OTT Show: స్టార్ హీరోను అచ్చంగా దించేసిన కమెడియన్ సునీల్- ఓటీటీ షోలో నవ్వులు- రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ!

Sunil Grover Uncanny Ajay Devgn In Great Indian Kapil Show 5: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌కు విచ్చేసిన 'దృశ్యం 3' టీమ్‌తో పాటు అజయ్ దేవ్‌గన్ గెటప్‌లో కమెడియన్ సునీల్ గ్రోవర్ చేసిన హంగామా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Published on: Sep 27, 2026, 06:32:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Sunil Grover Uncanny Ajay Devgn In Great Indian Kapil Show 5: నవ్వులు పూయించే ఓటీటీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ఐదో సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ షో మొదటి ఎపిసోడ్‌లోనే సరికొత్త హంగామా సృష్టించింది.

స్టార్ హీరోను అచ్చంగా దించేసిన కమెడియన్ సునీల్- ఓటీటీ షోలో నవ్వులు- రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ!
స్టార్ హీరోను అచ్చంగా దించేసిన కమెడియన్ సునీల్- ఓటీటీ షోలో నవ్వులు- రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ!

దృశ్యం 3 ప్రమోషన్స్

త్వరలోనే థియేటర్లలోకి రానున్న అత్యంత ఇంట్రెస్టింగ్ హిందీ చిత్రం 'దృశ్యం 3' ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ తన చిత్రబృందంతో కలిసి ఈ ఓటీటీ కామెడీ షో వేదికపై సందడి చేశారు. తెలుగులో వెంకటేష్ 'దృశ్యం' ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే హిందీలో వస్తున్న ఈ మూడో భాగానికి కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అజయ్ దేవగన్‌ను దించేసిన సునీల్ గ్రోవర్!

ఈ ఎపిసోడ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం కమెడియన్ సునీల్ గ్రోవర్ పెర్ఫార్మెన్స్. అజయ్ దేవగన్ లాగే దుస్తులు ధరించి, ఆయన బాడీ లాంగ్వేజ్, గొంతును అచ్చంగా అనుకరిస్తూ సునీల్ చేసిన హంగామా సెట్‌లోని వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది.

'సింగం' పోజ్ ఇస్తూ ఆయన పండించిన కామెడీ కిక్కు ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా పంచుకున్న ఈ ప్రమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సునీల్ నటనను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మనుషుల రూపాన్ని మార్చే

"ఒరిజినల్ అజయ్ దేవగన్ కంటే సునీల్ గ్రోవరే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తున్నారు" అని ఒక నెటిజన్ ప్రశంసించగా, "సునీల్ నటన ముందు రియల్ యాక్టర్స్ కూడా కాస్త ఇబ్బంది పడక తప్పదు" అని మరొకరు చమత్కరించారు. మరికొందరైతే ఆయనను మనుషుల రూపాన్ని మార్చే 'షేప్‌షిఫ్టర్' అని, 'రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)' అని ఆకాశానికెత్తేశారు.

అనుకరణ వెనుక సునీల్ సీక్రెట్ అదే!

కేవలం అజయ్ దేవగన్ మాత్రమే కాకుండా గతంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, గుల్జార్ వంటి ప్రముఖుల పాత్రలను కూడా సునీల్ అత్యంత సహజంగా పోషించారు. ఒక వ్యక్తిని అనుకరించే ముందు వారి మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడమే తన విజయరహస్యమని సునీల్ చెబుతుంటారు.

"నా దృష్టిలో ఒకరిలా నటించడం అంటే కొంతసేపు ఆ వ్యక్తిగా మారిపోవడమే. వారి కోణంలో ఆలోచిస్తూ, వారి అనుభూతులను ఆస్వాదిస్తాను. ఈ ప్రక్రియ నాకు ఒక ధ్యానం లాంటిది. నాకు మనస్ఫూర్తిగా నచ్చిన వారిని మాత్రమే నేను అనుకరిస్తాను" అని గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సునీల్ గ్రోవర్ వెల్లడించారు.

జైదీప్ అహ్లావత్ డ్యాన్స్.. కపిల్ గ్యాంగ్ రచ్చ!

'పాతాళ్ లోక్', 'దృశ్యం' సిరీస్‌లలో గంభీరమైన పాత్రలకు పేరుగాంచిన నటుడు జైదీప్ అహ్లావత్ ఈ షోలో సరికొత్తగా కనిపించారు. కృష్ణ అభిషేక్, కికు శార్దాలతో కలిసి ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. దర్శకుడు అభిషేక్ పాఠక్, హీరోయిన్లు శ్రియా శరణ్, ఇషితా దత్తా, మృణాల్ యాదవ్ కూడా ఈ సరదా సంభాషణల్లో పాలుపంచుకున్నారు.

ఆరు నెలల విరామం తర్వాత కపిల్ శర్మ, సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్, కికు శార్దా, అర్చన పూరన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ ఒకే వేదికపైకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ప్రతి శనివారం స్ట్రీమింగ్

సెప్టెంబర్ 26 నుంచి ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు ఈ షో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కానుంది. విజయ్ సల్గాంకర్ పాత్రలో అజయ్ దేవగన్ చివరిసారిగా కనిపించనున్న 'దృశ్యం 3' చిత్రంలో టబు, రజత్ కపూర్‌లతో పాటు ప్రకాష్ రాజ్, జైదీప్ అహ్లావత్ కొత్తగా చేరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More