ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు ఓటీటీల్లో చూసేయండి

ఈవారం ఓటీటీలోకి ఎన్నో ఇంట్రెస్టింగ్ మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ వచ్చాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో తెలుసుకోండి. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో చూడొచ్చు.

Published on: Nov 21, 2025, 22:13:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీల్లోకి ప్రతి వారం ఎన్నో మలయాళం మూవీస్ వస్తుంటాయి. అయితే ఈవారం మాత్రం పెద్దగా రాలేదు. మనోరమ మ్యాక్స్ లోకి రెండు సినిమాలు మాత్రం వచ్చాయి. అయితే గత వారం కూడా వచ్చినవి కలిపితే.. ఈ వీకెండ్ చూడాల్సిన మలయాళం కంటెంట్ ఏంటో తెలుసుకోండి.

ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు ఓటీటీల్లో చూసేయండి
ఈవారం ఓటీటీల్లో మిస్ కాకుండా చూడాల్సిన మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఈ ఐదు ఓటీటీల్లో చూసేయండి

ఓటీటీ మలయాళం మూవీస్, వెబ్ సిరీస్

ఈ వారం మలయాళంలో ఓటీటీ ప్రీమియర్‌లు తక్కువగా ఉన్నాయి. కేవలం రెండు సినిమాలు మనోరమ మ్యాక్స్‌లో విడుదలయ్యాయి. అయితే ఇటీవల వచ్చిన కొన్ని మంచి సినిమాలు ఈ వీకెండ్ లో చూడదగినవిగా ఉన్నాయి. అవేంటో చూడండి.

ప్రైవేట్ - మనోరమ మ్యాక్స్

విభిన్న నేపథ్యాలు గల ఇద్దరు అపరిచితుల మధ్య ఊహించని స్నేహం, భావోద్వేగాలను అన్వేషించే కథ ఇది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ ఓటీటీలో చూడొచ్చు. ఇంద్రన్స్, మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో ఆదరిస్తున్నారు.

అవిహితం - జియోహాట్‌స్టార్

అవిహితం ఓ భిన్నమై స్టోరీతో వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఓ జంట అక్రమ సంబంధం చుట్టూ తిరిగే మూవీ ఇది. అయితే దీనికి కామెడీని జోడించి చివరి వరకూ ఓ సస్పెన్స్ క్రియేట్ చేసిన తీరు ఆకట్టుకుంది.

సంఘర్ష ఘడన - సన్ నెక్ట్స్ ఓటీటీ

ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ. అయితే ఈ సంఘర్ష ఘడన సినిమాటిక్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాను సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు. క్రిషంద్ లీడ్ రోల్లో నటించాడు.

వాలా - ప్రైమ్ వీడియో

డార్క్ కామెడీని ఇష్టపడేవారికి ఈ వాలా మూవీ నచ్చుతుంది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్‌తో పాటు ఇతర నటీనటుల నటన కూడా ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోతోపాటు సైనా ప్లేలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇన్‌స్పెక్షన్ బంగ్లా - జీ5 ఓటీటీ

ఇదొక మలయాళం హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ జానర్లో ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తొలి సిరీస్ ఇది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దెయ్యాలు ఉన్న ఓ పాత బిల్డింగ్ లోకి మారే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. హారర్ తోపాటు కామెడీనీ పంచుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More