Sai Pallavi: సాయి పల్లవి అద్భుతమైన నటే.. కానీ సీతకు ఇలా కర్లీ హెయిర్ ఉండదు: ‘సీరియల్ సీత’ దీపికా షాకింగ్ కామెంట్స్
Sai Pallavi: సాయి పల్లవి అద్భుతమైన నటే అయినా.. ఆమె సీత పాత్రకు సెట్ అవుతుందో లేదో మూవీ చూస్తేనే తెలుస్తుందని ఒరిజనల్ రామాయణం సీరియల్ సీత దీపికా కామెంట్ చేశారు. సీతకు ఇలా కర్లీ హెయిర్ ఉంటుందని ఎక్కడా లేదని ఆమె అనడం గమనార్హం.
Sai Pallavi: రామానంద్ సాగర్ క్లాసిక్ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో సీతగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి దీపికా చిక్లియా.. బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ లో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి (Sai Pallavi) పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో సాయి పల్లవి సీతగా ఎలా కనిపిస్తుందో ఊహించలేకపోతున్నానని ఆమె వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సీతా దేవి ఎలా ఉంటుందంటే?
తులసీదాస్ రాసిన రామచరితమానస్‌లో సీతాదేవి వర్ణన చాలా స్పష్టంగా ఉందని దీపికా చిక్లియా చెప్పారు. బాదం పప్పు ఆకారపు కళ్లు, నిర్దిష్టమైన రూపురేఖలతో ఉండేలా వర్ణించారు. ఆ రోజుల్లో రామానంద్ సాగర్ సరిగ్గా అలాంటి పోలికలు ఉన్న నటి కోసం వెతికి తనను ఎంపిక చేశారని దీపికా చిక్లియా గుర్తుచేసుకున్నారు.
“సీతాదేవికి కర్లీ హెయిర్ ఉన్నట్లు ఎక్కడా లేదు”
సాయి పల్లవి చాలా అద్భుతమైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదని దీపికా చెప్పారు. అయితే రామాయణంలో సీతాదేవికి కర్లీ హెయిర్ (ముంగురులు) ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. స్క్రీన్ మీద ఆమెను సీత రూపంలో చూస్తే తప్ప ఆ లుక్ ఎంతవరకు సెట్ అవుతుందో చెప్పలేమని ఆమె అన్నారు.
కొవిడ్ సమయంలో దూరదర్శన్‌లో మళ్లీ ప్రసారమైన రామానంద్ సాగర్ ‘రామాయణ్’ కొత్త తరం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రజల మనస్సుల్లో బలంగా నాటుకుపోయిన ఆ ఒరిజినల్ ఐకానిక్ ఇమేజ్‌ను చెరిపేయడం కొత్త సినిమాకు చాలా కష్టమైన విషయమని దీపికా అభిప్రాయపడ్డారు.
టైప్‌కాస్ట్ వివాదం.. రణ్‌బీర్ కపూర్ విభిన్న పాత్రలు
ఆ సీరియల్లో దీపికతో కలిసి రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్.. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణంలో దశరథ మహారాజుగా నటిస్తుండటం విశేషం. ఆ రోజుల్లో సీతగా నటించడం వల్ల తన కెరీర్ అక్కడితో ఆగిపోయిందని, వేరే ఆఫర్లు రాక టైప్‌కాస్ట్ అయిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఇప్పటి కాలంలో రణ్‌బీర్ కపూర్ 'బర్ఫీ', 'సంజు', 'యానిమల్' లాంటి విభిన్నమైన సినిమాలు చేస్తూనే రాముడిగా నటించగలగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నటులుగా వేర్వేరు రోల్స్ చేయడం ఈ తరం యాక్టర్లకు దక్కిన అవకాశమని కొనియాడారు.
కామిక్-కాన్ లో షాక్.. రామాయణం ట్రైలర్ వాయిదా
మరోవైపు శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC 2026) వేదికగా విడుదల కావలసిన 'రామాయణం' అధికారిక ట్రైలర్ చివరి నిమిషంలో పోస్ట్‌పోన్ అయ్యింది. గ్లోబల్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్'తో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకోవడంతో ట్రైలర్‌ను త్వరలోనే మరో గ్రాండ్ డేట్‌లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
రాక్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీని దాదాపు రూ. 4,000 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటంతో గ్లోబల్ లెవెల్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. రామాయణం పార్ట్-1 ను దీపావళి 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


