Janhvi Kapoor: అది ఒకరకమైన లైంగిక దాడి- చుట్టమల్లే సాంగ్‌పై జాన్వీ కపూర్ కామెంట్స్- ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్‌పై అలా!

Janhvi Kapoor Reacts To Chuttamalle Morphed: 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లె' పాట ఆధారంగా సృష్టించిన ఏఐ అశ్లీల వీడియోపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మహిళల ఆత్మగౌరవాన్ని, భద్రతను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాటను అశ్లీలంగా చేయడాన్ని లైంగికదాడిగా అభివర్ణించారు.

Published on: Oct 4, 2026, 22:45:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Janhvi Kapoor Reacts To Chuttamalle Morphed: సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న తీరుపై బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అది ఒకరకమైన లైంగిక దాడి- చుట్టమల్లే సాంగ్‌పై జాన్వీ కపూర్ కామెంట్స్- ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్‌పై అలా!
అది ఒకరకమైన లైంగిక దాడి- చుట్టమల్లే సాంగ్‌పై జాన్వీ కపూర్ కామెంట్స్- ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్‌పై అలా!

ఒకరకమైన లైంగిక దాడి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ చిత్రంలోని పాపులర్ ‘చుట్టమల్లె’ సాంగ్ విజువల్స్‌ను ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో వ్యాప్తి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన జాన్వీ కపూర్ ఇది కేవలం సాంకేతిక దుర్వినియోగం మాత్రమే కాదని, ఒక రకమైన లైంగిక దాడితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు.

సాంకేతికత పేరిట విచక్షణారహిత దాడి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించిన తర్వాత సినీ తారలే కాకుండా సామాన్య మహిళలు సైతం డీప్‌ఫేక్ మోసాల బారిన పడుతున్నారు. ఈ అంశంపై జాన్వీ కపూర్ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చారు.

"మహిళలను కేవలం భోగవస్తువుగా చూపుతూ, వారి అనుమతి లేకుండా ఇటువంటి కల్పిత దృశ్యాలను సృష్టించడం నేరం. ఇది నైతిక విలువలకే కాకుండా ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద దెబ్బ. చలనచిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటూనే ఉంది" అని జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరో రోజు వద్దంటే గౌరవించాలి

సమ్మతి, స్వయంప్రతిపత్తి గురించిన ప్రాథమిక అంశాలను ప్రస్తావిస్తూ.. "ఒక మహిళ ఐదు రోజులు ఒక విషయానికి అంగీకరించి, ఆరో రోజు వద్దంటే ఆ నిర్ణయాన్ని గౌరవించాలి. మహిళ పొట్టి దుస్తులు వేసుకున్నంత మాత్రాన విపరీతమైన కోణాల్లో కెమెరాలు పెట్టి చిత్రీకరించే హక్కు ఎవరికీ లేదు. తన శరీరంపై, తన సరిహద్దులపై పూర్తి నిర్ణయాధికారం ఆ మహిళకే ఉంటుంది" అని స్పష్టం చేశారు.

డిజిటల్ ప్రపంచంలోనూ భద్రత కరువు

ఈ సమస్య కేవలం తనకు ఎదురైన ఒక్క సంఘటనకే పరిమితం కాదని, మహిళగా సమాజంలో ఎదుర్కొంటున్న భయానక వాతావరణానికి ప్రతిరూపమని జాన్వీ అభిప్రాయపడ్డారు. భౌతిక ప్రపంచంలోనే మహిళలకు పూర్తి స్థాయి రక్షణ లభించని పరిస్థితుల్లో, ఇప్పుడు డిజిటల్ రూపంలో కొత్త తరహా బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఈ వేధింపుల ఘటనలో తనకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్ దిగ్గజాలకు జాన్వీ కపూర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. "ఇలాంటి విపరీత ధోరణిపై గళమెత్తి, ఖండించినందుకు ఎన్టీఆర్ సర్‌కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోట్లాది మంది అభిమానించే ఒక నాయకుడు తనకు నేరుగా సంబంధం లేని అంశంపై స్పందించినప్పుడు, బాధితులకు కొండంత అండ లభిస్తుంది" అని కొనియాడారు.

ఎన్టీఆర్, చిరు, విజయ్, ఖుష్బూ కామెంట్స్‌పై

సీనియర్ నటుడు చిరంజీవి, విజయ్ దేవరకొండ, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఈ పోరాటానికి అండగా నిలవడంపై కితాబిచ్చారు జాన్వీ కపూర్. "మన చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు వేధింపులకు పాల్పడే వారిలో మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఒక మహిళను మనిషిగా చూడాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? ఆమె శరీరం, ఆమె చిత్రం, ఆమె సరిహద్దులు, ఆమె ఎంపిక.. ఇవే ప్రాథమిక సూత్రాలు" అంటూ జాన్వీ తన సందేశాన్ని ముగించారు.

అణిచివేతపై ఆలోచించాల్సిన సమయం

ఇదిలా ఉంటే, 2024 సెప్టెంబర్‌లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన 'దేవర: పార్ట్ 1' చిత్రంలో అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, శిల్పా రావు పాడిన 'చుట్టమల్లె' పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఈ పాటలోని జాన్వీ దృశ్యాలను ఏఐ సాంకేతికతతో అశ్లీలంగా మార్చడం తీవ్ర నిరసనలకు దారితీసింది.

జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

ఆర్జీవీ ట్వీట్

ప్రస్తుతం సదరు వీడియోను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించినప్పటికీ, సైబర్ నేరగాళ్ల తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. మరోవైపు చుట్టమల్లే పాటను అశ్లీలంగా మలచడంపై తారక్ ఇతర సెలబ్రిటీలు స్పందించి ఆ వీడియోను పబ్లిసిటీ చేయడం కూడా నేరమే అంటూ ఆర్జీవీ తన స్టైల్‌లో ట్వీట్ పెట్టారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More