.. మహాకాళేశ్వర్ ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన నిహారిక.. వీడియో వైరల్

Niharika Bonam: నిహారిక కొణిదెల హైదరాబాద్ బోనాల పండుగలో పాల్గొంది. హైదరాబాద్ ఓల్ట్ సిటీ మీర్ ఆలం మండిలోని మహాకాళేశ్వర్ అమ్మవారికి బంగారం బోనం సమర్పించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 8, 2026, 08:15:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Niharika Bonam: హైదరాబాద్, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఉత్సవాల్లో మెగా డాటర్, నటి, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీ మీర్ ఆలం మండిలోని చారిత్రాత్మక శ్రీ మహంకాళేశ్వర ఆలయాన్ని సందర్శించిన నిహారిక అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో 'బంగారు బోనం' సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Niharika Bonam: బోనమెత్తిన మెగా డాటర్.. మహాకాళేశ్వర్ ఆలయంలో అమ్మవారికి బంగారం బోనం సమర్పించిన నిహారిక.. వీడియో వైరల్
Niharika Bonam: బోనమెత్తిన మెగా డాటర్.. మహాకాళేశ్వర్ ఆలయంలో అమ్మవారికి బంగారం బోనం సమర్పించిన నిహారిక.. వీడియో వైరల్

తెలంగాణ విశిష్ట సంస్కృతి అయిన బోనాల పండుగ వేళ నిహారిక రాకతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత సంతరించుకుంది. పాతబస్తీ మహంకాళి ఆలయానికి విచ్చేసిన నిహారికకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

ఆలయ చైర్మన్ పట్టువస్త్రాల సత్కారం.. పూర్ణకుంభ స్వాగతం

అమ్మవారికి బంగారు బోనం నైవేద్యంగా సమర్పించిన అనంతరం నిహారిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించి పట్టువస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

ఆలయ ప్రాచీన చరిత్రను, ఈ క్షేత్రంలో తరతరాలుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల ప్రాముఖ్యతను ఆలయ చైర్మన్ నిహారికకు వివరించారు. తెలంగాణ సంప్రదాయాలను ఇంత అద్భుతంగా కాపాడుకోవడం పట్ల నిహారిక సంతోషం వ్యక్తం చేశారు.

"కోరిక తీరింది.. అమ్మవారి అనుగ్రహమే ఇది!" - నిహారిక

అనంతరం మీడియా ప్రతినిధులతో నిహారిక ముచ్చటిస్తూ తన ఆధ్యాత్మిక అనుభూతిని పంచుకున్నారు. "ప్రధాన బోనాల రోజున షూటింగ్ షెడ్యూల్స్ వల్ల రావడం వీలుపడదు. అందుకే ఈరోజు అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను" అని తెలిపారు.

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లడం చిన్నప్పటి నుంచి తనను ఎంతగానో ఆకట్టుకునేదని చెప్పారు. "కొద్దిరోజుల క్రితమే నన్ను ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుణ్ణు అని మనసులో అనుకున్నాను. నా కోరిక ఇంత త్వరగా తీరుతుందని అసలు ఊహించలేదు. ఇదంతా ఆ మహంకాళి అమ్మవారి దివ్యమైన ఆశీస్సులే అని నమ్ముతున్నాను" అని నిహారిక ఆనందం వ్యక్తం చేశారు.

అమ్మవారి విగ్రహంలో దివ్యమైన తేజస్సు కనిపిస్తోందని, దర్శనం చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా అనిపించిందని చెప్పారు. భవిష్యత్తులో కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందే అవకాశం మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సెల్ఫీల కోసం పోటీ పడ్డ భక్తులు.. పిక్స్ వైరల్

నిహారిక ఓల్డ్ సిటీ మహంకాళి ఆలయానికి వచ్చారనే వార్త క్షణాల్లో వ్యాపించడంతో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. నిహారికతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అభిమానులందరికీ అభివాదం చేస్తూ నిహారిక ఎంతో చిరునవ్వుతో అలరించారు.

కాగా నిహారిక కొణిదెల నటిగానే కాకుండా 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌గా వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ సాధించి నిర్మాతగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ప్రొడక్షన్‌తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న నిహారిక, ఇలా సాంప్రదాయ దుస్తుల్లో బోనం ఎత్తి పూజలు చేయడం మెగా ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More