OTT Show: మా సీతమ్మ అని పిలుస్తున్నారు: ఓటీటీలోకి సూపర్ హిట్ టాక్ షో రెండో సీజన్.. తొలి గెస్ట్‌గా సాయి పల్లవి

OTT Show: ఓటీటీలోకి జగపతి బాబు సూపర్ హిట్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా రెండో సీజన్ వస్తోంది. తొలి గెస్ట్ గా సాయి పల్లవి రానుండటం హైలైట్ గా నిలవనుంది. ఇందులో ఆమె తన నెక్ట్స్ మూవీ రామాయణ గురించి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో చూడండి.

Published on: Oct 13, 2026, 17:42:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Show: బుల్లితెరపై సంచలనం సృష్టించిన సెలెబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి' (Jayammu Nischayammu Raa Season 2) ఇప్పుడు సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ పాపులర్ టాక్ షో గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు సౌత్ ఇండియా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) మొదటి గెస్ట్‌గా హాజరై సందడి చేశారు.

OTT Show: మా సీతమ్మ అని పిలుస్తున్నారు: ఓటీటీలోకి సూపర్ హిట్ టాక్ షో రెండో సీజన్.. తొలి గెస్ట్‌గా సాయి పల్లవి
OTT Show: మా సీతమ్మ అని పిలుస్తున్నారు: ఓటీటీలోకి సూపర్ హిట్ టాక్ షో రెండో సీజన్.. తొలి గెస్ట్‌గా సాయి పల్లవి

ఎప్పుడూ సినిమాల ప్రమోషన్లలో గంభీరంగా మాట్లాడే సాయి పల్లవి, ఈ షోలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను, కెరీర్ ముచ్చట్లను చాలా ఓపెన్‌గా పంచుకున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా అక్టోబర్ 16, 2026 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా, అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది.

'రామాయణం' సీతమ్మ పాత్రపై సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్

ఈ ఎపిసోడ్‌కు ఉన్న అతిపెద్ద ఆకర్షణ సాయి పల్లవి రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) ప్రాజెక్టే. ఈ సినిమాలో సీతా దేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఆమె ఇస్తున్న ఫస్ట్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు తనను 'మా సీతమ్మ' అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారని, ఆ మాట విన్నప్పుడు తనకు కలిగే ఎమోషన్‌ను మాటల్లో చెప్పలేనని సాయి పల్లవి తెలిపారు. జగపతి బాబు తనదైన మార్క్ సీరియస్, ఫన్నీ క్వశ్చన్స్‌తో సాయి పల్లవి నుంచి ఆసక్తికర సమాధానాలను రాబట్టారు.

జగపతి బాబు హోస్టింగ్.. రొటీన్ ప్రమోషన్లకు భిన్నంగా..

గత సీజన్ 1లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి అగ్ర తారలు పాల్గొని తమ వ్యక్తిగత జీవిత రహస్యాలను పంచుకుని ఈ షోను సక్సెస్ చేశారు. సాధారణ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల లాగా కాకుండా, సెలెబ్రిటీల తెరవెనుక జీవితాలను, వారి చిన్ననాటి జ్ఞాపకాలను, ఎదుర్కొన్న సవాళ్లను చాలా సహజంగా ఆవిష్కరించడం ఈ షో ప్రత్యేకత.

'ఫిదా' భానుమతిగా తెలుగు ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన సాయి పల్లవి, తన డ్యాన్స్ ప్రయాణం, మెడిసిన్ చదివే రోజుల్లో అనుభవాలు, సినిమాల్లోకి రావడం వెనుక ఉన్న కథను ఈ షోలో ఎంతో సరదాగా పంచుకున్నారు. జగపతి బాబు సీనియారిటీ, సాయి పల్లవి నాచురల్ ఆటిట్యూడ్ కలగలసి ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి.

సోషల్ మీడియాలో ఇప్పటికే రిలీజైన 'జయమ్ము నిశ్చయమ్ము రా 2' రీల్స్, ప్రోమోలు రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. స్టార్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఒక సాధారణ మనిషిగా సాయి పల్లవి ఆవిష్కరించిన తీరును చూడటానికి నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి జీ5లో ఈ ఎపిసోడ్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More