Ninnu Kori September 16 Episode: నిన్ను కోరి.. షాకింగ్-దాక్షాయణి ఎంట్రీ-కొత్త జీవితంలోకి విరాట్-బావ కోసం చంద్ర వెతుకులాట

Ninnu Kori September 16 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 16 ఎపిసోడ్లో కథ అనూహ్య మలుపు తీసుకుంది. సామ్రాట్ రూపంలో ఉన్న విరాట్ నే తన కొడుకు అనుకొని దాక్షాయణి తన ఇంటికి తీసుకెళ్తుంది. విరాట్ ఎక్కడికి వెళ్లాడో తెలియక చంద్ర బాధలో మునిగిపోతుంది.

Published on: Sep 16, 2026, 09:40:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori September 16 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. విరాట్ కోసం జగదీశ్వరి ఫ్యామిలీ ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రకళ ఏం చేయాలో అర్థం కాదు. విరాట్ యాక్సిడెంట్, ఫేస్ స్వాప్ విషయం ఇంట్లోవాళ్లకు తెలియకుండా చంద్ర దాచిపెడుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

బావను తీసుకొస్తానని

భర్తను వెనక్కి తెచ్చుకోవాలనే ఆరాటంలో చంద్ర ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుంది. విరాట్ ప్రస్తుత రూపం మరొకరిదని, ఆ రూపం వెనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని చంద్రకు తెలుసు. అయినా ఆ నిజాన్ని అత్త జగదీశ్వరికి చెప్పకుండా దాచిపెడుతుంది.

"నేను బావ దగ్గరికే వెళ్తున్నాను అత్త. బావని తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడతాను" అని జగదీవ్వరితో చంద్ర ధీమాగా చెబుతుంది. జగదీశ్వరి ఎంత ఆపే ప్రయత్నం చేసినా వినకుండా, అబద్ధం ఆడిన చంద్ర తన ప్రయాణం మొదలెడుతుంది.

దాక్షాయణి ఎంట్రీ

సీన్ ఆస్పత్రికి మారగానే అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అక్కడ ఎమోషన్స్ తారాస్థాయికి చేరుకుంటాయి. సామ్రాట్ తల్లి దాక్షాయణి ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. ఆవేశంగా కారిడార్‌లోకి ఎంటర్ అయిన దాక్షాయణి.. బెడ్‌పై స్పృహ లేకుండా సామ్రాట్ ముఖంతో ఉన్న విరాట్ ను చూసి ఎమోషనల్ అవుతుంది.

ఇంటికి సామ్రాట్

బెడ్ పై ఉన్నది తన కన్న కొడుకు సామ్రాట్ అని దాక్షాయణి అనుకుంటుంది. అందుకే ట్రీట్‌మెంట్ అంతా తన ఇంట్లోనే జరగాలని పట్టుబట్టి డాక్టర్లను పక్కనపెట్టి మరీ అతన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది.

డాక్టర్ల బ్లాక్‌మెయిల్

ఆస్పత్రికి చేరుకున్న చంద్రకు తన భర్తను ఎవరో తీసుకెళ్లిపోయారన్న వార్త పిడుగుపాటులా మారుతుంది. "ఆయన నా భర్త" అని చంద్ర వాదిస్తున్నా.. డాక్టర్లు ఆమె గొంతు నొక్కేస్తారు. ఫేస్ స్వాప్ చట్టరీత్యా నేరమని, అసలు సామ్రాట్ బాడీని ఇప్పటికే దహనం చేశారని గుర్తుచేస్తూ బెదిరింపులకు దిగుతారు.

విరాట్‌ను తీసుకెళ్లిన వాళ్లు పెద్ద పలుకుబడి ఉన్నవాళ్లని డాక్టర్లు చెప్పడం, అటు మదన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చంద్ర ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోతుంది.

కొత్త ఇంటికి విరాట్

దాక్షాయణి ఇంటికి చేరుకున్న విరాట్‌కు స్పృహ వస్తుంది. కళ్లు తెరిచి చూడగానే చుట్టూ కొత్త మనుషులు, తెలియని వాతావరణం. వాళ్లంతా తనను 'సామ్రాట్' అంటుంటే.. "ఎవరు మీరు? నన్ను వదలండి!" అంటూ విరాట్ బెంబేలెత్తిపోతాడు.

తనకు గతం గుర్తులేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే దాక్షాయణి అతనికి పాత ఫోటోలు చూపించి శాంతింపజేస్తుంది. అక్కడే తమ్ముడు జీవన్, మరదలు చామంతి, తండ్రి కేశవరావుల పరిచయంతో విరాట్ పూర్తిగా ఒక కొత్త ఫ్యామిలీలోకి చేరిపోతాడు.

ఇదంతా మదన్ చాటు నుంచి గమనిస్తూనే ఉంటాడు. దాక్షాయణి విరాట్‌ను తీసుకెళ్తున్నప్పుడు ఫాలో అయిన మదన్.. ఆ ఇంట్లో విరాట్ పరిస్థితిని చూసి, ఒక పెద్ద సమస్యలో తమ వాడిని ఇరికించామని గ్రహించి సైలెంట్‌గా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

అసలు విరాట్ ఈ కొత్త 'సామ్రాజ్యం' నుంచి ఎలా బయటపడతాడు? ఎటు వెళ్లాలో తెలియక, ఎవరి సహాయం దొరక్క ఆస్పత్రిలో మిగిలిపోయిన చంద్ర తదుపరి అడుగు ఏంటి? అన్నది 'నిన్నుకోరి' రాబోయే ఎపిసోడ్లలో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More