Kriti Sanon: మంచిదానిలా నటించి విసిగిపోయా.. హీరోయిన్ కృతి సనన్ కామెంట్స్
Kriti Sanon About Good Girl Roles: సినిమాల్లో పక్కింటి అమ్మాయి, అమాయకమైన క్యారెక్టర్లు చేసి విసిగిపోయానని బాలీవుడ్ నేషనల్ అవార్డు విన్నర్ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్‌లో కూడా గుడ్ గర్ల్ సిండ్రోమ్ ఉందని చెప్పారు. కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు.
Kriti Sanon About Good Girl Roles: సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో ఎలాంటి పాత్ర వచ్చినా ఆకట్టుకునేలా నటించి మెప్పించడమే నటీనటుల ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కానీ, ఒకే రకమైన మూస పాత్రలకే పరిమితమైతే ఎంతటి ప్రతిభావంతులైన నటులకైనా విసుగు రావడం సహజం.

కరీనా కపూర్ టాక్ షో
సరిగ్గా ఇదే విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, నేషనల్ అవార్డు గ్రహీత కృతి సనన్ బహాటంగా వెల్లడించారు. బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ, ఇటీవల కరీనా కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'వాట్ ఉమెన్ వాంట్' టాక్ షోలో పాల్గొని తన మనసులోని మాటను నిర్మొహమాటంగా పంచుకున్నారు.
మగవారి కోణంలోనే ఆ పాత్రల రూపకల్పన
ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ కృతి సనన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "కెరీర్ ఆరంభంలో మన ముందుకు వచ్చిన పరిమిత అవకాశాల నుంచే ఉత్తమమైన వాటిని ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా కాలం పాటు నన్ను కేవలం 'మంచి పిల్ల' (గుడ్ గర్ల్) పాత్రలకే పరిమితం చేశారు" అని కృతి సనన్ తెలిపారు.
"మన సినిమాల్లో మహిళా పాత్రలను ఎక్కువగా పురుషుల కోణంలోనే రాస్తుంటారు. 'సతీ సావిత్రి'లా ఉండటం, సిగ్గుపడటం, రౌడీల బారి నుంచి హీరో వచ్చి కాపాడే వరకు ఎదురుచూడటం, ఎప్పుడూ ఏ తప్పూ చేయకపోవడం.. ఇలాంటి పాత్రలే ఎక్కువగా వస్తుంటాయి" అని కృతి సనన్ పేర్కొన్నారు.
రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనకు ఈ 'గుడ్ గర్ల్ సిండ్రోమ్' (మంచిదానిలా ఉండటం) ఉందంటూ సరదాగా నవ్వేశారు. నిత్యం పద్ధతిగా, అందరినీ మెప్పించేలా ఉండటం వల్ల కొంతకాలానికి బోర్ కొట్టేస్తుందని, అందుకే కాస్త భిన్నమైన రోల్స్ వైపు మొగ్గు చూపుతున్నానని కృతి సనన్ చెప్పారు.
బ్లాక్ అండ్ వైట్ మధ్య ఉండే మనుషుల కథలు
ఇప్పుడిప్పుడే పరిగణనలోకి తీసుకునేలా రచయితలు మహిళా పాత్రల శైలిని మారుస్తున్నారని కృతి సనన్ హర్షం వ్యక్తం చేశారు. "మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం. పర్ఫెక్ట్‌గా ఏ ఒక్కరూ ఉండరు. మంచి-చెడు కలగలిసిన మానవ నైజానికి అద్దం పట్టేలా ఇప్పుడు పాత్రలను తీర్చిదిద్దుతుండటం ఎంతో సంతోషకరమైన పరిణామం" అని కృతి సనన్ అభిప్రాయపడ్డారు.
"ఇటీవల నేను చేసిన 'దో పత్తి' సినిమాలో ద్విపాత్రాభినయం చేశాను. అందులో స్వార్థం, కాస్త పొగరు ఉన్న సంక్లిష్టమైన క్యారెక్టర్ చేయడం నాకు కొత్త అనుభవాన్ని, గొప్ప ఆత్మానందాన్ని ఇచ్చింది" అని కృతి సనన్ వివరించారు.
హాలీవుడ్ చిత్రం 'జోకర్' లో జోక్విన్ ఫినిక్స్ నటనను ఉదాహరణగా చూపిస్తూ.. సదరు పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉన్నప్పటికీ, ఆ పాత్రలోని బాధను చూసి ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో గుర్తుచేశారు. నటులకు అలాంటి సవాలుతో కూడిన పాత్రలే అసలైన తృప్తిని ఇస్తాయని అభిప్రాయపడ్డారు.
హీరోయిన్ నుంచి గ్లోబల్ ప్రొడ్యూసర్ స్థాయికి
'హీరోపంతి' చిత్రంతో హిందీ అరంగేట్రం చేసిన కృతి సనన్, తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. 'మిమీ' చిత్రంలో చూపించిన అద్భుత నటనకుగాను ఉత్తమ నటిగా జాతీయ రక్షణ పురస్కారాన్ని (నేషనల్ అవార్డు) అందుకున్నారు.
కృతి సనన్ సినిమాలు
'బరేలీ కీ బర్ఫీ', 'దిల్‌వాలే', 'తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' వంటి సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్ అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. హోమి అదాజానియా తెరకెక్కించిన 'కాక్‌టెయిల్ 2' లోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కృతి సనన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


