నిన్ను కోరి ఫిబ్రవరి 25 ఎపిసోడ్: విరాట్ పోలీస్ కంప్లయింట్-శాలిని టెన్షన్-క్రాంతికి డౌట్-భార్య కాళ్లు పట్టిన విరాట్
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో గాయాలతో ఇంటికి వచ్చిన విరాట్ ను చూసి అందరూ కంగారు పడతారు. కానీ దొరికిపోతానేమోననే భయంతో శాలిని టెన్షన్ పడుతుంది. శాలినిపై క్రాంతికి డౌట్ వస్తుంది. మరోవైపు విరాట్ తన భార్య కాళ్లు పడతాడు. వారసుడి కోసం ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో.. విరాట్ గాయాలతో ఇంటికి రావడంతో అందరూ కంగారు పడతారు. గుడిలో పూజ చేయిస్తున్నప్పుడు ఎవరో నా మీద అటాక్ చేశారు చంద్ర. ఎందుకు అటాక్ చేశారని శ్యామల అడుగుతుంది. తెలియదు అత్త కానీ నన్ను చంపడానికి వచ్చారు. పోలీసులకు ఇన్ఫామ్ చేశానని విరాట్ చెప్తాడు.

శాలిని కంగారు
శాలిని తెగ టెన్షన్ పడుతుంది. శాలినిని చూసి క్రాంతి డౌట్ పడతాడు. వెంటనే బిజినెస్ శత్రువులే కావొచ్చని శాలిని డైవర్ట్ చేయాలని చూస్తుంది. చంద్రకళ బాధపడుతుంది. శాలిని బయటకు వచ్చి తల్లికి కాల్ చేస్తుంది. నువ్వు చెప్పిందేంటీ, జరిగిందేంటీ? శవంలా రావాల్సిన బావగారు చిన్న గాయంతో వచ్చాడు. నలుగురు కలిసి ఒక్కడిని ఏం చేయలేకపోయారని కోపంతో శాలిని కాల్ కట్ చేస్తుంది.
క్రాంతికి డౌట్
శాలిని దగ్గరకు వచ్చిన క్రాంతి అన్నయ్య మీద నువ్వే అటాక్ చేయించావని అంటాడు. నీ మీద నాకు అనుమానం ఉందంటాడు. కానీ శాలిని ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అవసరమైతే ఈ ఇంటి మనుషుల కోసం నేనే ప్రాణాలిస్తానని శాలిని చెప్తుంది. ఇలా అనుమానించడం కరెక్ట్ కాదని క్రాంతికి శ్యామల, చంద్ర చెప్తారు. శాలిని మాటలను చంద్ర నమ్మేస్తుంది.
వారసుడి కోసం
విరాట్, చంద్ర వారసుణ్ని అందించాలని కుటుంబం అంతా కోరుకుంటుంది. శ్రుతిని ఆడించిన తర్వాత మళ్లీ ఈ చేతులతో పసిపాపను ఎత్తుకోలేదు. మళ్లీ ఆ ఫీలింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నానని శ్యామల అంటుంది. రాత్రి పాల గ్లాస్ తో గదిలోకి వచ్చిన చంద్రను చూసి విరాట్ రొమాంటిక్ గా మాట్లాడతాడు.
భార్య కాళ్లు పట్టిన విరాట్
విరాట్ పై అటాక్ గురించి చంద్ర టెన్షన్ పడుతుంది. పసుపు వేసిన పాలను తాగమని విరాట్ కు చెప్తుంది. పొద్దున నుంచి అన్ని పనులు చేసి అలసిపోయా. శివరాత్రి కాబట్టి ఉపవాసం ఉన్నా. కాళ్లు పీక్కుపోతున్నాయని చంద్ర చెప్తుంది. బెడ్ మీద భార్యను కూర్చోబెట్టి విరాట్ కాళ్లు పడతాడు. విరాట్ ను అలాగే ప్రేమగా చూస్తుంది చంద్రకళ.
నీ మెడలో నేను తొమ్మిది ముళ్లు వేశా. నీ తాళి గట్టిది. నాకేం కాదు. ప్రశాంతంగా పడుకోమని చంద్రకు విరాట్ చెప్తాడు.
తల్లి దగ్గరకు శాలిని
మరోవైపు తల్లి దగ్గరకు వెళ్లి క్రాంతికి తన మీద డౌట్ వచ్చినట్లు శాలిని చెప్తుంది. అంత ప్రొఫెషనల్ కిల్లర్స్ ను పెట్టినా ప్లాన్ మిస్ అయిందని శాలిని అంటుంది. ఇకపై విరాట్ ను టార్గెట్ చేయొద్దు. ఈ అటెంప్ట్ తో నాపై క్రాంతికి డౌట్ వచ్చింది. ఇప్పుడు అలాంటి ఆలోచనలు చేయొద్దు. ప్రాణాలు తీయొద్దని తల్లితో శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


