OTT Review: ఉన్మాదం రివ్యూ.. మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. శాపగ్రస్తమైన ఆ కేస్ ఫైల్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? మస్ట్ వాచ్
OTT Unmadham Movie Review: మలయాళం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి కోసం మరో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ నటుడు కుంచాకో బోబన్ లీడ్ రోల్లో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పేరు ఉన్మాదం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
OTT Unmadham Movie Review: మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఇంటెన్స్ సైకలాజికల్ పోలీస్ థ్రిల్లర్ మూవీ 'ఉన్మాదం' (Unmadham) ఈరోజు అంటే శుక్రవారం (సెప్టెంబర్ 4) సోనీ లివ్ ఓటీటీలోకి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. జులై 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు 'నాయట్టు', 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన స్టార్ రైటర్ షాహి కబీర్ కథ అందించారు. ఈ డార్క్ థ్రిల్లర్‌లో కుంచాకో బోబన్ హీరోగా నటించారు. సీట్ ఎడ్జ్ నెరేషన్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

ఉన్మాదం మూవీ రివ్యూ
• సినిమా పేరు: ఉన్మాదం
• నటీనటులు: కుంచాకో బోబన్ (షెల్లీ), లిజోమోల్ జోస్ (సౌమ్య)
• డైరెక్టర్: కిరణ్ దాస్
• రచయిత: షాహి కబీర్
• జానర్: సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
• ఓటీటీ: సోనీ లివ్
• ఓటీటీ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 4
ఉన్మాదం మూవీ కథ ఏంటంటే?
షెల్లీ (కుంచాకో బోబన్) ఒక పోలీస్ ఆఫీసర్. వృత్తిరీత్యా ఖాకీ డ్రెస్ వేసుకున్నా, మనసంతా సినిమాలకు స్క్రిప్ట్ రాయాలనే కోరికతో నిండిపోతుంది. అతను రాసే ప్రతీ స్క్రిప్ట్ రిజెక్ట్ కావడంతో బాగా నిరాశలో కూరుకుపోతాడు. మరోవైపు అతని భార్య సౌమ్య (లిజోమోల్ జోస్) ఇల్లు గడవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి తీవ్రంగా కష్టపడుతుంటుంది.
స్క్రిప్ట్ రైటింగ్‌లో ఫెయిల్ కావడంతో షెల్లీ మళ్లీ పోలీస్ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఒక అసైన్‌మెంట్ ఫెయిల్ అవ్వడంతో వేరే పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ సెక్షన్ 174 కింద నమోదైన ఒక పాత ఆత్మహత్య కేస్ ఫైల్ గురించి తెలుసుకుంటాడు. ఆ ఫైల్‌ను ముట్టుకుంటేనే వింత ప్రమాదాలు జరుగుతాయనే ఒక మూఢ నమ్మకం ఆ పోలీస్ స్టేషన్ లో ప్రచారంలో ఉంటుంది.
ఒక స్క్రిప్ట్ రచయితగా ఆ కేస్ వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి, దాన్నే ఒక సినిమాగా మార్చాలని షెల్లీ ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే వింత అనుభవాలు, ఆ కేసు పరిష్కరించేందుకు షెల్లీ పడే ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలే మిగిలిన కథ.
ఉన్మాదం మూవీ ఎలా ఉందంటే?
డైరెక్టర్ కిరణ్ దాస్ ఎడిటర్‌గా కేరళ స్టేట్ అవార్డ్ గెలుచుకున్న నైపుణ్యాన్ని ఈ సినిమాలో చక్కగా ఉపయోగించారు. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా, క్యారెక్టర్ల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ సాగుతుంది. షాహి కబీర్ తన మార్క్ సీట్ ఎడ్జ్ రైటింగ్‌తో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని మానసిక ఒత్తిళ్లను తెరపై ఆవిష్కరించారు.
అయితే సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కథ కొద్దిగా గందరగోళంగా మారుతుంది. కేసును పరిష్కరించే క్రమంలో హీరో ఎదుర్కొనే ఇబ్బందులు, మానసిక ఆందోళనలు స్టోరీని కాస్త పక్కదారి పట్టించినట్లు అనిపిస్తుంది. అయితే ఊహకందని ట్విస్టులు, ఓ మర్డర్ ను ఆత్మహత్యగా మార్చేందుకు జరిగిన ప్రయత్నం థ్రిల్ కు గురి చేస్తాయి. ఓవరాల్ మూవీ ముగిసే సమయానికి ఓ మంచి సైకలాజికల్ థ్రిల్లర్ చూసిన అనుభూతి కలుగుతుంది.
ఉన్మాదం.. ఎవరెలా చేశారంటే?
షెల్లీ క్యారెక్టర్‌లో కుంచాకో బోబన్ వన్ మ్యాన్ షో చేశారు. తన పాత్రలోని లోపాలను, సైకలాజికల్ షేడ్స్‌ను చాలా నేచురల్‌గా ప్రెజెంట్ చేశారు. 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఓర్పు, సహనం ఉన్న భార్యగా ఆమె పర్ఫార్మెన్స్ మెప్పించింది.
మొత్తానికి 'ఉన్మాదం' పర్ఫెక్ట్ క్లాసిక్ కాకపోయినా, ఒక డిఫరెంట్ సైకలాజికల్ పోలీస్ డ్రామాను ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే థ్రిల్లర్ ప్రియులకు మంచి ఛాయిస్. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ చూడటానికి ప్లాన్ చేసుకోండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


