Samantha: సమంతను తక్కువ అంచనా వేశారు.. తొలి రోజు కలెక్షన్లతో ఆమె కెపాసిటీ ఏంటో తెలిసింది: రాజ్ నిడిమోరు
Samantha: సమంత గురించి తక్కువ అంచనా వేశారంటూ ఆమె భర్త రాజ్ నిడిమోరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మా ఇంటి బంగారం మూవీ నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకుపైగా వసూలు చేయడంపై ఆయన స్పందిస్తూ.. ఆమెకు ఇప్పటికీ తొలి రోజే జనాలను థియేటర్లకు రప్పించే కెపాసిటీ ఉందని అనడం విశేషం.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్ లో నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) బాక్సాఫీస్ దగ్గర అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టింది. సమంత సోలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ భారీ విజయం వెనుక ఒక రియల్ లైఫ్ మ్యాజిక్ కూడా ఉంది. ఈ చిత్రానికి సమంత భర్త, హిట్ మేకర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) కథ అందించడమే కాకుండా.. సమంతతో కలిసి ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రేజీ స్టార్ కపుల్ హోమ్ బ్యానర్ లో వచ్చిన ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్ కావడం.. దీనికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో ఈ సక్సెస్ సామ్ - రాజ్ జంటకు మరింత స్పెషల్ గా మారింది.
బజ్ లేదు.. ఫీమేల్ సినిమాలకు హైప్ ఉండదన్నారు
ఈ భారీ రెస్పాన్స్ పై రైటర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
"రిలీజ్ కు కొన్ని రోజుల ముందు మా కో-ప్రొడ్యూసర్స్ లో ఒకరు ఇండస్ట్రీకి చెందిన ఒకరిని.. సినిమా బజ్ ఎలా ఉంది? అని అడిగారు. దానికి అతను.. 'ఏం బజ్? ఫీమేల్ లీడ్ సినిమాలకు ముందేం హైప్ ఉండదు. థియేటర్లలోకి వచ్చాక టాక్ బాగుంటేనే జనాలు వస్తారు' అని చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ టైమ్ లో అది మాకు కాస్త కఠినమైన నిజంలాగే అనిపించింది. మేము కూడా అలాగే అనుకున్నాం. కానీ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ నంబర్స్ చూశాక మాకు అర్థమైంది.. సినిమా ఏదైనా సినిమానే, దానికి మేల్ లేదా ఫీమేల్ అనేది ముఖ్యం కాదు. సమంతకు థియేటర్లకు జనాలను భారీగా రాబట్టే కెపాసిటీ ఉందని ఈ ఓపెనింగ్స్ మరోసారి గుర్తుచేశాయి" అని రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా ఇంత పెద్ద హిట్ అయినా, థియేటర్ల బయట ఫ్యాన్స్ హంగామా చేస్తున్నా.. సమంత మాత్రం ఎప్పటిలాగే చాలా గ్రౌండెడ్ గా ఉందట. సాధారణంగా సామ్ ఒక సినిమా సక్సెస్ ను అంత ఈజీగా ఒప్పుకోదు.. 'యస్.. మనం సాధించాం' అని వెంటనే అనదు. కానీ ఈసారి పాజిటివ్ రిజల్ట్ చూసి శని, ఆదివారాల కల్లా.. 'అవును, సినిమా వర్కవుట్ అవుతున్నట్టుంది' అని ఒప్పుకుందని, ఆమె యాక్సెప్టెన్స్ విండో కాస్త తగ్గిందని రాజ్ నవ్వుతూ చెప్పారు.
అలా ఎంజాయ్ చేస్తున్నాను
తమ హోమ్ ప్రొడక్షన్ 'ట్రాలాలా మూవీస్' సక్సెస్ సెలబ్రేషన్స్ గురించి రాజ్ స్పందిస్తూ.. "నా సెలబ్రేషన్స్ చాలా సింపుల్ గా సాగుతున్నాయి. మా టీమ్ తో కలిసి వేర్వేరు థియేటర్లకు వెళ్తూ ఆడియన్స్ ఎగ్జైట్‌మెంట్‌ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వాటిని ఫోన్ లో షూట్ చేస్తూ ఆ హ్యాపీ మూమెంట్స్ ను స్టోర్ చేసుకుంటున్నాను. ఇక నాలో ఉండే రొటీన్ బోరింగ్ సైడ్ విషయానికొస్తే.. థియేటర్ల నుంచి రూమ్‌కి రాగానే మళ్లీ నా కొత్త కథ రాయడం మొదలుపెట్టేస్తాను" అని తన ఫ్యూచర్ ప్లాన్స్ ను వెల్లడించారు.
వర్కింగ్ డేస్ లోనూ కలెక్షన్ల సునామీ
నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చి జూన్ 19న విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజు (శుక్రవారం) ఇండియాలో రూ. 5.35 కోట్ల నెట్ వసూళ్లతో స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది. శని, ఆదివారాల్లో పాజిటివ్ మౌత్ టాక్ తో కలెక్షన్లు భారీగా పెరిగాయి. శనివారం రూ. 7.65 కోట్లు, ఆదివారం రూ. 10.10 కోట్ల నెట్ వసూళ్లతో వీకెండ్ లో సంచలనం సృష్టించింది.
అంతేకాదు సోమవారం (వర్కింగ్ డే) కూడా థియేటర్లలో పట్టు కోల్పోకుండా అదనంగా రూ. 4.10 కోట్ల నెట్ రాబట్టింది. దీంతో కేవలం 4 రోజుల్లోనే ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ రూ. 27.20 కోట్లకు చేరుకుంది. లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకు ఓపెనింగ్స్ రావు అని విమర్శించే వాళ్లకు సమంత తన బాక్సాఫీస్ స్టామినాతో గట్టి సమాధానం చెప్పింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


