OTT Tamil: ఓటీటీలోకి ఒక్క రోజే 3 క్రేజీ తమిళ సినిమాలు.. రొమాంటిక్, మ్యూజికల్, స్పోర్ట్స్ డ్రామాలు.. ఎక్కడ చూడాలంటే?
OTT Tamil: తమిళ సినిమా లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ వారం ఒక్క రోజే మూడు క్రేజీ తమిళ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 6) ఒక్కరోజే మూడు ఓటీటీల్లో ఈ మూవీస్ అందుబాటులోకి రానున్నాయి.
OTT Tamil: మరో వీకెండ్ వచ్చేసింది. ఈవారం థియేటర్లలోనూ రామాయణలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీలోనే మూవీస్ చూడాలనుకునే వారికి, అందులోనూ తమిళ సినిమాలు ఇష్టపడే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి శుక్రవారం (నవంబర్ 6) మూడు మూవీస్ రాబోతున్నాయి. ఈ మూడూ వేర్వేరు జానర్లకు చెందిన సినిమాలు కావడం విశేషం.

ముఖ్యంగా మ్యూజికల్ ఎంటర్‌టైనర్స్, ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలు, స్పోర్ట్స్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఫుల్ పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. హిప్‌హాప్ తమిళ ఆది నుంచి హరీష్ కల్యాణ్ వరకు ప్రముఖ నటీనటులు నటించిన ఈ చిత్రాల కథాంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
1. మీసాయ మురుక్కు 2 (Meesaya Murukku 2) - సోనీ లివ్ (SonyLIV)
తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు హిప్‌హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం ‘మీసాయ మురుక్కు 2’. ఈ సినిమాలో టాలీవుడ్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో యువతను ఎంతగానో అలరించిన ఈ మూవీ నవంబర్ 6న సోనీ లివ్ (SonyLIV) ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్‌గా అందుబాటులోకి వస్తోంది.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. స్థానిక గానా (Gaana) సింగర్‌గా ప్రయాణం ప్రారంభించిన ఒక సాధారణ యువకుడు, తన సరికొత్త మ్యూజిక్ సౌండ్‌ను గ్లోబల్ స్టేజ్ వరకు ఎలా తీసుకెళ్లాడు? ఆ ప్రయాణంలో ఎదురైన ఆటంకాలు, ప్రేమ, నవ్వులు పూయించే కామెడీ సన్నివేశాల సమాహారమే ఈ సినిమా.
ఈ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావడం విశేషం.
2. నూరు కోడి వానవిల్ (Nooru Kodi Vaanavil) - జీ5 (ZEE5)
యువ నటుడు హరీష్ కల్యాణ్, సిద్ధి ఇద్నానీ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘నూరు కోడి వానవిల్’. ‘బిచ్చగాడు’ ఫేమ్ ప్రముఖ దర్శకుడు శశి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 6 నుంచి జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమ్ అవుతోంది.
మూవీ స్టోరీ విషయానికి వస్తే.. కుటుంబ బాధ్యతలు, ఊహించని వివాదాలు, కుటుంబ సభ్యుల అంచనాల మధ్య ఒక యువ జంట బంధం ఎలాంటి ఒడిదొడుకులకు గురైంది అనే ఆసక్తికరమైన ఎమోషనల్ డ్రామాతో ఈ చిత్రం రూపొందింది.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల చాన్నాళ్లు విడుదలకు నోచుకోని ఈ చిత్రం, నేరుగా జీ5 ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రేక్షకులను పలకరించడంతో హరీష్ కల్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
3. ది గ్రాండ్ మాస్టర్ (The Grand Master) - సన్ నెక్స్ట్ (Sun NXT)
వెట్రి చెలియన్ దర్శకత్వంలో తెరకెక్కిన మంచి ఎమోషనల్, స్పోర్ట్స్ డ్రామా ‘ది గ్రాండ్ మాస్టర్’. అబర్నాథి, లింగేష్, సురేష్ చంద్రమీనన్, మాస్టర్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 6న సన్ నెక్స్ట్ (Sun NXT) లోకి వస్తోంది.
మూవీ స్టోరీ చూస్తే ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ చెస్ ఛాంపియన్‌గా మారాలని కలలు కనే 10 ఏళ్ల నందన్ అనే బాలుడి ప్రయాణమే ఈ చిత్రం. కుమారుడి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి అడుగులోనూ అండగా నిలిచే ఒక తల్లి త్యాగం, ఆప్యాయత ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇలా తమిళ ఇండస్ట్రీ నుంచి సంగీతం, లవ్, రొమాన్స్, స్పోర్ట్స్ డ్రామాలతో ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల పంట పండనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


