...
...
Next Story

OTT Weekend: ఓటీటీలో ఏకంగా 44 సినిమాలు, వెబ్ సిరీస్.. 11 చాలా స్పెషల్.. తెలుగులోనే 12.. వీకెండ్ పండగే

OTT Weekend: ఓటీటీ బింజ్-వాచర్లకు ఈ వారం అసలైన పండుగ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5, ఆహా, సన్ నెక్స్ట్ వంటి ప్రముఖ డిజిటల్ వేదికలపై ఏకంగా 40కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 11 చాలా స్పెషల్ కాగా.. 12 తెలుగులోనే అందుబాటులో ఉన్నాయి.

Published on: Nov 14, 2026, 05:40:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Weekend: ఓటీటీలో ఈ వీకెండ్ ఏం చూడాలో కూడా మీరు తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఆ స్థాయిలో సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు 40కిపైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రావడం విశేషం. అయితే వీటిలో చాలా ప్రత్యేకమైనవి, కచ్చితంగా చూడదగినవి ఏంటో తెలుసుకోండి.

తెలుగులో 4 స్పెషల్

OTT Weekend: ఓటీటీలో ఏకంగా 44 సినిమాలు, వెబ్ సిరీస్.. 11 చాలా స్పెషల్.. తెలుగులోనే 12.. వీకెండ్ పండగే
OTT Weekend: ఓటీటీలో ఏకంగా 44 సినిమాలు, వెబ్ సిరీస్.. 11 చాలా స్పెషల్.. తెలుగులోనే 12.. వీకెండ్ పండగే

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అడుగుపెట్టాయి.

రణబాలి (Ranabaali): భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పుష్పక విమానం (Pushpaka Vimanam): తెలుగు ఆడియన్స్ కోసం జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి వచ్చిన స్పెషల్ వెబ్ సిరీస్ ఇది.

హ్యాపీ జర్నీ (Happy Journey): ఫ్యామిలీ, యూత్‌ను ఆకట్టుకునే ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కికు చిరంజీవి (Kiku Chiranjeevi): తెలుగు ఒరిజినల్ కంటెంట్‌ను ఇష్టపడే వారి కోసం ఆహా వీడియో (Aha Video)లో అందుబాటులో ఉంది.

తమిళం, మలయాళం: ‘జైలర్ 2’ పాన్-ఇండియా ధమాకా

సౌత్ ఇండియన్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా పలు తమిళ, మలయాళ చిత్రాలు తెలుగు డబ్బింగ్ వెర్షన్లతో సహా విడుదలవుతున్నాయి.

జైలర్ 2 (Jailer 2): సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది.

ఏళు కడల్ ఏళు మలై (Yezhu Kadal Yezhu Malai), సందకారి (Sandakari): ఈ రెండు తమిళ చిత్రాలు ఆస్ట్రో మూవీస్ (Astro Movies)లో అందుబాటులో ఉన్నాయి.

మస్ట్ డేట్ ది ప్లేబాయ్ (Must Date The PlayBoy - సిరీస్): తమిళ రొమాంటిక్ కామెడీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, అజిత్ క్లాసిక్ చిత్రం ‘అమర్కళం’ (Amarkkalam - రీమాస్టర్డ్ వెర్షన్) ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్‌లలో ఉంది.

మలయాళ థ్రిల్లర్స్: ‘బాంద్రా’ మూవీ జీ5లో, ‘డీఎన్ఏ’ మూవీ సన్ నెక్స్ట్‌లో విడుదలయ్యాయి. ఇక క్రైమ్ థ్రిల్లర్ ‘ది థర్డ్ మర్డర్’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ వేదికలపై అందుబాటులో ఉంది.

బాలీవుడ్, హిందీ ఓటీటీ రిలీజ్‌లు: థ్రిల్లర్స్ నుంచి క్యాంపస్ డ్రామా వరకు

హిందీ చిత్రసీమ నుంచి ఈ వారం వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్ (Student Of The Year: After Dark - సిరీస్): యూత్‌ఫుల్ డ్రామా సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లో జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

వైబ్ (Vibe): హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది.

దాయరా (Daayra), రాక్ ఆన్ 2 (Rock On 2): ఈ రెండు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి ('దాయరా' మలయాళంలోనూ ఉంది).

ది బ్లైండ్ గేమ్ (Blind Game), పరివారిక్ మనోరంజన్: అర్జున్ రాంపాల్, ప్రియమణి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ది బ్లైండ్ గేమ్' జీ5 (ZEE5)లో, ఫ్యామిలీ డ్రామా 'పరివారిక్ మనోరంజన్' సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

హాలీవుడ్, ఇంటర్నేషనల్ స్పెషల్స్: ‘రింగ్స్ ఆఫ్ పవర్ 3’, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్’

ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల కంటెంట్ ఇష్టపడే వారి కోసం భారీ లైనప్ సిద్ధంగా ఉంది.

1. ది రింగ్స్ ఆఫ్ పవర్: సీజన్ 3 (The Rings of Power: Season 3): ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఫాంటసీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

2. అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ (Avengers: Endgame Encore): మార్వెల్ అభిమానుల కోసం ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్ లో అందుబాటులోకి వచ్చింది.

3. నెట్‌ఫ్లిక్స్ ఇంగ్లీష్ & గ్లోబల్ హిట్స్: పవర్ బుక్ II: ఘోస్ట్, మిస్టీ గ్రీన్, ది బాడీ: సీజన్ 1, అవెడాన్, టైలర్ పెర్రీస్ ది గాస్పెల్ ఆఫ్ క్రిస్మస్, అలెన్, ఛోటా భీమ్ కిర్మాడా, భక్షక్ స్పెషల్, హార్ట్‌ల్యాండ్, మర్డర్ ఇన్ గలీసియా, క్లంక్ ఆన్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తున్నాయి.

4. ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలు (నెట్‌ఫ్లిక్స్): ఫ్రెంచ్ చిత్రం ‘ది గుడ్ లాయర్’ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా.. థాయ్ చిత్రం కిజ్‌సదా ప్యారడైజ్, ఇండోనేషియన్ యాక్షన్ మూవీ నెవర్ సరెండర్, మాండరిన్ డాక్యుమెంటరీ మిరాకిల్స్ ఆఫ్ ది ఈఆర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

5. ఇతర ప్లాట్‌ఫామ్‌లు: పా పెట్రోల్: ది డైనో మూవీ (పారామౌంట్ ప్లస్), క్రాలర్స్ (లయన్స్‌గేట్ ప్లే - తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్, హిందీ), బీయింగ్ హ్యూమన్ (యాపిల్ టీవీ), ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (HBO మ్యాక్స్) లలో విడుదలయ్యాయి. విదేశాల్లోని ప్రేక్షకుల కోసం అమెరికన్ డాక్టర్, ఫాలింగ్, ది ఇన్‌కమర్, అదర్ మమ్మీ, పాన్స్ లాబ్రింత్ 20th యానివర్సరీ ప్రైమ్ వీడియో రెంట్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

ఈ వీకెండ్ లో యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, ఫాంటసీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో అన్ని ఓటీటీ వేదికలు కళకళలాడుతున్నాయి. మీకు నచ్చిన జోనర్‌ను బట్టి మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ఇప్పుడే సిద్ధం చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks