...
...
Next Story

OTT Telugu: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు మూవీ.. 9.7 రేటింగ్.. జీవితాలనే మార్చే ప్రయాణం.. ఎందుకు చూడాలంటే?

OTT Telugu: ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఫీల్-గుడ్ డ్రామా 'హ్యాపీ జర్నీ' (Happy Journey) ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. డిజిటల్ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రం ఐఎండీబీ (IMDb)లో 9.7/10, బుక్ మై షో (BookMyShow)లో 9.5/10 రికార్డు రేటింగ్స్ సాధించింది.

Published on: Nov 18, 2026, 16:24:36 IST
By
Prefer HTon Google
Advertisement

Happy Journey Movie OTT Trending: ఓటీటీ వేదికలపై భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలతో పాటు, మనసుకు హత్తుకునే వినూత్న కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. తాజాగా ఇదే కోవలో తెలుగు ఫీల్-గుడ్ డ్రామా 'హ్యాపీ జర్నీ' (Happy Journey) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలిచి సంచలనం సృష్టిస్తోంది.

OTT Telugu: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు మూవీ.. 9.7 రేటింగ్.. జీవితాలనే మార్చే ప్రయాణం.. ఎందుకు చూడాలంటే?
OTT Telugu: ప్రైమ్ వీడియోలో దుమ్ము రేపుతున్న తెలుగు మూవీ.. 9.7 రేటింగ్.. జీవితాలనే మార్చే ప్రయాణం.. ఎందుకు చూడాలంటే?

"కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ఎటువంటి అంచనాలు లేకుండా డిజిటల్ తెరపైకి వచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. మరి ఈ మూవీని ఎందుకు చూడాలో తెలుసుకోండి.

ఐఎండీబీ, బుక్ మై షోలలో రికార్డు స్థాయి రేటింగ్స్

సాధారణంగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు వ్యూస్ రావడం సహజమే కానీ, విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి ఒకేసారి ప్రశంసలు అందుకోవడం అరుదు. 'హ్యాపీ జర్నీ' కేవలం స్ట్రీమింగ్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ రికార్డులు తిరగరాస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా సినిమా రేటింగ్స్‌కు ప్రామాణికంగా నిలిచే ఐఎండీబీ (IMDb)లో ఈ సినిమా ఏకంగా 9.7/10 రేటింగ్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మరోవైపు బుక్ మై షోలోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

జీవితంలోని ఒడిదుడుకులు, మానవ సంబంధాల విలువను ఆవిష్కరించే కథనం, సహజసిద్ధమైన నటన ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

హ్యాపీ జర్నీ స్టోరీ ఏంటంటే?

సరదాగా ప్రారంభమైన ఈ విహారయాత్ర సాగుతుండగానే ఆ మహిళల జీవితాల్లోని వ్యక్తిగత సమస్యలు, దాగి ఉన్న ఆవేదనలు బయటపడతాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలాంటి మలుపు తిరిగింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఆయా కుటుంబాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెరపై చూడాల్సిందే.

హ్యాపీ జర్నీ విశేషాలు

గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి, అభిరామ్ నాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమాలో తరుణ్ రెడ్డి, శైలేంద్ర కుమార్, రాజేష్ వ్రజ్‌లాల్ వసాని, సలోని జయ్ వసాని, అవిషా గోస్వామి తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయి సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేయడం మరో ప్రధాన ఆకర్షణ. టాలీవుడ్ మెలోడీ స్పెషలిస్ట్ శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం, పాటలు కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేశాయి. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ ప్రయాణపు దృశ్యాలను కన్నుల పండువగా చూపించింది.

సీనియర్ ఎడిటర్ చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పనితనం సినిమాను ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత వన్నె తెచ్చింది. అనిల్ అండ్ భాను, వంశీ శేఖర్ ఈ చిత్రానికి పబ్లిసిటీ బాధ్యతలు నిర్వర్తించారు.

మొత్తంగా ఎలాంటి అసభ్యత, హింస లేకుండా కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ ఒక స్వచ్ఛమైన ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా 'హ్యాపీ జర్నీ' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది. వీకెండ్‌లో ఒక మంచి సినిమా చూడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks