#NTRNEEL: మీ డెమిగాడ్ సిద్ధంగా ఉన్నాడు: ఎన్టీఆర్ నీల్ మేకర్స్ నుంచి మరో అదిరిపోయే అప్డేట్
#NTRNEEL: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #NTRNeel ఫస్ట్ గ్లింప్స్ ఈరోజు (మే 19) రాత్రి 11:52 గంటలకు విడుదల కానుంది.
#NTRNEEL: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ (#NTRNeel) నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు కానుకగా ఒక రోజు ముందే అంటే ఈరోజు (మే 19) రాత్రి 11:52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ అప్డేట్
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ అర్ధరాత్రి రాబోతోందని ముందే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ట్వీట్ చేశారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను పంచుకుంది.
"డియర్ టైగర్ నేషన్ (తారక్ అభిమానులను ఉద్దేశించి).. ఎక్కడ చూసినా సంతోషం, ఆకలి, ఎమోషన్స్ అప్పుడే మొదలయ్యాయని అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత రాబోయే కొన్ని గంటలు మనందరికీ చాలా పర్సనల్‌గా అనిపిస్తాయి. వాతావరణాన్ని మళ్లీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి మీ డెమిగాడ్ సిద్ధంగా ఉన్నాడు" అంటూ పోస్టర్‌లో రాసుకొచ్చారు.
ఈ చిత్రంలో సృష్టించిన కొత్త ప్రపంచాన్ని, అందులోని పాత్రలను, ముఖ్యంగా ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ గ్లింప్స్‌లో చూపించబోతున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ షాడో లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: #NTRNeel ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జవాబు: ఈరోజు రాత్రి 11:52 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.
ప్రశ్న: ఎన్టీఆర్ నీల్ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరు?
జవాబు: ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ప్రశ్న: ఎన్టీఆర్ నీల్ సినిమాను ఏ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి?
జవాబు: మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


