Samantha 9 Months: 9వ నెల ప్రెగ్నెన్సీలోనూ సమంత వర్కౌట్స్- 1 నుంచి 9 వరకు- డెలివరీ టైమ్ అయిందంటూ! మరో హీరోయిన్ ఏమందంటే?

Samantha 9 Months Pregnancy Workout Video: 9వ నెల గర్భంతో ఉన్న హీరోయిన్ సమంత రూత్ ప్రభు పంచుకున్న ఫిట్‌నెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గర్భధారణ తొలి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను చేసిన వ్యాయామాలను అభిమానులతో పంచుకుంటూ ఆరోగ్యంపై కొత్త స్పూర్తిని నింపారు.

Published on: Oct 30, 2026, 14:11:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Samantha 9 Months Pregnancy Workout Video: తెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం జీవితంలో ఒక మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత గర్భధారణ సమయంలో కూడా తన ఫిట్‌నెస్‌ను ఏమాత్రం పక్కన పెట్టలేదు.

9వ నెల ప్రెగ్నెన్సీలోనూ సమంత వర్కౌట్స్- 1 నుంచి 9 వరకు- డెలివరీ టైమ్ అయిందంటూ! మరో హీరోయిన్ ఏమందంటే?
9వ నెల ప్రెగ్నెన్సీలోనూ సమంత వర్కౌట్స్- 1 నుంచి 9 వరకు- డెలివరీ టైమ్ అయిందంటూ! మరో హీరోయిన్ ఏమందంటే?

ప్రెగ్నెన్సీ సమయంలో సమంత వర్కౌట్స్ వీడియోలు

9వ నెలలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. మొదటి నెల నుంచి ప్రస్తుతం తొమ్మిదో నెల వరకు శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సమంత వ్యాయామాలు చేసిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1వ నెల నుంచి 9వ నెల దాకా ఫిట్‌నెస్ ప్రయాణం

సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన వీడియోలో, గర్భధారణ ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు తాను చేసిన వివిధ రకాల వ్యాయామాలను పొందుపరిచారు. తాజాగా పంచుకున్న క్లిప్‌లో చెస్ట్ దగ్గర డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తూ ఆమె కనిపించారు. "9వ నెల.. ఫైనల్ ల్యాప్" అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జత చేశారు. ప్రసవ సమయం దగ్గర పడిందని ఈ పోస్ట్ ద్వారా సమంత స్పష్టం చేశారు.

హీరోయిన్ కృతి కర్బందా కామెంట్

ఈ వీడియో చూసిన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. "మీ ముగ్గురికీ నా ప్రేమను పంపుతున్నాను!" అని హీరోయిన్ కృతి కర్బందా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ సమంత వర్కవుట్ వీడియో డిజిటల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు శరీరం సహకరించినంత మేర వ్యాయామం చేయడం ఎంతో మేలని సమంత నిరూపిస్తున్నారు. గతంలో కూడా తన ప్రీనెటల్ వర్కవుట్ సెషన్స్ గురించి ఆమె మాట్లాడారు.

"శరీరం చెప్పేది వినడమే ముఖ్యం"

"ఈ రోజుల్లో ట్రైనింగ్ విధానం కొద్దిగా మారింది. కష్టపడి వ్యాయామం చేయడం కంటే, శరీరం చెప్పేది వినడానికే ప్రాధాన్యత ఇస్తున్నాను" అని సమంత పేర్కొన్నారు. బరువులు ఎత్తడం మాత్రమే కాకుండా, శరీరానికి ఏది అవసరమో గుర్తించి వ్యాయామం చేయాలనే సందేశాన్ని ఆమె అందించారు.

కొయంబత్తూరులో శ్రీమంతం సందడి

ఇదిలా ఉంటే.. సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం డిసెంబర్ 2025లో తమిళనాడులోని కొయంబత్తూరు ఈశా యోగా సెంటర్‌లోని లింగభైరవి ఆలయంలో ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది.

ఈశా ఫౌండేషన్‌లో సమంత సీమంతం వేడుకలు

తమ మొదటి సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ దంపతులు, కొద్ది వారాల క్రితం ఈశా ఫౌండేషన్‌లోనే సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను జరుపుకున్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో సమంతా ఎంతోమంది గర్భిణులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డెలివరీ సమయం దగ్గర పడటంతో అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More