ఓటీటీలో ఈవారం మిస్ కాకుండా చూడాల్సిన మూడు తెలుగు సినిమాలు ఇవే.. థ్రిల్లర్ నుంచి స్పోర్ట్స్ డ్రామా వరకు..

ఈవారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల్లో ఈ మూడు తెలుగు మూవీస్ మిస్ కావద్దు. వీటిలో రెండు ఇప్పటికే థియేటర్లలో ఓ మోస్తరు సక్సెస్ సాధించి డిజిటల్ ప్రీమియర్ కానుండగా.. మరొకటి నేరుగా ఓటీటీలోకే వస్తున్న థ్రిల్లర్ సినిమా.

Jan 19, 2026, 19:45:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు ప్రేక్షకులు గత వారం మొత్తం సంక్రాంతి సినిమాల్లో మునిగి తేలారు. థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఓటీటీలో కాస్త సందడి తగ్గింది. అయితే సంక్రాంతి ముగిసింది. ఐదు సినిమాల పరిస్థితేంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక మెల్లగా ఓటీటీ వైపు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవారం అంటే జనవరి 17 నుంచి 23 మధ్య ఓటీటీలోకి రాబోతున్న మూడు తెలుగు సినిమాలు ఏవి? వాటిని ఎందుకు చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలో ఈవారం మిస్ కాకుండా చూడాల్సిన మూడు తెలుగు సినిమాలు ఇవే.. థ్రిల్లర్ నుంచి స్పోర్ట్స్ డ్రామా వరకు..
ఓటీటీలో ఈవారం మిస్ కాకుండా చూడాల్సిన మూడు తెలుగు సినిమాలు ఇవే.. థ్రిల్లర్ నుంచి స్పోర్ట్స్ డ్రామా వరకు..

ఓటీటీలోకి రానున్న తెలుగు సినిమాలు

సంక్రాంతి హడావిడి ముగిసింది. ఇప్పుడు ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఈ వారం తెలుగులో మూడు ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పైకి వస్తున్నాయి. థియేటర్లో హిట్ కొట్టిన సినిమాతో పాటు, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కూడా ఉండటం విశేషం. ఆ లిస్ట్ లో ఏమున్నాయో చూడండి.

1. శంభాల (Shambhala)

ప్లాట్‌ఫామ్: ఆహా వీడియో

స్ట్రీమింగ్ తేదీ: జనవరి 22, 2026

ఆది సాయికుమార్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ఈ శంభాల. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఇదో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్. ఓ ఊళ్లో ఓ ఉల్క పడిన తర్వాత వరుసగా చాలా మంది చనిపోతుంటారు. ఆ ఊరికి వచ్చిన సైంటిస్టు వాటి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమైంది.

2. చీకటిలో (Cheekatilo)

ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

స్ట్రీమింగ్ తేదీ: జనవరి 23, 2026

చాలా కాలం తర్వాత గ్లామరస్ బ్యూటీ శోభిత ధూళిపాళ తెలుగులో నటించిన మూవీ ఇది. అయితే ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాలో శోభిత జర్నలిస్టుగా కనిపించనుంది. అనుమానాస్పద స్థితిలో జరుగుతున్న మహిళల హత్యల మిస్టరీని ఛేదించే థ్రిల్లర్ కథాంశంతో ఇది తెరకెక్కింది. ఓ ట్రూ క్రైమ్ పాడ్‌కాస్టర్ గా సీరియల్ కిల్లర్ ఎవరో బయటపెట్టే పాత్రలో శోభిత నటించింది.

3. ఛాంపియన్ (Champion)

ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

స్ట్రీమింగ్ తేదీ: జనవరి 23, 2026

రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు) చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ఇది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను ‘సీతారామం’, ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. థియేటర్లలో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన ఈ సినిమా.. ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More