Ninnu Kori September 19 Episode: నిన్ను కోరి- సామ్రాట్ ఆస్తిపై జీవన్ కన్ను- చంద్రపై గిరిజ కుట్రను తిప్పికొట్టిన సామ్రాట్

Ninnu Kori Serial September 19th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 19వ ఎపిసోడ్‌‌లో సామ్రాట్ ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని ఫ్రెండ్స్‌తో మందు తాగుతూ జీవన్ ప్రగల్భాలు పలుకుతాడు. సామ్రాట్‌పై దాడి చేయించిన వారు ఎవరో తెలుసుకోవాలని దాక్షాయణి కోపంతో ఊగిపోతుంది.

Published on: Sep 19, 2026, 13:15:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సామ్రాట్‌కు గతం గుర్తులేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అతని ఆస్తిని కాజేసేందుకు కుటుంబంలోనే కుట్రలు మొదలవుతాయి.

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 19 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 19 ఎపిసోడ్

సామ్రాట్ ఆస్తిపై జీవన్ కన్ను

ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతున్న జీవన్‌ను, అతని స్నేహితులు వెటకారం చేస్తారు. సామ్రాట్ తిరిగి రావడంతో ఆస్తి మొత్తం నీకు దక్కకుండా పోయిందని హేళన చేస్తారు. దాంతో జీవన్ ఆవేశంతో చేతిలో ఉన్న గ్లాస్‌ను గోడకేసి కొడతాడు. సామ్రాట్‌కు గతం గుర్తుకురాకముందే ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని తన దుర్బుద్ధిని ఫ్రెండ్స్ ముందు బయటపెడతాడు జీవన్.

తల్లి ప్రేమను చూసి కరిగిపోయిన విరాట్

సామ్రాట్‌తో కేశవ్ మాట్లాడటానికి ప్రయత్నించగా, దాక్షాయణి మధ్యలో వచ్చి తన కొడుక్కి సొంత చేతులతో టిఫిన్ తినిపిస్తుంది. "ఎంత ఎదిగినా కొడుకు నా దృష్టిలో పసిబిడ్డే" అంటూ దాక్షాయణి అంటుంది. దాక్షాయణి చూపిస్తున్న మాతృప్రేమను చూసి సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ మనసు కరిగిపోతుంది.

ఆస్తి కోసం చామంతి, గిరిజల కుట్ర

తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసి జీవన్ మనసులోనే అసూయతో కుళ్లుకుంటాడు. గిరిజ తన కూతురు చామంతిని సామ్రాట్ చుట్టూ తిరుగుతూ అతని ప్రేమను పొందాలని నూరిపోస్తుంది. సామ్రాట్‌కు గతం గుర్తులేకపోవడమే తమకు సరైన సమయమని నీలగిరి భావిస్తాడు.

సామ్రాట్‌తో ఈ పెళ్లి జరిగితే దాక్షాయణి ఆస్తి మొత్తం తమ చేతికి వస్తుందని, సామ్రాట్ తమకు ఆస్తి తెచ్చిపెట్టే ఏటీఎమ్ మెషిన్ లాంటివాడని భావించి స్వార్థంతో కుట్రలు పన్నుతారు.

కుట్రదారులపై దాక్షాయణి ఆగ్రహం

మరోవైపు సామ్రాట్‌పై దాడి చేసిన వారిని అస్సలు వదిలిపెట్టనని, వెతికి పట్టుకుని తగిన శిక్ష విధిస్తానని దాక్షాయణి చంద్రకళతో అంటుంది. కొడుకు పరిస్థితి చూసి దాక్షాయణి కన్నీళ్లు పెట్టుకోగా, చంద్రకళ ఏమీ తెలియనట్లు కవర్ చేస్తూ తన ప్లాన్స్‌ను దాచుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ఆ తర్వాత చంద్రకళ మాటలు విన్న గిరిజ అనుమానంగా చూస్తుంది. నువ్వెవరు, ఎందుకు ఉన్నావని చంద్రకళను ప్రశ్నిస్తుంది. అదేంటండీ సామ్రాట్ గారిని మేమే కదా చూసుకోడానికి వచ్చింది అని మదన్ అంటాడు. సామ్రాట్‌ను చూసుకునేందుకు అబ్బాయివి నువ్వుంటే సరిపోతుందిగా కదా.. ఈ అమ్మాయి ఎందుకు అని గిరిజ ప్రశ్నిస్తుంది.

వెళ్లిపోయిన చంద్రను ఆపిన సామ్రాట్

దాంతో చంద్రకళ, మదన్ కంగారుపడిపోతారు. సామ్రాట్ కుటుంబసభ్యులు కరెక్టుగానే అడిగింది కదా అనుకుంటారు. నువ్వు వెళ్లిపో అమ్మాయి అని గిరిజ అంటుంది. దాంతో మరింత చంద్రకళ మరింత షాక్ అవుతుంది. ఇంట్లో ఉండేందుకు ఒప్పుకున్న దాక్షాయణి కూడా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది.

ఇక చేసేది ఏం లేక సరేనని చంద్రకళ వెళ్తుంటుంది. ఇంతలో చంద్ర ఎక్కడికి వెళ్లదు అని సామ్రాట్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. చంద్రకళ ఆశ్చర్యపోతూ సంతోషిస్తుంది. చంద్ర లేకుండా నేను ఇక్కడ ఉండలేను అని సామ్రాట్ అంటాడు.

చామంతి టెన్షన్

దాంతో మరింత సంబరపడిపోతుంది చంద్రకళ. చంద్రకళ ఉంటే సమస్య వస్తుందనుకున్న గిరిజ కుట్రను సామ్రాట్ తిప్పికొడతాడు. సామ్రాట్‌ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్న చామంతి మాత్రం తెగ కంగారుపడిపోతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More