Ninnu Kori September 15 Episode: నిన్ను కోరి.. ఆసుపత్రిలో అర్ధరాత్రి హైడ్రామా- విరాట్‌పై రౌడీల దాడి- చంద్ర టెన్షన్

Ninnu Kori September 15 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 15 ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఫేస్ మార్చుకున్న విరాట్ నే సామ్రాట్ అనుకొని రౌడీలు దాడి చేస్తారు. చంపాలని చూస్తారు. దీంతో విరాట్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరోవైపు విరాట్ ను ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పడంతో చంద్ర టెన్షన్ పడుతుంది.

Published on: Sep 15, 2026, 09:06:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ninnu Kori September 15 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఒకవైపు కుటుంబ సభ్యులకు నిజం తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం, మరోవైపు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న విరాట్ జీవితంలోకి ప్రవేశించిన కొత్త శత్రువులు... ఇలా ఈ ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మారింది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్ర టెన్షన్

విరాట్‌ను డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పడంతో చంద్రకళ టెన్షన్ పడుతుంది. ఫేస్ మారిపోయిన అతన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక చంద్ర తీవ్ర అయోమయంలో పడుతుంది. అత్తయ్య జగదీశ్వరికి నిజం చెప్పి ఇంటికి తీసుకువెళ్లాలని చంద్ర అనుకుంటుంది. అందుకు సిద్ధమవుతుంది.

విరాట్ పై అటాక్

అయితే ఆసుపత్రిలో ఊహించని సంఘటన జరుగుతుంది. రాత్రి వేళ కారిడార్‌లో లైట్లు డిమ్ అయిన సమయంలో, మారణాయుధాలు చేతబట్టి మాస్కులు ధరించిన ఇద్దరు రౌడీలు వస్తారు. నర్స్‌ను ఫాలో అవుతూ విరాట్ ఉన్న రూమ్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకుని లోపలికి ప్రవేశిస్తారు. నిద్రిస్తున్న విరాట్‌ను కత్తితో పొడవబోగా, గతం గుర్తులేకపోయినా తన అద్భుతమైన రిఫ్లెక్స్‌తో వారిని విరాట్ అడ్డుకుంటాడు.

సామ్రాట్ రహస్యం

ఈ ఫైటింగ్ లో ఒక రౌడీ.. "సామ్రాట్... నువ్వు ఎలా బతికావు రా? నువ్వు చావాలిరా!" అంటూ గట్టిగా అరుస్తూ దాడి చేస్తాడు. 'సామ్రాట్' అనే ఆ మాట వినగానే విరాట్ మెదడులో ఏదో నరం కట్ అయినట్లుగా అనిపించి, గందరగోళంతో కింద పడిపోతాడు. సరిగ్గా అదే సమయానికి మెడిసిన్స్ తీసుకుని వచ్చిన మదన్ అక్కడికి చేరుకుని రౌడీలను అడ్డుకోవడంతో, వారు కిటికీలోంచి దూకి పారిపోతారు.

విరాట్ కాదా?

స్పృహలోకి వచ్చిన తర్వాత విరాట్.. "నా పేరు విరాట్ కాదా? వాడు నన్ను సామ్రాట్ అని పిలిచాడు... నా పేరు సామ్రాట్ ఆ?" అంటూ ఆవేశంతో అరుస్తూ తలనొప్పితో విలవిల్లాడిపోతాడు. విరాట్‌కు ఉన్న కొత్త ముఖం సామ్రాట్‌ది కావడంతో శత్రువులు విరాట్‌నే సామ్రాట్ అనుకుని ఈ దాడికి పాల్పడ్డారని చంద్ర, మదన్ గ్రహిస్తారు. మరోవైపు ఈ ఎటాక్ మిస్ అయ్యిందని రౌడీలు తమ బాస్‌కు ఫోన్ చేసి చెప్పడం కథలో ఉత్కంఠను రేపుతోంది.

డాక్టర్ వార్నింగ్

విరాట్ ముఖం మారిన విషయం శత్రువులకు తెలియదని, ఈ ముఖం ఉన్నంత కాలం అతని ప్రాణాలకు ఎప్పుడైనా ప్రమాదమేనని చంద్రను డాక్టర్ హెచ్చరిస్తాడు. అతన్ని వెంటనే అక్కడి నుంచి తీసుకువెళ్లాలని సూచించడంతో చంద్ర కన్నీళ్లతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతుంది. ఉదయం మదన్ చేసిన ఫోన్ కాల్ విని చంద్ర తీవ్ర భయాందోళనతో పరుగులు తీస్తుంది.

శాలిని అనుమానం

మరోవైపు ఇంట్లో అత్తయ్య జగదీశ్వరి, మావయ్య రఘురాం ఏమీ తెలియక ప్రశాంతంగా ఉంటారు. అయితే శాలిని మాత్రం తెగ ఆలోచిస్తుంటుంది. విరాట్ అసలు ఆసుపత్రిలో లేడేమోనని, చంద్ర రేపు ఎవరిని ఇంటికి తీసుకువస్తుందో అని తీవ్రంగా అనుమానిస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా ఆలోచిస్తుంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

మరి, అసలు ఈ సామ్రాట్ ఎవరు? అతని పాత శత్రువుల నుంచి విరాట్ ప్రాణాలను చంద్ర, మదన్ ఎలా కాపాడుతారు? శాలిని అనుమానాలు ఏ విధంగా బలపడనున్నాయి? అన్నది రాబోయే ఎపిసోడ్లలో అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More