నిన్ను కోరి ఫిబ్రవరి 27 ఎపిసోడ్: శాలిని ప్లాన్ ఫ్లాప్‌- చంద్ర‌కు తేజు థ్యాంక్స్‌- పాల‌ల్లో మ‌త్తుమందు- శ్యామల ట్విస్ట్

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో నిజం తెలిసినా తేజు చాలా పాజిటివ్ గా తీసుకుంటుంది. చంద్రకళకు థ్యాంక్స్ చెప్తుంది. శాలిని ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కానీ చంద్ర, విరాట్ ఫస్ట్ నైట్ చెడగొట్టేలా పాలలో మత్తుమందు కలుపుతుంది. శ్యామల ట్విస్ట్ ఇస్తుంది.

Published on: Feb 27, 2026, 07:46:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 27 ఎపిసోడ్ లో.. ఎందుకు నాకు అమ్మలా యాక్ట్ చేశావ్? నేను చచ్చిపోవద్దనా? అని ఏడుస్తూ చంద్రకళను తేజు గట్టిగా పట్టుకుంటుంది. ఇన్ని రోజులు నువ్వు నాకు అమ్మలా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. నువ్వు చూపించిన కేరింగ్ కు అమ్మంటే నీలా ఉంటుందని అర్థమైంది. నిజంగా నన్ను కూతురిలాగే చూసుకున్నావని తేజు అంటుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శాలిని ప్లాన్ ఫెయిల్

నువ్వు చాలా గ్రేట్ అమ్మ. నీ లవ్ ఎప్పటికీ మర్చిపోనని తేజు అంటుంది. దీంతో తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందని శాలిని ఫ్రస్టేట్ అవుతుంది. ఇక నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నేను నిన్ను ఇబ్బంది పెట్టనని తేజు అంటుంది. నిజాన్ని పాప యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయమని క్రాంతి అంటాడు.

నిజం ఎలా తెలిసింది?

పాపకు నిజం ఎలా తెలిసింది? అని శ్యామల అడగడంతో శాలిని కంగారు పడుతుంది. పార్కులో తేజుకు ఎవరో చెప్పారని అర్జున్ చెప్తాడు. రఘురాం ఫ్యామిలీ అందరికీ అర్జున్ థ్యాంక్స్ చెప్తాడు. తేజును మనవరాలు అని రఘురాం పిలుస్తాడు. తేజు పాజిటివ్ గా తీసుకోవడం చాలా పెద్ద రిలీఫ్ అర్జున్ అని చంద్రకళ అంటుంది.

సరదాగా శ్యామల

నేను తేజుకు ముందే వాళ్ల అమ్మ గురించి నిజం చెప్పేస్తే సరిపోయేది. ఇప్పుడు తను కోలుకుంటుందనే నమ్మకం వచ్చిందని అర్జున్ అంటాడు. జ్యూస్ అర్జున్ కు ఇచ్చి శ్యామల అని పిలవమని శ్యామల చెప్తుంది. జ్యూస్ లో దోసకాయ కలిపానని ఆటపట్టిస్తుంది. ముసలి వేషం వేసుకుని వచ్చి ఎంత మోసం చేశావని సరదాగా అర్జున్ తో శ్యామల అంటుంది.

కామాక్షికి డౌట్

పాప ఈ పాటికి హాస్పిటల్ లో ఉండాలని సునంద అనుకుంటుంది. అప్పుడే శాలిని కాల్ చేసి ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టిందమ్మా. చంద్ర ఏ మాయ చేసిందో కానీ పాప కండీషన్ బెటర్ అయింది. పాప పాజిటివ్ గా తీసుకుని చంద్రకు థ్యాంక్స్ కూడా చెప్పిందని తల్లితో శాలిని చెప్తుంది. ముందు ఫస్ట్ నైట్ ను ఆపాలమ్మా అని శాలిని అంటుండగానే కామాక్షి వచ్చి, శాలిని డ్రామా ఆడుతున్నావా అని అడుగుతుంది. మారిపోయావని మోసం చేస్తున్నావా అని ప్రశ్నిస్తుంది. కాలేజీ ఫ్రెండ్ అని శాలిని కవర్ చేస్తుంది.

విరాట్, చంద్రకళ ఫస్ట్ నైట్ కోసం శాలిని డెకరేషన్ చేస్తుంది. తేజు విషయం విరాట్ కు చంద్ర చెప్తుంది. దీంతో విరాట్ రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. చంద్రను కిస్ చేయబోతుంటే శ్యామల వచ్చి ఒక గంట ఆగలేవా అని విరాట్ ను బయటకు పంపిస్తుంది.

సూపర్ ట్విస్ట్

పాలల్లో శాలిని మత్తు మందు కలుపుతుంది. అప్పుడే వచ్చిన శ్యామల అందులో ఏం కలిపావని అడుగుతుంది. ముందే పాల గ్లాస్ రెడీ చేశానని శ్యామల ట్విస్ట్ ఇస్తుంది. అప్పుడే వచ్చిన క్రాంతి కాఫీ ఇవ్వమంటాడు. కాఫీ ఎందుకు శాలిని కలిపిన పాలను తాగమని శ్యామల చెప్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More