Jiohotstar: ఓటీటీలోకి వచ్చీ రాగానే టాప్‌లోకి 5 వేల కోట్ల హారర్ థ్రిల్లర్.. జియోహాట్‌స్టార్ టాప్ 10 ఇవే.. 2 తెలుగు మూవీస్
Jiohotstar: జియోహాట్‌స్టార్ లో బుధవారం (నవంబర్ 4) మోస్ట్ వాచ్డ్ మూవీస్‌గా నిలిచిన టాప్ 10 చిత్రాల జాబితా విడుదలైంది. హాలీవుడ్ సూపర్ నేచురల్ సైకో థ్రిల్లర్ 'అబ్సెషన్' మొదటి స్థానంలో నిలవగా, సమంత నటించిన 'మా ఇంటి బంగారం', రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' వంటి చిత్రాలు ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.
Jiohotstar: జియోహాట్‌స్టార్ ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు రకరకాల జానర్లలో అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. యాక్షన్, రొమాన్స్, సైకో థ్రిల్లర్, కాంబినేషన్లతో కూడిన హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు డిజిటల్ స్పేస్‌లో సందడి చేస్తున్నాయి. బుధవారం నాటికి జియోహాట్‌స్టార్ లో దేశవ్యాప్తంగా అత్యధికంగా చూస్తున్న టాప్ 10 మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.

1. అబ్సెషన్ (Obsession)
ఇటీవల విడుదలైన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘అబ్సెషన్’. థియేటర్లలో విపరీతమైన ఆదరణ పొంది సుమారు రూ.5 వేల కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు సైకో ఆలోచనలతో నిక్కీ అనే పాత్ర చుట్టూ తిరిగే ఈ హాలీవుడ్ మూవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.
2. ఆంఖ్ మిచోలీ (Aankh Micholi)
మృణాల్ ఠాకూర్, పరేష్ రావాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆంఖ్ మిచోలీ’ ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రాత్రి వేళ కంటిచూపు మందగించే విచిత్రమైన సమస్యతో బాధపడే కథానాయిక పాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నెంబర్ 2 స్థానంలో నిలిచింది.
3. ఝాడ్ ఫూంక్ (Jhad Phoonk)
మూఢనమ్మకాల నేపథ్యంలో రూపొందిన ‘ఝాడ్ ఫూంక్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నెంబర్ 3లో ట్రెండ్ అవుతోంది. తన మనవడిని కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి చేసే పూజలు, మూఢనమ్మకాల చుట్టూ ఈ కథనం సాగుతుంది.
4. మినియన్స్ మాన్స్టర్ (Minions Monster)
పిల్లలను విశేషంగా అలరిస్తున్న యానిమేటెడ్ మూవీ ‘మినియన్స్ మాన్స్టర్’. మినియన్స్ బృందం స్వయంగా మూవీ బిజినెస్ ప్రారంభించడం అనే క్రేజీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా 4వ స్థానాన్ని దక్కించుకుంది.
5. మా ఇంటి బంగారం (Maa Inti Bangaram)
సమంతా రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు చిత్రం ‘మా ఇంటి బంగారం’. కుటుంబ బాధ్యతలను మోసే స్వర్ణ అనే గృహిణి, తన ప్రమాదకరమైన గతం ఎదురైనప్పుడు ఎలాంటి ధైర్యసాహసాలు ప్రదర్శించిందో చూపే ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ప్రస్తుతం నెంబర్ 5లో ట్రెండ్ అవుతోంది.
6 నుంచి 10వ స్థానంలో ఉన్న సినిమాలు
6. ధురంధర్ 2 (Dhurandhar 2): రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ బ్లాక్‌బస్టర్ యాక్షన్ చిత్రం ఓటీటీలోనూ ప్రభంజనం సృష్టిస్తూ 6వ స్థానంలో నిలిచింది.
7. వెల్కమ్ టు ద జంగిల్ (Welcome To The Jungle): అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ కామెడీ డ్రామా 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
8. ఆర్యభట్ కా జీరో (Aryabhatt Ka Zero): కమల్ చంద్ర దర్శకత్వంలో హిమాన్ష్ కోహ్లీ నటించిన కామెడీ డ్రామా చిత్రం 8వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
9. ధురంధర్ (Dhurandhar): పాకిస్తాన్ నేపథ్యంలో సాగే ఇండియన్ గూఢచారి కథాంశంతో రణ్వీర్ సింగ్ నటించిన మొదటి భాగం 'ధురంధర్' 11 నెలల తర్వాత కూడా 9వ స్థానంలో కొనసాగుతోంది.
10. పరదా (Pardha): స్త్రీలు ముసుగు (పరదా) ధరించాలనే కఠిన నిబంధనలు ఉన్న గ్రామం నేపథ్యంలో సాగే తెలుగు మూవీ 'పరదా' జియోహాట్‌స్టార్ లో 10వ స్థానంలో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


