Samantha: అసలు ఒక్క టికెట్ అయినా అమ్ముడుపోతుందా అని భయపడ్డాం.. దేవుడే సాయం చేశాడు: మా ఇంటి బంగారం సక్సెస్‌పై సమంత
Samantha: మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత రూత్ ప్రభు.. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్న ఆందోళనను బయటపెట్టారు. కనీసం ఒక్క టికెట్ అయినా అమ్ముడుపోతుందా అన్న భయం తమలో ఉండేదని తెలిపారు.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) సినిమాతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి కమర్షియల్ హంగులు, పెద్ద హీరోల సపోర్ట్ లేకుండా కేవలం తన వన్ మ్యాన్ షోతో ఈ సినిమాను ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో నిలబెట్టి టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది.

ఈ అద్భుతమైన సక్సెస్ ఫుల్ జర్నీపై సమంత రీసెంట్‌గా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ ఇండియా' (Variety India) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తన భర్త, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను సమంత స్వయంగా ప్రొడ్యూస్ చేయడం విశేషం.
ఒక్క టికెట్ అయినా అమ్ముడవుతుందో లేదో అని భయపడ్డాం
ఈ రేంజ్ సక్సెస్ సాధించడంపై సమంత స్పందిస్తూ.. ఈ విజయం అందించిన కిక్ తనే ఇంకా నమ్మలేకపోతున్నట్లు చెప్పింది. సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని, ఏ సినిమా ఆడుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో ఎవరూ గెస్ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
"మేము ఈ సినిమాను చాలా టైట్ బడ్జెట్‌తో ప్లాన్ చేశాం. షూటింగ్ రోజులు తగ్గించడానికి రాత్రి పగలు కష్టపడ్డాం. నిజం చెప్పాలంటే థియేటర్లలో రిలీజ్ అయ్యే ముందు కనీసం ఒక్క టికెట్ అయినా అమ్ముడవుతుందో లేదో అని నేను, రాజ్ చాలా టెన్షన్ పడ్డాం. పెట్టిన బడ్జెట్ వెనక్కి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. కానీ మంచి ఉద్దేశంతో ఒక కంటెంట్ నమ్మి సినిమా తీస్తే దేవుడే సక్సెస్ ఇస్తాడని ఈ సినిమాతో ప్రూవ్ అయింది" అని సమంత ఎమోషనల్ అయింది.
బస్సు యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్.. ఒకే రోజులో షూటింగ్
ఈ సినిమాలో నటించడం శారీరకంగా, మానసికంగా తనకు పెద్ద ఛాలెంజ్ అని సమంత పేర్కొంది. ఒక కొత్త ప్రయోగం చేయాలనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడకూడదని, సగం సగం ప్రయత్నాలు చేస్తే రిజల్ట్ రాదని క్లారిటీ ఇచ్చింది. సినిమా కోసం రోజుకు 12 గంటలకు పైగా షిఫ్ట్‌లు పనిచేసినట్లు తెలిపింది.
"సినిమాలోని అత్యంత కీలకమైన బస్సు యాక్షన్ సీక్వెన్స్, కొన్ని ఫిల్లర్ సీన్లు, దాంతో పాటు మెయిన్ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను మేము ఒకే ఒక్క రోజులో షూట్ చేసేశాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎక్కడైనా చిన్న తప్పు జరిగితే 'అయ్యో ఇంకా బాగా చేసి ఉండాల్సింది' అని బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే యాక్టింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు నా వంద శాతం కష్టపడ్డాను" అని సమంత చెప్పుకొచ్చింది.
రాజ్ నిడిమోరు మేకింగ్ స్టైల్.. సమంత కెరీర్ బెస్ట్ కమ్‌బ్యాక్
రాజ్ అండ్ డీకే ఫేమ్ రాజ్ నిడిమోరు ఈ సినిమాకు తన మార్క్ కథ అందించారు. ఇక నందినీ రెడ్డి డైరెక్షన్ మరో లెవెల్. హాలీవుడ్ లెవెల్ సినిమాటోగ్రఫీ, గుండెకు హత్తుకునే ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
'ది ఫ్యామిలీ మ్యాన్', సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ల తర్వాత సమంత, రాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌కు ఒక పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. సమంత కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ ఫిల్మ్‌గా నిలిచిపోవడం గ్యారెంటీ అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


