Jailer 2: 800 కోట్ల కలెక్షన్స్- తొలి తమిళ సినిమాగా రజనీకాంత్ జైలర్ 2 రికార్డ్- తెలుగు నుంచి ఓవర్సీస్ దాకా ఎంతొచ్చాయంటే?

Rajinikanth Jailer 2 Worldwide Collection 800 Cr: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సంచలనం సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ. 800 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తమిళ చిత్రంగా నిలిచి, బాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్లను కూడా అధిగమించింది. తెలుగు నుంచి ఓవర్సీస్ దాకా ఎంతొచ్చాయో చూద్దాం.

Published on: Nov 2, 2026, 11:25:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Rajinikanth Jailer 2 Box Office Collection 800 Cr: 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ వద్ద తన మేనియా తగ్గలేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి నిరూపించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ చిత్రం భారతీయ చిత్రసీమలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

800 కోట్ల కలెక్షన్స్- తొలి తమిళ సినిమాగా రజనీకాంత్ జైలర్ 2 రికార్డ్- తెలుగు నుంచి ఓవర్సీస్ దాకా ఎంతొచ్చాయంటే?
800 కోట్ల కలెక్షన్స్- తొలి తమిళ సినిమాగా రజనీకాంత్ జైలర్ 2 రికార్డ్- తెలుగు నుంచి ఓవర్సీస్ దాకా ఎంతొచ్చాయంటే?

తాజాగా జైలర్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 808 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. 800 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డుకెక్కింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులలో కూడా ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దసరా, నవరాత్రి సెలవుల సీజన్ కలిసి రావడంతో తొలి వారంలోనే రూ. 400 కోట్ల వసూళ్లను సాధించింది.

బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల సునామీ

మూడో వారాంతంలోనూ జైలర్ 2 తన జోరును కొనసాగిస్తోంది. 18వ రోజు (నవంబర్ 1-ఆదివారం) భారత బాక్సాఫీస్ వద్ద రూ. 11.50 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది జైలర్ 2 సినిమా. మూడో వారాంతానికి రూ. 26.40 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.

దీంతో ఇండియాలో 18 రోజుల్లో మొత్తంగా రూ. 456 కోట్ల నెట్ (రూ. 533 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ వసూలు చేసింది రజనీకాంత్ జైలర్ 2 సినిమా. దాంతో భారత బాక్సాఫీస్ వద్ద రూ. 450 కోట్ల నెట్ వసూలు చేసిన ఏకైక తమిళ చిత్రంగా జైలర్ 2 నిలిచింది.

ప్రతి ప్రాంతంలో 60 కోట్లు

తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాలలో ప్రతి రీజియన్‌లోనూ కనీసం రూ. 60 కోట్ల వసూళ్లను సాధించిన తొలి తమిళ చిత్రంగా జైలర్ 2 చరిత్ర సృష్టించింది. ఓవర్సీస్‌లోనూ రజనీకాంత్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఉత్తర అమెరికా, గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలలో విదేశీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో దాదాపు 29 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 240 కోట్లు) వసూళ్లను రాబట్టింది. రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ వసూళ్లతో సమానంగా విదేశీ మార్కెట్‌లో దూసుకుపోతోంది.

బాలీవుడ్ రికార్డులు ధ్వంసం

తన కలెక్షన్ల జోరుతో జైలర్ 2 అనేక హిందీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్లను వెనక్కి నెట్టింది. అమీర్ ఖాన్ ఆల్‌టైమ్ హిట్ ‘పీకే’ (రూ. 769 కోట్లు), విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ‘ఛావా’ (రూ. 807 కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను జైలర్ 2 అధిగమించింది.

త్వరలో రానున్న రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ చిత్రం వల్ల కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, లాంగ్ రన్‌లో జైలర్ 2 సినిమా రూ. 850 కోట్ల మార్కును చేరుకుని ‘కాంతార ఛాప్టర్ 1’, ‘స్త్రీ 2’ రికార్డులను కూడా అధిగమించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

అంచనాలను మించిన నటీనటుల సమ్మేళనం

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో రజనీకాంత్ తన ఐకానిక్ పాత్ర 'టైగర్' ముత్తువేల్ పాండ్యన్‌గా మరోసారి అలరించారు. సాధారణంగా తన సినిమాలకు సీక్వెల్స్‌ చేయడానికి అంతగా ఆసక్తి చూపని రజనీకాంత్, నెల్సన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ రెండవ భాగంలో నటించడానికి అంగీకరించారు.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, మీర్నా మీనన్, రిత్విక్ తమ పాత పాత్రలలో కనిపించగా.. ఎస్‌జే. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్, అన్నా రాజన్, జతిన్ సర్నా కొత్తగా చేరారు. వీరితో పాటు హృతిక్ రోషన్, మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ ప్రత్యేక అతిథి పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను థ్రిల్ చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More