OTT: ఓటీటీ ఆడియెన్స్ 66.5 కోట్లు.. కేబుల్ టీవీకి గుడ్‌బై చెబుతున్న ఇండియన్స్.. లేటెస్ట్ రిపోర్టులో షాకింగ్ నిజాలు
OTT: ఓటీటీ అంటే కొన్నేళ్ల కిందట తెలిసింది చాలా తక్కువ మందికే. కానీ ఇప్పుడు గ్రామీణ భారతానికి కూడా ఓటీటీ విప్లవం పాకింది. ప్రతి ఏటా ఇండియాలో ఓటీటీ ఆడియెన్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా అది 66.5 కోట్లకు చేరడం విశేషం.
OTT: ఇండియాలో ఓటీటీ వినోద రంగం ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఆర్మాక్స్ మీడియా' (Ormax Media) వెల్లడించిన లేటెస్ట్ నివేదిక ప్రకారం.. ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ సంఖ్య ఏకంగా 11 శాతం పెరిగి 665 మిలియన్లకు (66.5 కోట్లు) చేరుకుంది. మనదేశంలో డిజిటల్ కంటెంట్ వినియోగం ఎంత వేగంగా విస్తరిస్తుందో ఈ గణాంకాలు స్పష్టంగా చూపుతున్నాయి.

60 శాతం పెరిగిన కనెక్టెడ్ టీవీలు.. లివింగ్ రూమ్‌లో సరికొత్త విప్లవం
ఈ ఆర్మాక్స్ నివేదికలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కనెక్టెడ్ టీవీ (Connected TV / CTV) యూజర్ల సంఖ్య ఏకంగా 60 శాతం పెరగడం. ఒకప్పుడు కేవలం స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన ఓటీటీ వినోదం.. ఇప్పుడు నేరుగా ఇళ్లలోని లివింగ్ రూమ్‌లకు చేరింది.
స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ విస్తరించడం వల్ల ప్రజలు కేబుల్ టీవీ, డీటీహెచ్‌లకు స్వస్తి చెప్పి స్మార్ట్ టీవీల్లో ఓటీటీలు చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
రీజినల్ కంటెంట్ ధమాకా.. తెలుగు, సౌత్ ఇండియన్ సినిమాల హవా
ఇండియాలో ఓటీటీ ఆడియన్స్ వేగంగా పెరగడానికి రీజినల్ కంటెంట్, ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. థియేటర్లలో మిస్సయిన సినిమాలను కొన్ని వారాలు లేదా నెల రోజుల్లోనే ఓటీటీలో చూసే సౌకర్యం ఉండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఆడియన్స్ ఓటీటీల వైపు క్యూ కడుతున్నారు.
ఆహా (Aha), ఈటీవీ విన్ లాంటి ప్రత్యేక తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సోనీ లివ్ లాంటి దిగ్గజ సంస్థలు ప్రాంతీయ భాషల ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఫ్రీ కంటెంట్‌తోపాటు పెయిడ్ సబ్‌స్క్రిప్షన్
ఇండియాలో ఓటీటీ యూజర్లలో అత్యధిక భాగం ఉచితంగా లభించే యాడ్ సపోర్టెడ్ (AVOD) కంటెంట్‌ను వీక్షిస్తున్నారు. అయితే కనెక్టెడ్ టీవీల వినియోగం పెరగడంతో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు (SVOD) తీసుకునే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే రోజుల్లో సాంప్రదాయ టీవీ ప్రసారాల కంటే ఇంటర్నెట్ ఆధారిత కనెక్టెడ్ టీవీ స్ట్రీమింగే వినోద రంగాన్ని ఏలబోతోందని ఈ నివేదిక తేల్చిచెప్పింది. ప్రొడక్షన్ హౌస్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇకపై టీవీ వీక్షకులను టార్గెట్ చేస్తూ కంటెంట్‌ను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది.
భారీ మొత్తాలకు ఓటీటీ హక్కులు
ఒకప్పుడు కొత్త సినిమాలు వస్తుంటే ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటీటీ హక్కులకు వీటి కంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కొన్ని స్టార్ల సినిమాలైతే షూటింగులు కూడా మొదలవక ముందే కోట్ల డిమాండ్ పలుకుతున్నాయి. తెలుగు సహా సౌత్ ఇండియా స్టార్ల సినిమాల కోసం ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారీగా ఖర్చు చేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


