Ninnu Kori March 9 Episode: చంద్రకళ ప్రెగ్నెన్సీ-శాలిని ఫ్రస్టేషన్-విరాట్‌ను మర్డర్ కేసులో ఇరికించే కన్నింగ్ ప్లాన్
Ninnu Kori Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో చంద్రకళ ప్రెగ్నెన్సీ విషయాన్ని తల్లికి చెప్తూ శాలిని ఫ్రస్టేట్ అవుతుంది. విరాట్ ను మర్డర్ కేసులో ఇరికించేలా సునంద కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. మరోవైపు ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని రాజ్ చెప్తాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 9 ఎపిసోడ్ లో.. తల్లి సునంద ఇంటికి శాలిని వచ్చి కోపంతో గ్లాస్ సీసాను పగలగొడుతుంది. మనం ఆ నీలిమ, ప్రమోద్ లను ఇన్వాల్వ్ చేసి ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేశాం కదా. కానీ అది మర్చిపోయేలా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది. చంద్ర ప్రెగ్నెంట్ అయింది. ఆమెకు ప్రేమ సొంతం అవుతుందని తల్లితో శాలిని చెప్తుంది.

సునంద కన్నింగ్ ప్లాన్
ఏం టెన్షన్ పడకు బేబీ. విరాట్ కు నీలిమ, ప్రమోద్ అడ్డొస్తున్నారు. వాళ్లలో ఒకరిని పైకి పంపించామనుకో అప్పుడు డౌట్ ఎవరి మీదకు వెళ్తుంది? అది విరాట్ చేయించాడని అనుకుంటారు. దొంగ సాక్ష్యాలతో అతనికి శిక్ష పడేలా చేద్దాం. అప్పుడు ఆ కుటుంబంలో అందరికీ విషాదమేనని సునంద కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. వద్దమ్మా, అప్పుడు మన సీక్రెట్ ఇంకొకరికి చెప్పాల్సి వస్తుంది. మనం ఆ ఇంటి పతనం కోరుకుంటున్నామని ఎవరికీ తెలియకూడదు. అలాగే క్రాంతితో ప్రేమనూ చంపుకోలేనని శాలిని అంటుంది. క్రాంతితో నా బంధం శాశ్వతమని శాలిని చెప్తుంది.
విరాట్ సంతోషం
చంద్రకళ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ చూసి విరాట్ మురిసిపోతుంటాడు. బిజినెస్ లో ఎన్నో సక్సెస్ ప్రాజెక్టులు చూసిన దానికంటే ఎక్కువ సంతోషం ఇప్పుడు ఈ రిపోర్ట్ చూస్తుంటే కలుగుతుంది. తొమ్మిది నెలలు తొందరగా గడిచిపోయి బిడ్డను చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నానని విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును బావ, వారసుడిని అత్తయ్య, మామయ్య చేతుల్లో పెట్టాలని చంద్రకళ అంటుంది. నువ్వు దేవతవి చంద్ర, నువ్వు నా భార్య కావడం నేను చేసుకున్న పుణ్యమని విరాట్ చెప్తాడు.
రాజ్ బిజినెస్
కంచుతో ఫోన్లో శ్యామల కబుర్లు చెప్తుంది. చంద్రకళ కడుపుతో ఉంది, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని శ్యామల అంటుంది. నా మేనకోడలుని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని జగదీశ్వరి చెప్తుంది. అప్పుడే శ్రుతి, రాజ్, సరోజా వస్తారు. చంద్రకు కంగ్రాట్స్ చెప్తారు. నాకు దైవం లాంటి మనిషి ఒకరు ముందుకు వచ్చి సాయం చేశారు. ఆమె ఇచ్చిన డబ్బుతోనే ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. రేపే ఆఫీస్ ఓపెనింగ్. మీరు అందరూ వచ్చి ఘనంగా ప్రారంభించాలి. జీవితంలో మొదటి సారి నా కాళ్ల మీద నేను నిలబడేందుకు ఒక ఛాన్స్ వచ్చిందని రాజ్ చెప్తాడు.
శ్రుతిని పక్కకు తీసుకెళ్లి అంత డబ్బు ఎవరు సాయం చేశారని కామాక్షి అడుగుతుంది. అప్పుడే సరోజా వచ్చి కామాక్షికి కౌంటర్ వేస్తుంది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. అత్త పోరు ఏంటో ముందు ముందు చూపిస్తానని శ్రుతికి సరోజా వార్నింగ్ ఇస్తుంది. నీ భర్తను మాత్రం సక్సెస్ కానివ్వకు అని శ్రుతికి కామాక్షి చెప్తుంది.
కామాక్షి నీ అల్లుడు ఎదిగేలాగే కనిపిస్తున్నాడని శ్యామల అంటుంది. అందరూ తప్పకుండా రావాలని రాజ్ ఫ్యామిలీ వెళ్లిపోతుంది. శ్రుతి ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయినట్లేనని రఘురాం అంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


