OTT Malayalam: ఓటీటీలోకి ఈవారం 2 క్రేజీ మలయాళం మూవీస్, ఓ సిరీస్.. సస్పెన్స్ థ్రిల్లర్, థ్రిల్లర్
OTT Malayalam: మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రెండు సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' (I'm Game), హాస్పిటల్ సస్పెన్స్ డ్రామా 'ICU'తో పాటు ఓ ఫ్యామిలీ సిరీస్ కుంజుమలాఖ కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.
OTT Malayalam: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలు, థ్రిల్లింగ్ యాక్షన్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు మలయాళ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 2 నుంచి నవంబర్ 8 (2026) మధ్య కాలంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న 4 మోస్ట్ అవేటెడ్ మలయాళ మూవీస్, సిరీస్ వివరాలు ఇవే.

1. ఐయామ్ గేమ్ (I'm Game) - జియోహాట్‌స్టార్ (నవంబర్ 6)
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రెండు నెలల విరామం తర్వాత డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెడుతోంది.
ఆర్డీఎక్స్ మూవీ ఫేమ్ నహాస్ హిదాయత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ తోపాటు ఆంటోనీ వర్గీస్, కయాదు లోహర్, మిస్కిన్ లాంటి వాళ్లు నటించారు. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన యాక్షన్ ప్రేమికులకు ఇది బెస్ట్ ఛాయిస్.
2. ICU: అంటిల్ ద లాస్ట్ బ్రీత్ - సన్ నెక్ట్స్ (నవంబర్ 6)
హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ‘ICU: అంటిల్ ద లాస్ట్ బ్రీత్’ (ICU - Until The Last Breath). 1 గంట 51 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఆద్యంతం మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో సాగుతుంది. జార్జ్ వర్గీస్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి, మీరా వాసుదేవ్, శ్రీకాంత్ మురళిలాంటి వాళ్లు ఇందులో నటించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, తీవ్ర ఒత్తిడి మధ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన వైద్యుల చుట్టూ కథనం తిరుగుతుంది. ఇది భయం, సస్పెన్స్ కలగలిపి సాగే స్టోరీ. నవంబర్ 6 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
3. కుంజుమలాఖ (Kunjumalakha) - మనోరమ మాక్స్ (నవంబర్ 2)
కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ డ్రామాను కోరుకునే వారికి ‘కుంజుమలాఖ’ మంచి ఆప్షన్. ఇదొక మలయాళ సీరియల్. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఓ కొత్త ఎపిసోడ్ చూడొచ్చు.
4. మీసయ మురుక్కు 2 (Meesaya Murukku 2) - సోనీ లివ్
ఇక సంగీత నేపథ్యంతో సాగే తమిళ హిట్ ఎంటర్‌టైనర్ ‘మీసయ మురుక్కు 2’ మలయాళం డబ్బింగ్ వెర్షన్ ఈ వారం సోనీ లివ్ (SonyLIV) ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మ్యూజికల్ డ్రామాలను ఆస్వాదించే యువతకు ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


