ఈ శుక్రవారం (మార్చి 13) ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పాలి. ఒకే రోజు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ యానిమేషన్ మూవీస్ కూడా డిజిటల్ తెరపైకి వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా మీకోసం.
ఆస్పిరెంట్స్ - సీజన్ 3 (Aspirants Season 3)

ఎక్కడ చూడాలంటే: అమెజాన్ ప్రైమ్ వీడియో
యూపీఎస్‌సీ అభ్యర్థుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ మూడవ సీజన్ శుక్రవారం నుండి స్ట్రీమింగ్ కానుంది. నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా (సందీప్ భయ్యా) పాత్రలు ఈసారి ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎక్కడ చూడాలంటే: జీ5 (ZEE5)
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. వైన్ వ్యాపారిగా ఉండే రామ్ సత్యనారాయణ (రవితేజ), తన భార్య, మరొక మహిళ మధ్య చిక్కుకుని పడే ఇబ్బందులను వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీని జీ5లో చూడొచ్చు.
ఫంకీ (Funky)
ఎక్కడ చూడాలంటే: నెట్‌ఫ్లిక్స్
కె.వి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మెటా-కామెడీ మూవీ ఒక సినిమా మేకర్ చుట్టూ తిరుగుతుంది. రూ.4 కోట్ల బడ్జెట్ కాస్తా రూ.40 కోట్లు దాటితే, ఆ తర్వాత వచ్చే పరిణామాలను కామెడీగా మలిచారు. ఇందులో నరేశ్, కయాదు లోహర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
జూటోపియా 2 (Zootopia 2)
ఎక్కడ చూడాలంటే: జియో హాట్‌స్టార్
{{/usCountry}}ఎక్కడ చూడాలంటే: జియో హాట్‌స్టార్
{{/usCountry}}చిన్నారులతో పాటు పెద్దలను కూడా అలరించిన పాపులర్ యానిమేషన్ మూవీ 'జూటోపియా' సీక్వెల్ ఇది. జూడీ హాప్స్, నిక్ వైల్డ్ జోడీ మరోసారి సిటీలోని కొత్త మిస్టరీలను ఛేదించనున్నారు. ఈ మూవీ జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనుంది.
ల్యాండ్‌లార్డ్ (Landlord)
ఎక్కడ చూడాలంటే: జీ5 (ZEE5)
కన్నడ స్టార్ దునియా విజయ్ దర్శకత్వం వహించి నటించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా 1980-90ల నాటి కోలార్ నేపథ్యంతో సాగుతుంది. భూస్వాములకు, కూలీలకు మధ్య జరిగే పోరును ఇందులో చూడవచ్చు. జీ5లోకి వస్తోంది.
ద తాజ్ స్టోరీ (The Taj Story)
ఎక్కడ చూడాలంటే: లయన్స్ గేట్ ప్లే
పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ 'తాజ్ మహల్' చరిత్ర, దాని చుట్టూ ఉన్న చట్టపరమైన, సామాజిక వివాదాల నేపథ్యంలో సాగుతుంది. లయన్స్‌గేట్‌ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇవే కాకుండా నాంగల్ (Naangal) అనే మరో మూవీ సన్ నెక్ట్స్ లోకి వస్తోంది. ముగ్గురు సోదరులు, వారి కుక్క 'కైతీ' చుట్టూ తిరిగే తమిళ సెమీ-ఆటోబయోగ్రాఫికల్ సినిమా.
ఇక తమిళ రొమాంటిక్ మూవీ పూకీ (Pooki) జీ5లోకి వస్తోంది. నేటి తరం అంటే జెన్ జీ లవ్ స్టోరీలను ప్రతిబింబించే ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది.
రిసార్ట్ (Resort) అనే మరో తమిళ వెబ్ సిరీస్ కూడా జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. ఒక రిసార్ట్ కిచెన్ లో తన టాలెంట్ నిరూపించుకోవాలనుకునే యువకుడి కథతో సాగే సిరీస్ ఇది.