టైమ్‌కి రావడం కాదు కదా.. కొందరైతే అసలు సెట్స్‌కే రారు: ఓజీ మూవీ విలన్ చేసిన కామెంట్స్ ఎవరి గురించి?

ఓజీ మూవీలో విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన నెక్స్ మూవీ హక్ (Haq) ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. కొందరు యాక్టర్స్ అసలు సెట్స్ కే రారు అని అనడం గమనార్హం.

Published on: Oct 28, 2025, 16:12:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుసు కదా. ఈ మధ్యే పవన్ కల్యాణ్ నటించిన ఓటీ మూవీలో విలన్ గా కనిపించాడు. ప్రస్తుతం యామీ గౌతమ్‌తో కలిసి నటించిన తన రాబోయే మూవీ 'హక్' (Haq) విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు యాక్టర్స్ సమయానికి సెట్స్ కు రావడం, రాకపోవడంపై అతడు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టైమ్‌కి రావడం కాదు కదా.. కొందరైతే అసలు సెట్స్‌కే రారు: ఓజీ మూవీ విలన్ చేసిన కామెంట్స్ ఎవరి గురించి?
టైమ్‌కి రావడం కాదు కదా.. కొందరైతే అసలు సెట్స్‌కే రారు: ఓజీ మూవీ విలన్ చేసిన కామెంట్స్ ఎవరి గురించి?

కొందరైతే అసలు రానే రారు

ఓజీ మూవీలో విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి ఈ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా యాక్టర్స్ సమయానికి సెట్స్ కి రావడంపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అతడు స్పందించాడు. తన హక్ మూవీ కోస్టార్ యామీ గౌతమ్ ప్రొఫెషనలిజాన్ని ప్రశంసించాడు. “నేను ఇదంతా ముందే ఊహించాను. ఆమె ప్రొఫెషనలిజం నాకు తెలుసు. సెట్స్ కు సమయానికి వచ్చే కొద్ది మంది యాక్టర్స్ లో ఆమె ఒకరు. నాలాగే. అందులో సమస్య లేదు” అని అన్నాడు.

ఇప్పటికే కొందరు టైమ్ కి రావడం లేదా అని రిపోర్టర్ అడగగా.. కొందరైతే అసలు రానే రారు.. సమయానికి రావడం కాదు కదా అసలు రారు అని ఇమ్రాన్ హష్మి అనడం విశేషం. దీంతో అతడు ఎవరి గురించి ఈ కామెంట్స్ చేశాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆ యాక్టర్స్ ఎవరన్నదానిపై చర్చించుకుంటున్నారు.

ఆ వెబ్ సిరీస్‌లో క్యామియోపై..

ఇక ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో తాను అతిథి పాత్ర పోషించడంపైనా ఇమ్రాన్ హష్మి స్పందించాడు. హక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా స్టేజ్ పై అతడు ఇలా అన్నాడు. “కొన్ని రోజుల క్రితమే ఆర్యన్, రెడ్ చిల్లీస్ బృందంతో నేను మాట్లాడాను. ఇది వైరల్ అవుతుందని మాకు తెలుసు. కానీ ఈ స్థాయిలో అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇది నేర్చుకోవాల్సిన పాఠం అని అనుకుంటున్నాను” అని ఇమ్రాన్ చిరునవ్వుతో అన్నాడు.

తనకు చాలా కాలంగా అంటుకుపోయిన 'సీరియల్ కిస్సర్' ఇమేజ్ ఇప్పటికీ తనను ఎలా వెంటాడుతోందో అని అతడు నవ్వుతూ చెప్పాడు. "నాకు తెలుసు ఇంతకుముందు అభిమానులు పేరు పెట్టి పిలిచేవారు.. లేదా 'S' తో మొదలయ్యే మరొక ఇమేజ్ ఉండేది. నేను ఆ పేరు ప్రస్తావించను. లేదంటే రాత్రి మొత్తం దీని గురించే చర్చ జరుగుతుంది" అని చమత్కరించాడు. తన ఇమేజ్‌కు బదులుగా అభిమానులు తన డైలాగ్‌లు, నటనను అభినందించడం చూసి చాలా సంతోషంగా ఉందని ఇమ్రాన్ అన్నాడు.

'హక్' చిత్రం గురించి..

ఇమ్రాన్ హష్మి, యామీ గౌతమ్ జంటగా నటించిన మూవీ హక్. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. షా బానో కేసు స్ఫూర్తితో రూపొందిన మూవీ ఇది. ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో ఇస్లాం సమాజంలో విడాకుల అంశం గురించి చూపించబోతున్నారు. ముస్లిం పర్సనల్ లా, సెక్యులర్ లా మధ్య జరిగే పోరును ఈ మూవీలో చూపించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే ఆసక్తి రేపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More