OTT Today: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో..

OTT Today: ఓటీటీలోకి ఒక రోజు ముందుగానే ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు. మరి ఈ మూవీ కథేంటి? ఎందుకు చూడాలన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 9, 2026, 22:00:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Today: ఓటీటీలోకి ఈవారం వచ్చిన ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాల్లో ఒకటి బాల్టీ (Balti). గతేడాదే థియేటర్లలో రిలీజైనా.. చాలా రోజులకు గానీ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. నిజానికి శుక్రవారం (జులై 10) సోనీ లివ్ ఓటీటీలోకి రావాల్సి ఉన్నా.. ఒక రోజు ముందే అంటే గురువారం (జులై 9) సాయంత్రం నుంచే ఐదు భాషల్లో స్ట్రీమింగ్ మొదలైంది.

OTT Today: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో..
OTT Today: ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చిన మలయాళం యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో..

బాల్టీ ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో చాలా వరకు సినిమాలు థియేటర్లలో కేవలం మలయాళం ఆడియోతోనే రిలీజైనా.. ఓటీటీలో మాత్రం మల్టీ లాంగ్వేజెస్ రిలీజ్ చూస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టిన బాల్టీ కూడా అంతే.

మలయాళం టాలెంటెడ్ యాక్టర్ షేన్ నిగమ్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

బాల్టీ మూవీ స్టోరీ ఏంటంటే?

ఉదయన్ అలియాస్ బాల్టీ (షేన్ నిగమ్) తన ఫ్రెండ్స్ గ్రూప్‌తో కలిసి వెలంపళయం అనే బోర్డర్ టౌన్‌లో లోకల్ కబడ్డీ టోర్నమెంట్లు ఆడుతుంటాడు. అతనికి తన తల్లి, స్నేహితులు అంటే ప్రాణం. అయితే ఓ లోకల్ కబడ్డీ మ్యాచ్‌లో పవర్‌ఫుల్ రౌడీ పోర్తామరై భైరవన్ టీమ్‌ను బాల్టీ గ్యాంగ్ ఓడిస్తుంది. అక్కడినుంచి హీరో లైఫ్ మొత్తం టర్న్ అవుతుంది. ఈ విజయం వాళ్ళను అక్రమ ఫైనాన్స్, గ్యాంగ్ వార్స్, అండర్ వరల్డ్ క్రైమ్ మాఫియాలోకి లాగేస్తుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. షేన్ నిగమ్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్పోర్ట్స్ మెన్‌గా, ఫ్రెండ్ కోసం ప్రాణాలిచ్చే కుర్రాడిగా తన యాక్టింగ్ ఇరగదీశాడు. డైరెక్టర్ ఉన్ని శివలింగం ఫస్ట్ మూవీ అయినా సరే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

సెకండాఫ్ మైనస్

కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా ట్రాక్ మారుతుంది. కబడ్డీ పక్కకు వెళ్లిపోయి పక్కా వయొలెంట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మారిపోతుంది. కథలో ఎమోషనల్ ఫీల్ మిస్ అయ్యి రొటీన్ రివెంజ్ డ్రామాగా సాగడం కొద్దిగా మైనస్ అని చెప్పొచ్చు. అయితే యాక్షన్ లవర్స్‌కి మాత్రం ఈ సినిమా సెకండ్ హాఫ్ కూడా మంచి కిక్ ఇస్తుంది.

హీరోయిన్ ప్రీతి అస్రాని క్యారెక్టర్‌కి పెద్దగా స్కోప్ లేదు కానీ, ఉన్నంతలో నీట్‌గా చేసింది. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే అలెక్స్ జే పులికల్ విజువల్స్ బోర్డర్ టౌన్ రస్టిక్ ఫీల్‌ను పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశాయి. శివకుమార్ ఎడిటింగ్ వర్క్ బాగుంది కానీ, సెకండ్ హాఫ్‌లో కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా స్పీడ్ ఇంకా పెరిగేది.

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ (Sai Abhyankkar) మ్యూజిక్, బీజీఎం వేరే లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 'జలక్కారి' సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More