Samantha: కమ్‌బ్యాక్ అంటే ఇదే..బాక్సాఫీస్ క్వీన్ సమంత..10 లక్షల టికెట్లు..28 కోట్ల కలెక్షన్లు.. ఓవర్సీస్‌లో రికార్డు
Samantha: సినిమాలకు, సమంతకు మధ్య గ్యాప్ వచ్చింది అంతే. కానీ ఈ హీరోయిన్ జోష్ ఏ మాత్రం తగ్గలేదు. కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలి కదా అనేలా మా ఇంటి బంగారం మూవీతో సామ్ అదరగొడుతోంది. ఈ చిత్రం టికెట్ సేల్స్ లో, కలెక్షన్లలో, ఓవర్సీస్ లో రికార్డులు తిరగరాస్తోంది.
Samantha: ‘ఒక్కొక్కరిని కొడతాను చూడు.. ప్రేమతో’.. ఇదీ మా ఇంటి బంగారంలో సమంత డైలాగ్. ఇప్పుడు ఈ సినిమాతో నిజంగానే రికార్డులు కొల్లగొడుతోంది సామ్. జూన్ 19న థియేటర్లలో రిలీజైన మా ఇంటి బంగారం అదరగొడుతోంది. మిక్స్ డ్ టాక్ వినిపిస్తున్నా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది.

మా ఇంటి బంగారం కలెక్షన్లు
సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం గొప్ప విషయమే.
10 లక్షల టికెట్లు
థియేటర్లలో సమంత యాక్టింగ్ కు, యాక్షన్ కు జనాలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా కాలం తర్వాత హౌజ్ వైఫ్ లతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ బై జొమాటో లో కలిపి 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
ఓవర్సీస్ రికార్డు
ఇక ఓవర్సీస్ లోనూ సమంతకు తిరుగులేదు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఆమె నటించిన 16 సినిమాలు మినిమం వన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా ఇదే క్లబ్ లో చేరబోతోంది. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో వన్ మిలియన్ క్లబ్ లో చేరిన సమంత మూవీస్ సంఖ్య 17కు చేరనుంది. ఇది రికార్డు అని చెప్పొచ్చు.
కమ్ బ్యాక్ అంటే ఇదే
సినీ ఇండస్ట్రీలో వివిధ కారణాల వల్ల నటులు బ్రేక్ తీసుకోవడం కామనే. ఇక అనారోగ్యం కారణంగా సమంత మూడేళ్లు తెలుగు తెరకు దూరంగా ఉంది. చివరకు 2023లో వచ్చిన ఖుషీ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది సామ్. ఆ తర్వాత ఈ ఏడాది ‘శుభం’లో మెరిసినా, అది కేవలం క్యామియో మాత్రమే.
మూడేళ్ల తర్వాత ఫుల్ లెంగ్త్ ఫీమేల్ లీడ్ రోల్ చేసిన సినిమా మా ఇంటి బంగారమే. జనరల్ గా చాలా మంది నటులకు కమ్ బ్యాక్ అంత గొప్పగా ఉండదు. కానీ సామ్ కు మాత్రం ఘనమైన కమ్ బ్యాక్ దక్కింది. ఓ ఆర్టిస్ట్ కు కమ్ బ్యాక్ అంటే ఇలా ఉండాలని జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


