OTT Telugu: మరో ఓటీటీలోకి గుణ శేఖర్, భూమిక, సారా అర్జున్ తెలుగు మూవీ.. ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయి గ్యాంగ్ రేప్
OTT Telugu: గుణ శేఖర్, భూమిక, సారా అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ యుఫోరియా. థియేటర్లలో అంతంతమాత్రం రెస్పాన్స్ తర్వాత ఇప్పటీకే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా మరో ఓటీటీలోకి రాబోతోంది.
OTT Telugu: తెలుగు మూవీ యుఫోరియా ఓ ఓటీటీలోకి వచ్చిన మూడు వారాల తర్వాత రెండో ఓటీటీలోకీ రాబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఇది. తన స్టైల్ కు పూర్తి భిన్నంగా ఓ సోషల్ ఎమోషనల్ డ్రామాను అతడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా సక్సెస్ సాధించలేదు.

ఆహా ఓటీటీలోకి యుఫోరియా
భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన యుఫోరియా మూవీ ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“మనసుకు గట్టిగా తగిలే యుఫోరియా ద ఫిల్మ్ ఆహా వీడియోలో ఏప్రిల్ 22 నుంచి స్ట్రీమింగ్.. యుఫోరియా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా” అనే క్యాప్షన్ తో స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఇప్పటికీ ఈ మూవీ ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
'యుఫోరియా' కథ ఏంటంటే..
గుణ శేఖర్ డైరెక్ట్ చేసిన యుఫోరియా సినిమా స్టోరీ హైదరాబాద్‌లో 2022లో జరిగిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కింది. చైత్ర అనే 17 ఏళ్ల అమ్మాయి క్యారెక్టర్‌లో సారా అర్జున్ అద్భుతంగా నటించింది. ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో ఉండే ఆ అమ్మాయి ఒక పార్టీకి వెళ్లినప్పుడు, పెద్ద కుటుంబాలకు చెందిన ఐదుగురు మైనర్ కుర్రాళ్ల చేతిలో దారుణంగా అఘాయిత్యానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి, ఆమె ఫ్యామిలీ పడే నరకం ఒక వైపు అయితే.. తప్పు చేసిన ఆ మైనర్ల కుటుంబాలు ఫేస్ చేసే పరిణామాలు మరోవైపు చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తారు.
ఇందులో ఒక నేరస్థుడి తల్లి పాత్రలో భూమిక నటించింది. డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబాలు ఎలా బిహేవ్ చేస్తాయి.. ఒక నిజాయితీ గల తల్లి తన కొడుకు క్రిమినల్ అని తెలిశాక ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది అనేది ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా కళ్ళకు కట్టినట్లు చూపించారు.
యుఫోరియా పబ్లిక్ టాక్
ఈ సినిమాకు ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఐఎండీబీలో మాత్రం 8 రేటింగ్ నమోదైంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా, గ్రిప్పింగా సాగినా.. సెకండాఫ్ లోనే కాస్త కథ పక్కదారి పట్టినట్లు కూడా కొందరు తమ రివ్యూల్లో చెప్పారు. అయితే ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ యుఫోరియా సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. రిలీజ్ రోజు నుంచే కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. మొదటి రోజు ఇండియాలో కేవలం రూ.25 లక్షల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించిన ఈ సినిమా, ఫుల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.87 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి కమర్షియల్‌గా చాలా నిరాశపరిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


