OTT Comedy: శోభనం రాత్రి ఏం జరిగింది.. ఓటీటీలోకి మైత్రీ మూవీ మేకర్స్ తమిళ కామెడీ థ్రిల్లర్.. 8.8 రేటింగ్.. తెలుగులోనూ..

OTT Comedy: తెలుగు ఫిల్మ్ మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మొద రాత్రి ఈవారం ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది.

Published on: Sep 16, 2026, 14:12:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Comedy: టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో నిర్మించిన ఇంట్రెస్టింగ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'మొద రాత్రి' (Modha Rathiri) డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ లాక్ అయింది. ఈ మధ్యనే థియేటర్లలో సందడి చేసిన ఈ డిఫరెంట్ ఫిల్మ్.. ఈ వారమే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది.

OTT Comedy: శోభనం రాత్రి ఏం జరిగింది.. ఓటీటీలోకి మైత్రీ మూవీ మేకర్స్ తమిళ కామెడీ థ్రిల్లర్.. 8.8 రేటింగ్.. తెలుగులోనూ..
OTT Comedy: శోభనం రాత్రి ఏం జరిగింది.. ఓటీటీలోకి మైత్రీ మూవీ మేకర్స్ తమిళ కామెడీ థ్రిల్లర్.. 8.8 రేటింగ్.. తెలుగులోనూ..

సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం 'మొద రాత్రి' (మొదటి రాత్రి, శోభనం రాత్రి) సినిమా సెప్టెంబర్ 18, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు భాషలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 8.8 రేటింగ్ నమోదైంది.

తెలుగు డబ్బింగ్ కూడా ఉండటంతో మన ఓటీటీ ఆడియన్స్‌కు ఈ కామెడీ మిస్టరీ డ్రామా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. థియేటర్‌లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మొద రాత్రి కథ, నటీనటుల పర్‌ఫార్మెన్స్

ఈ సినిమాతో రాజా కరుప్పసామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే ఒక ప్రత్యేకమైన కామెడీ డ్రామాకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి కథను చాలా ఆసక్తికరంగా మలిచారు. ఒక్క రాత్రిలో అంటే శోభనం రాత్రిలో ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు పెద్దల బలవంతంతో అరేంజ్డ్ మ్యారేజీ చేసుకోవడం, మొదటి రాత్రి వాళ్ల మధ్య ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా ఎలా బయటపడ్డాయన్నది ఇందులో చూడొచ్చు.

సినిమాలో రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్, కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను బాగా అలరిస్తాయి. ఇక సపోర్టింగ్ రోల్స్‌లో భగవతి పెరుమాళ్, ఎ. వెంకటేష్, చేతన్, అబ్దుల్ లీ, షెల్లీ కిషోర్, సంగీతా బాలన్, భానుప్రియ లాంటి సీనియర్ ఆర్టిస్టులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

మొద రాత్రి థియేటర్లలో ఇలా.. ఓటీటీలో ఏం చేస్తుందో?

ఆగస్టు 21, 2026న ఈ సినిమా తమిళనాడులో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిటిక్స్ నుంచి యావరేజ్ రివ్యూస్ వచ్చినా, ఆడియన్స్ నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

కామెడీ, మిస్టరీ కలిసి ఉండే డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండటంతో ఇంకా ఎక్కువ మంది డిజిటల్ వీక్షకులకు చేరువవుతుందని భావిస్తున్నారు.

‘ఇరుముడి’తో పాటు ఒకే రోజు ఓటీటీలోకి..

ఒకే రోజు థియేటర్లలోకి వచ్చిన రెండు సినిమాలు మళ్లీ అదే రోజు ఓటీటీలోకి వస్తుండటం విశేషం. ఆగస్టు 21న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' అలాగే తమిళ చిత్రం 'మొద రాత్రి' ఒకేసారి రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 18న ఒకేసారి నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. మైత్రీ బ్యానర్ నుంచి వస్తున్న ఈ రెండు వైవిధ్యమైన సినిమాలను నెట్‌ఫ్లిక్స్ ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More