నిన్ను కోరి ఫిబ్రవరి 26 ఎపిసోడ్:విరాట్, చంద్ర ఫస్ట్‌నైట్ చెడగొట్టేలా శాలిని ప్లాన్-తేజుకు తెలిసిన నిజం-అమ్మలా ఎందుకు?
Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో విరాట్, చంద్రకళ ఫస్ట్ నైట్ చెడగొట్టేందుకు శాలిని ప్లాన్ వేస్తుంది. దీని ప్రకారం తేజు దగ్గరకు వెళ్లిన సునంద.. విరాట్, చంద్ర గురించి చెప్తుంది. చంద్ర ఇంటికి తేజు వెళ్లి ఎందుకు అబద్దం చెప్పావని అడుగుతుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 26 ఎపిసోడ్ లో.. రఘురాం ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేద్దామని తల్లి సునందకు శాలిని చెప్తుంది. రేపు విరాట్, చంద్రలకు జరిగే ఫస్ట్ నైట్ ఆపాలి. దాని కోసం నేను ప్లాన్ ఆలోచించి పెట్టానని తల్లికి శాలిని ఓ ప్లాన్ చెప్తుంది.

తేజు దగ్గరకు
పార్క్ లో అర్జున్, తేజు ఆడుకుంటున్నారు. అమ్మ ఎందుకు రాలేదని అర్జున్ ను తేజు అడుగుతుంది. అమ్మ గురించి ఆడగకపోతే తేజుతో ఆడుకుంటానని అర్జున్ చెప్తాడు. అప్పుడే పార్కులోకి తల్లితో కలిసి వచ్చిన శాలిని.. అర్జున్, తేజును చూపిస్తుంది. అర్జున్ కు కాల్ రావడంతో పక్కకు వెళ్తాడు. తేజు దగ్గరకు సునంద వెళ్తుంది.
చంద్ర గురించి చెప్పిన సునంద
మీ అమ్మ రాలేదా? అని తేజును సునంద అడుగుతుంది. మీ అమ్మ పేరు ఏంటీ? అని తేజును అడిగితే, చంద్రకళ అని చెప్తుంది. అప్పుడే ఫోన్ లో ఈవిడే నాకు తెలిసిన చంద్రకళ అని ఫొటోను సునంద చూపిస్తుంది. చంద్రకళ హస్బెండ్ కూడా నాకు తెలుసు అని విరాట్ ఫొటోను సునంద చూపిస్తుంది. వీళ్లిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని, నీ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలంటే మీ నాన్నను అడుగు అని చెప్పి సునంద వెళ్లిపోతుంది.
పాప హెల్త్ డిస్టబ్ అయితే చంద్ర డిస్టబ్ అవుతుంది. ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అవుతుంది. పాప ప్రాణాలు పోతే చంద్ర కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని శాలిని సైకోలా అంటుంది.
విరాట్ ఆరాటం
మరోవైపు ఫస్ట్ నైట్ కోసం విరాట్ తెగ తొందరపడతాడు. కానీ ఇది మధ్యాహ్నం రాత్రి కాదు అని చంద్ర నో చెప్తుంది. విరాట్, చంద్ర తెలుగు గ్రాంథికంలో రాజు, రాణిలాగా మాట్లాడుకుంటారు. బయట నుంచి శ్యామల, జగదీశ్వరి ఈ మాటలు వింటూ నవ్వుకుంటారు.
శ్యామల, జగదీశ్వరి లోపలికి వచ్చి సెటైర్లు వేస్తారు. ఈ రోజు నా కోడలికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావని విరాట్ ను జగదీశ్వరి అడుగుతుంది. గిఫ్ట్ తీసుకొస్తానని విరాట్ బయటకు వెళ్తాడు.
అప్పు కోసం
రాజ్ దగ్గర అప్పు వసూలు చేయడానికి అప్పారావు వస్తాడు. నీ కొడుకును బయటకు రమ్మని సరోజాను అడుగుతాడు. కొడుకు లేడని తల్లి చెప్తే, ఇంట్లో ఉన్నాడని శాలిని ఇరికిస్తుంది. అత్తగారు బంగారు మూట తెచ్చారని డబ్బులు ఇవ్వమని అప్పారావు అడుగుతాడు. అప్పుడు మూట తెచ్చి భస్మాన్ని అప్పారావు ముఖానికి రాజ్ కొడతాడు.
చంద్ర షాక్
విరాట్ కోసం చంద్ర వెయిట్ చేస్తుంటుంది. అప్పుడే తేజును తీసుకుని అర్జున్ రావడంతో అందరూ షాక్ అవుతారు. ఇది మా బాస్ ఇల్లు, వీళ్లంతా మా బాస్ ఫ్యామిలీ అని తేజుతో చంద్ర చెప్తుంది.
చాలమ్మా ఇంకా అబద్దాలు చెప్పొద్దు. నువ్వు నాకు అమ్మవి కావని తెలిసిపోయింది. విరాట్ అంకుల్ నీ బాస్ కాదు నీ హస్బెండ్. వీళ్లంతా నీ ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఎందుకు నాకు అమ్మాలా యాక్ట్ చేశావని తేజు ఏడుస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


