Maa Inti Bangaram Collections: 4 రోజుల్లోనే రూ.50 కోట్లు-సమంత మా ఇంటి బంగారం కలెక్షన్ల విధ్వంసం-రూ.100 కోట్లు సాధ్యమేనా?

Maa Inti Bangaram Collections: టాలీవుడ్ మోస్ట్ పవర్‌ఫుల్ లేడీ స్టార్ సమంత రూత్ ప్రభు నటించిన 'మా ఇంటి బంగారం' థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం రూ.100 కోట్లు చేరేనా? ఇక్కడ చూసేయండి.

Published on: Jun 23, 2026, 13:42:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maa Inti Bangaram Collections: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహిళా ప్రధాన చిత్రాలకు ఉండే మార్కెట్ పరిధిని సమంత రూత్ ప్రభు మరోసారి రీ-డిఫైన్ చేశారు. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో, సమంత హోమ్ బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై స్వయంగా నిర్మించిన యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

4 రోజుల్లోనే రూ.50 కోట్లు-సమంత మా ఇంటి బంగారం కలెక్షన్ల విధ్వంసం (x/Samanthaprabhu2)
4 రోజుల్లోనే రూ.50 కోట్లు-సమంత మా ఇంటి బంగారం కలెక్షన్ల విధ్వంసం (x/Samanthaprabhu2)

మా ఇంటి బంగారం కలెక్షన్లు

సమంత లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం థియేటర్లలో అదరగొడుతోంది. ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఈ మూవీ లేటెస్ట్ వసూళ్లను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘ఓ బేబీ’ రికార్డులు అవుట్

సమంత-నందిని రెడ్డి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఓ బేబీ’ క్లాసిక్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సినిమా సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను ‘మా ఇంటి బంగారం’ కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం.

ఆడియన్స్ కు కనెక్ట్

మా ఇంటి బంగారం చిత్రంలో ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి, తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఆయుధం పట్టి హై-వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లే పాయింట్ ప్రేక్షకులకు, ముఖ్యంగా లేడీస్ ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది.

రాజ్‌ నిడిమోరు అందించిన టైట్ స్క్రీన్‌ప్లే, సమంత చేసిన రియలిస్టిక్ స్టంట్స్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లుగా మారాయి. గుల్షన్ దేవయ్య, శ్రీముఖిల క్యారెక్టర్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అసెట్‌గా నిలిచాయి.

ఓటీటీ డిమాండ్

మా ఇంటి బంగారం కేవలం థియేట్రికల్ వసూళ్లపైనే ఆధారపడలేదు. సమంత-రాజ్ అండ్ డికే కాంబినేషన్‌కు గ్లోబల్ మార్కెట్లో ఉన్న క్రేజ్ వల్ల, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (OTT), సాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. డిజిటల్ రైట్స్‌ను సమంత కెరీర్‌లోనే హయ్యెస్ట్ రేటు పలికాయని అంటున్నారు.

ఇప్పటికే లాభాల్లోకి

సినిమా మేకింగ్ బడ్జెట్, ప్రమోషన్స్ ఖర్చులన్నీ నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే 80% రికవరీ అయిపోయాయి. కాబట్టి, థియేటర్ల నుంచి వచ్చే షేర్ అంతా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నికర లాభాలు తెచ్చిపెడుతోంది.

రూ.100 కోట్లు సాధ్యమేనా?

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం మంగళ, బుధవారాల్లో కూడా మేజర్ సెంటర్స్ లో మా ఇంటి బంగారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్ రన్‌లో ఈ సినిమా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More