Ninnu Kori March 16 Episode: నిన్ను కోరి.. మాయకు చంద్ర సీరియస్ వార్నింగ్.. మాయ భర్త మిస్టరీ.. హేమంత్ పేరు వింటేనే వణుకు

Ninnu Kori March 16 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 16 ఎపిసోడ్ లో అత్తామామలు తనకు ఇచ్చిన నెక్లెస్ ను మాయ పెట్టుకోవడంపై చంద్రకళ సీరియస్ అవుతుంది. తన భర్త పేరు హేమంత్ అని చెప్పిన మాయ, బయట హేమంత్ పేరుతో ఉన్న ఓ అబ్బాయిపై అరిచేస్తుంది.

Published on: Mar 16, 2026, 07:49:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 16 ఎపిసోడ్ లో.. అత్తామామలు తనకు గిఫ్ట్ గా ఇచ్చిన నెక్లెస్ ను మాయ పెట్టుకోవడంతో చంద్రకళ కోప్పడుతుంది. ఎవరు పడితే వాళ్లు పెట్టుకోవడానికి ఇది మామూలు నెక్లెస్ కాదు. ఈ ఇంటి పెద్ద కోడలికి అత్తామామ అందించిన లాంఛనం. ఇది ధరించే హక్కు నాకే ఉంది అని చంద్రకళ సీరియస్ అవుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చంద్రకళ కోపం

సారీ అక్కా, తెలియకుండానే నిన్ను చాలా హర్ట్ చేశాను అని మాయ అంటుంది. నేను కోప్పడ్డానని ఫీల్ అయ్యావా? మొదటిసారిగా ఈ ఇంటి కోడలికి నాకు దక్కిన లాంఛనం ఇది. అందుకే అంత పొసెసివ్ గా ఫీల్ అయ్యానని చంద్రకళ చెప్తుంది. ఇంట్లో ఉన్న మనుషులు, వాళ్ల మధ్య ఉన్న బంధాల గురించి పేపర్ పై మాయ రాసింది చంద్ర చదువుతుంది. క్రాంతి, శాలిని మధ్య గొడవ ఏంటీ? అని మాయ అడుగుతుంది. చిన్న చిన్న గొడవలు అని చంద్ర చెప్తుంది.

బిడ్డకు ముద్దులు

చిన్నప్పటి విరాట్ ఫొటో చూస్తూ చంద్రకళ మాట్లాడుతుంది. విరాట్ కు చంద్ర కాల్ చేస్తుంది. కడుపులో బిడ్డతో మాట్లాడుతూ విరాట్ ముద్దులిస్తాడు. ఆ ఫొటోలో సగం ప్రాణం నింపి వచ్చానని విరాట్ చెప్తాడు. విరాట్, చంద్ర మాట్లాడుకుంటుండగా మాయ వస్తుంది. ప్రేమగా చూసుకునే హస్బెండ్, ఆప్యాయంగా చూసుకునే ఫ్యామిలీ దక్కినందుకు నువ్వు చాలా హ్యాపీ అని మాయ అంటుంది.

మాయ సీరియస్

చంద్రకళ, శ్యామల, మాయ వాకింగ్ కు వెళ్తారు. మాయను నీ భర్త పేరు ఏంటి అని మాయను శ్యామల అడుగుతుంది. అప్పుడే హేమంత్ అంటూ అరుస్తూ ఓ అమ్మాయి తన లవర్ వెనకాల పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి హేమంత్ చీటర్ అని మాయ అరుస్తుంది. చంద్ర అడిగితే తన భర్త పేరు హేమంత్ అని, ఆ పేరు వినగానే పానిక్ అయిపోతానని మాయ చెప్తుంది. నువ్వు జరిగింది మర్చిపోవాలి మాయ, అప్పుడే హ్యాపీగా ఉంటావని చంద్ర చెప్తుంది.

శ్రుతి జంప్

మరోవైపు ఆఫీస్ లో రాజ్, శ్రుతి ఉంటారు. కారు ఒక్కటే ఉంది కదా అని కీస్ తీసుకుని నెమ్మదిగా శ్రుతి జారుకుంటుంది. సరోజా వచ్చి ఉన్న ఒక్క కారును నీ భార్య తీసుకెళ్లిందని రాజ్ కు చెప్తుంది. కస్టమర్ చిరాకుగా వెళ్లిపోతాడు. కారు ఇంజిన్ ప్రాబ్లెం ఉందని డ్రైవర్ వచ్చి చెప్తాడు. శ్రుతి తిక్క కుదిరిందని సరోజా అంటుంది.

ప్రెగ్నెంట్ పెద్ద కోడలు

క్రాంతి ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడే శాలినిని పిలిచిన రఘురాం నీ కడుపులో బిడ్డ కోసం వాడు ఫ్రూట్స్ తెచ్చాడని అంటాడు. వెంటనే తన భర్తపై జగదీశ్వరి కోప్పడుతుంది. ప్రెగ్నెంట్ గా ఉంది నీ పెద్ద కోడలు అని కామాక్షి గుర్తు చేస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More