OTT Release: ఓటీటీలో ఈ నెల 5 క్రేజీ తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు.. హారర్ థ్రిల్లర్ నుంచి రజనీ యాక్షన్ వరకు..

OTT Release: ఓటీటీ ప్రియులకు నవంబర్ లో పండుగ వాతావరణం ఉండనుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన, ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 క్రేజీ సౌత్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమయ్యాయి. వీటిలో జైలర్ 2, రణబాలి, 418, హైకూలాంటి సినిమాలు ఉన్నాయి.

Published on: Nov 3, 2026, 14:19:17 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release: ప్రపంచవ్యాప్తంగా సౌత్ ఇండియన్ సినిమాలకు, నటీనటులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న పలు భారీ చిత్రాలు, కంటెంట్ ఓరియెంటెడ్ కథలు ఇప్పుడు నవంబర్ నెలలో డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.

OTT Release: ఓటీటీలో ఈ నెల 5 క్రేజీ తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు.. హారర్ థ్రిల్లర్ నుంచి రజనీ యాక్షన్ వరకు..
OTT Release: ఓటీటీలో ఈ నెల 5 క్రేజీ తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు.. హారర్ థ్రిల్లర్ నుంచి రజనీ యాక్షన్ వరకు..

మీరు గనక అద్భుతమైన యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామాలను ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించాలనుకుంటే.. ఈ నెలలో ఓటీటీలో విడుదల కానున్న ఈ 5 టాప్ సౌత్ సినిమాల లిస్ట్ మీకోసమే. ఏ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1. ఐ యామ్ గేమ్ (I Am Game - మలయాళం)

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'ఐ యామ్ గేమ్'. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్‌గా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, ఓటీటీలో ఈ తరహా జానర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సినిమా నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.

2. జైలర్ 2 (Jailer 2 - తమిళం)

సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ అవతార్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే రీతిలో రూ. 800 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రాబట్టిన 'జైలర్ 2' కోసం ఓటీటీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ఎన్నో అగ్ర హీరోల సినిమాలను కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టిన ఈ యాక్షన్ బ్లాక్‌బస్టర్ నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

3. రణబాలి (Ranabali - తెలుగు)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'రణబాలి'. 19వ శతాబ్దపు బ్రిటీష్ వలస పాలన, దక్షిణ భారతదేశంలో సంభవించిన భయంకరమైన 'మద్రాసు కరువు' వంటి చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను పలకరించేందుకు నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి రానుంది.

4. హైకూ (Haiku - తమిళం)

యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో రూపొందిన బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామా 'హైకూ'. ఏగన్, శ్రీదేవి ఆపళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారి కోసం నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

5. 418 (తెలుగు)

హారర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు '418' ఒక బెస్ట్ ఆప్షన్. కీర్తన్ నాడగౌడ దర్శకత్వంలో చైత్ర జె ఆచార్ నటించిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. భయపెట్టే అంశాలతో పాటు మెదడుకు మేత పెట్టే సైకలాజికల్ అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ తెలుగు థ్రిల్లర్ నవంబర్ 20న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More