OTT Telugu: ఓటీటీలోకి మహేష్ బాబు అన్న కొడుకు మూవీ.. మూడు వారాల్లోనే శ్రీనివాస మంగాపురం డిజిటల్ ప్రీమియర్
OTT Telugu: తెలుగు మూవీ శ్రీనివాస్ మంగాపురం మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. జులై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఆగస్ట్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
OTT Telugu: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. థియేట్రికల్ రన్‌లో ఆశించిన స్థాయి ఫలితం సాధించలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం అంటే ఆగస్ట్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

మూడు వారాల్లోనే ఓటీటీలోకి..
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని ఈ శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేయడంతో, ఆ ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనంటూ డైరెక్టర్ అజయ్ భూపతి ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
జులై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. కేవలం మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. అది కూడా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
“ఈ సీజన్ లో అత్యంత ఘాటైన లవ్ స్టోరీ ఇంట్లోకి వచ్చేస్తోంది.. శ్రీనివాస్ మంగాపురం ప్రైమ్ వీడియోలో రేపు ఆగస్ట్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.
ఘట్టమనేని వారసుడి డెబ్యూ.. అజయ్ భూపతి మార్క్ లవ్ స్టోరీ
‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ లాంటి రా అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్స్ తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ సినిమాను పూర్తిస్థాయి డిఫరెంట్ లవ్‌స్టోరీగా తీర్చిదిద్దారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి డెబ్యూ ఇచ్చిన జయకృష్ణ తన మొదటి సినిమాలోనే మాస్ అండ్ ఎమోషనల్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రాషా తడాని గ్లామర్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోవడంతో రిజల్ట్ మారినా, ఓటీటీ ఆడియెన్స్‌ను ఈ రఫ్ అండ్ టఫ్ లవ్ స్టోరీ ఏ మేరకు మెప్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
వివిధ భాషల్లో ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకేసారి వివిధ భాషల్లో డిజిటల్ ఆడియెన్స్ ముందుకు తీసొస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో అధికారికంగా వెల్లడించింది.
వైజయంతీ మూవీస్ అధినేత అశ్విని దత్ సమర్పణలో ప్రొడ్యూసర్ పి. కిరణ్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కిక్ శ్యామ్, వాసుకి, బ్రహ్మాజీ వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించడం విశేషం.
జివి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మెలోడీ పాటలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియెన్స్ ఇప్పుడు ఇంటి వద్దే ప్రైమ్ వీడియోలో ఈ లవ్ డ్రామాను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


