Maa Inti Bangaaram Sequel: మా ఇంటి బంగారం సీక్వెల్ చేస్తాను.. ఐడియా వచ్చేసింది: రాజ్ నిడిమోరు కామెంట్స్
Maa Inti Bangaaram Sequel: సమంత మా ఇంటి బంగారం సీక్వెల్ కూడా రాబోతోంది. తాజాగా వైజాగ్ లో జరిగిన మూవీ సక్సెస్ మీట్ లో ఈ సినిమాకు స్టోరీ అందించిన రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. పార్ట్ 2 కోసం తనకు ఇప్పటికే ఐడియా వచ్చేసిందని చెప్పారు.
Maa Inti Bangaaram Sequel: స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్ కూడా రాబోతున్నట్లు రాజ్ నిడిమోరు వెల్లడించారు. ఈ మూవీ థియేటర్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. 'ఓ బేబీ' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, డైరెక్టర్ బి. వి. నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ సెన్సేషనల్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర యూనిట్ వైజాగ్ లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. వైజాగ్ బీచ్ రోడ్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా రేంజ్ లో ఫ్యాన్స్ తరలిరావడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారిపోయింది.
పబ్లిక్ రెస్పాన్స్ చూసి నిర్ణయం మార్చుకున్న రాజ్ నిడిమోరు
మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ స్టేజ్ పై సమంత భర్త, ఈ సినిమా కథా రచయిత అయిన ప్రముఖ బాలీవుడ్ స్టార్ మేకర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) మైక్ అందుకుని ఫ్యాన్స్ కు ఒక బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ బ్లాక్‌బస్టర్ హిట్‌కు పక్కాగా ఒక సీక్వెల్ రాబోతుందని, రాబోయే రెండు సంవత్సరాల్లోనే 'మా ఇంటి బంగారం 2' థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ఈ ఈవెంట్‌లో రాజ్ నిడిమోరు మాట్లాడుతూ మొదట వైజాగ్ జనాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. ఆయన అభిమానులను ఉద్దేశించి.. "మీకు ఈ సినిమాలో స్వర్ణ క్యారెక్టర్ నచ్చిందా? ఈ కథకు పార్ట్ 2 కావాలా?" అని అడగ్గానే స్టేడియం మొత్తం గూస్‌బంప్స్ వచ్చేలా కేకలు వేసింది. ఆడియన్స్ నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ చూసిన వెంటనే ఆయన సీక్వెల్‌ను కన్ఫర్మ్ చేసేశారు.
"నా మైండ్‌లో ఆల్రెడీ ఒక క్రేజీ ఐడియా రన్ అవుతోంది. ఈ సినిమాకు పనిచేసిన సేమ్ టీమ్ మళ్లీ సీక్వెల్ కోసం వర్క్ చేస్తుంది. నా కెరీర్‌లో ఒక సినిమాకు సెకండ్ పార్ట్ తీయాలనే ఇన్‌స్పిరేషన్ కలగడం ఇదే ఫస్ట్ టైమ్. పార్ట్ 2లో డబుల్ ఫన్, డబుల్ ఎగ్జైట్‌మెంట్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చాలా త్వరలోనే రివీల్ చేస్తా" అని రాజ్ నిడిమోరు స్పష్టం చేశారు.
బిడ్డ పుట్టిన తర్వాతే..
ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. దీంతో సినిమాలను నుంచి కాస్త గ్యాప్ తీసుకుంటున్నట్లు ఆమె ఈ మధ్యే చెప్పింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సీక్వెల్ రెండేళ్ల తర్వాత అని రాజ్ చెప్పింది కూడా ఈ ఉద్దేశంతోనే. బిడ్డ పుట్టిన తర్వాత సమంత మళ్లీ పూర్తిగా కోలుకొని ఈ మూవీ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి ఏడాదికపైనే టైమ్ పట్టనుంది. ఈ నేపథ్యంలోనే మా ఇంటి బంగారం 2 2028 తర్వాతే వచ్చే అవకాశం ఉంది.
ఫ్యామిలీ డ్రామా టు గన్ ఫైట్.. సమంత వన్ మ్యాన్ షో
గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'స్త్రీ', 'ఫర్జీ' లాంటి ఇండియన్ బిగ్గెస్ట్ ఓటీటీ అండ్ సిల్వర్ స్క్రీన్ హిట్స్ అందించిన రాజ్ నిడిమోరు.. బాలీవుడ్ కంటే ఈ తెలుగు ప్రాజెక్ట్ సక్సెస్ తన మనసుకు చాలా దగ్గరైందని ఎమోషనల్ అయ్యారు. మొదట ఈ కథను ఒక సింపుల్ ఫ్యామిలీ డ్రామాగా డిజైన్ చేశామని, కానీ సమంత లాంటి ఒక మంచి యాక్టర్ యాక్షన్ స్కిల్స్ చూసిన తర్వాత స్క్రిప్ట్‌ను పూర్తిగా ఒక విజువల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చేసినట్లు రివీల్ చేశారు.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్, ఓమ్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ కాగా.. సినిమాలో సమంత, మంజుషా ముక్కవిల్లి మధ్య సాగే ఫీమేల్ ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలె కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై స్వయంగా నిర్మించడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


