Maa Inti Bangaram Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద సమంత ‘యాక్షన్ సంభవం’..తొలిరోజే కళ్లు చెదిరే కలెక్షన్లు.. అఫీషియల్!
Maa Inti Bangaram Day 1 Collections: లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు తన ఓన్ బ్యానర్ ‘ట్రాలా లా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మించి, నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
Maa Inti Bangaram Day 1 Collections: ఇది కదా కమ్ బ్యాక్ అంటే! అవును.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగు సినిమాతో థియేటర్లకు వచ్చిన సమంత అదరగొడుతోంది. మా ఇంటి బంగారం మూవీతో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా షాక్ అవుతున్నారు.

మా ఇంటి బంగారం కలెక్షన్లు
స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత థియేట్రికల్ స్క్రీన్‌పైకి ఇచ్చిన సాలిడ్ కంబ్యాక్ మూవీ 'మా ఇంటి బంగారం'. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ సినిమా డే 1 ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సమంత కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ సోలో ఓపెనింగ్స్ కావడం గమనార్హం.
వసూళ్లు ఇలా
జూన్ 19న థియేటర్లలో రిలీజైన మా ఇంటి బంగారం మూవీ డే 1 కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మూవీ డే1 వసూళ్లను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.13.15 కోట్లు
నెట్ వసూళ్లు- రూ.5.35 కోట్లు
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ గ్రాస్- రూ.4.75 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ మార్కెట్- రూ.4.50 కోట్లు
తెలుగు వెర్షన్ కాంట్రిబ్యూషన్-రూ. 5.15 కోట్లు
సమంత ‘మాస్ అవతార్’
గతంలో సమంత-నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ 'ఓ బేబీ' తరహాలోనే మా ఇంటి బంగారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి నందిని రెడ్డి కంప్లీట్ ఫ్యామిలీ జోనర్ కాకుండా.. ఒక విభిన్నమైన లైన్‌తో ఈ కథను తెరకెక్కించారు. సాంప్రదాయ గృహిణి 'స్వర్ణ'గా కనిపిస్తూనే, తన కుటుంబంపై ఆపద వచ్చినప్పుడు గన్ పట్టి 'ఝాన్సీ'గా సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తున్నాయి.
లేడీ సూపర్ స్టార్ల బాక్సాఫీస్ రేస్
సమంత గత సోలో హిట్ ‘యశోద’ మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.3.06 కోట్లుగా ఉన్నాయి. దానితో పోలిస్తే 'మా ఇంటి బంగారం' ఏకంగా రూ.5.35 కోట్ల నెట్ సాధించి సమంత స్టామినాను నిరూపించింది. అంతేకాదు, ఇటీవల వచ్చిన ఇతర లేడీ-ఓరియెంటెడ్ చిత్రాలైన అనుష్క శెట్టి ‘ఘాటి’ (రూ.2 కోట్లు), రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (రూ.1.30 కోట్లు) ల ఓపెనింగ్స్ రికార్డులను సమంత చాలా ఈజీగా క్రాస్ చేసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


