RC17: చిరంజీవి క్లాప్‌తో రామ్ చరణ్ ఆర్‌సీ17 షురూ- సుకుమార్ నిద్రలేని రాత్రులు గడిపారన్న భార్య తబితా- జైలర్ 2 పాటతో హైప్
Sukumar Wife Tabitha Post On RC17 Launch: రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం RC17 ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా సుకుమార్ కష్టంపై ఆయన భార్య తబితా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Sukumar Wife Tabitha Post On RC17 Launch: తెలుగు చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #RC17 (వర్కింగ్ టైటిల్) ఇవాళ ఆదివారం (నవంబర్ 1) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ముఖ్య అతిథిగా చిరంజీవి
'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం మళ్లీ రామ్ చరణ్‌తో చేతులు కలపడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన ఈ లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రాండ్‌గా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరంజీవి
దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టి మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్ప సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
"నా ప్రియమైన సుక్కుతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది" – రామ్ చరణ్
ఆర్‌సీ17 సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రామ్ చరణ్ సామాజిక మాధ్యమాల్లో తన సంతోషాన్ని పంచుకున్నారు. "ఈ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. నా ప్రియమైన సుకుమార్ గారితో మళ్లీ కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. #RC17 ప్రయాణం మొదలైంది" అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నెమలి పించం నేపథ్యంతో రామ్ చరణ్ ముఖచిత్రాన్ని డిజైన్ చేశారు. అయితే సినిమా కథాంశం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వెనుక సుకుమార్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటూ ఆయన భార్య తబిత ఒక ప్రత్యేక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
నిద్రలేని రాత్రులు గడిపారు.. భార్య తబిత భావోద్వేగ పోస్ట్
"ఒక భార్యగా ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా, ఉత్సాహంగా ఉంది. ఈ కథను సిద్ధం చేయడానికి సుక్కు ఎన్ని గంటలు నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంతగా తపించారో నేను దగ్గరుండి చూశాను. ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ కుదరడంతో అంచనాలు మరింత పెరిగాయి" అని తబితా రాసుకొచ్చారు.
ఈ వీడియోలో అభిమానులను ఉద్దేశించి సుకుమార్ 'యూ కెన్ ఇమాజిన్' (మీరే ఊహించుకోండి) అని అంటున్న క్లిప్పింగ్‌ను, రజనీకాంత్ 'జైలర్ 2' పాటను నేపథ్యంగా జోడించారు. కాగా, 2018లో వచ్చిన 'రంగస్థలం' నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసి ఒక క్లాసిక్‌గా నిలిచింది.
‘పెద్ది’ తర్వాత చరణ్.. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్!
ఆ తర్వాత సుకుమార్ ఐదేళ్ల పాటు 'పుష్ప' ప్రాంచైజీకే పూర్తి సమయం కేటాయించారు. 2024లో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం తర్వాత సంతకం చేసిన భారీ ప్రాజెక్ట్ ఇది. మరోవైపు నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా రూపొందుతున్న 'ది ఇండియా హౌస్' చిత్రానికి రామ్ చరణ్ నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


