OTT: ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ప్రైమ్ టు హాట్‌స్టార్, హారర్ టు క్రైమ్!

Top 6 OTT Thriller Movies To Watch This Weekend: వారం అంతా పని ఒత్తిడితో అలసిపోయిన మూవీ లవర్స్ కోసం ఓటీటీ వేదికలపై వినోదం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహాలలో వీకెండ్ కోసం చూసేందుకు ది బెస్ట్ 6 ఓటీటీ థ్రిల్లర్స్ సినిమాలు తెలుగులో రెడీగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

Published on: Sep 27, 2026, 05:10:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Best 6 OTT Thriller Movies To Watch Today Sunday: వీకెండ్ వచ్చిందంటే చాలు సినీ లవర్స్ కొత్త సినిమాలు, డిజిటల్ సిరీస్‌ల కోసం ఓటీటీ వేదికలను జల్లెడ పడతారు. థియేటర్లలో సందడి ఒకెత్తయితే, ఇంటి పట్టునే హాయిగా కూర్చొని నచ్చిన కంటెంట్ చూడటం మరో అనుభూతి.

ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ప్రైమ్ టు హాట్‌స్టార్, హారర్ టు క్రైమ్!
ఇవాళ సండే- ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్ సినిమాలు- అన్నీ తెలుగులోనే- ప్రైమ్ టు హాట్‌స్టార్, హారర్ టు క్రైమ్!

బెస్ట్ 6 ఓటీటీ థ్రిల్లర్స్

ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు హారర్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో పలు ఆసక్తికరమైన చిత్రాలు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ఆహా సంస్థలు స్ట్రీమింగ్‌కు తెచ్చిన ది బెస్ట్ 6 ఓటీటీ థ్రిల్లర్ సినిమాలపై లుక్కేద్దాం.

చారిత్రక పోరాటాలు.. కోర్టురూమ్ డ్రామాలు!

1. ది రివల్యూషనరీస్ (ప్రైమ్ వీడియో):

భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కించిన 8 ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్ ఇది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవకారుల సాహసాలను ఇందులో ఆవిష్కరించారు. ఐఎమ్‌డీబీలో 7.8 రేటింగ్ సాధించిన ఈ పీరియాడిక్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ చారిత్రక అంశాలను ఇష్టపడేవారికి మంచి ఎంపిక.

2. హుంకార్: ది రోర్ (జియో హాట్‌స్టార్):

ఇది సంచలనాత్మక క్రైమ్ థ్రిల్లర్ కోర్టు రూమ్ డ్రామా. 17 ఏళ్ల మీనూ రావత్ అనే చిన్నారి, సమాజంలో ఆధ్యాత్మిక గురువుగా చలామణి అయ్యే 'బాప్జీ' అలియాస్ సునీల్ చౌక్సీపై అత్యాచారం ఆరోపణలు చేస్తుంది. ఆపై సాగే సవాలుతో కూడిన న్యాయపోరాటం చుట్టూ ఈ కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ కథ ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఉత్కంఠరేపే థ్రిల్లర్లు

3. షాక్: ట్రస్ట్ నో వన్ (నెట్‌ఫ్లిక్స్):

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆసుపత్రి నుంచి కిడ్నాప్‌నకు గురైన తన చిన్నారి కోసం ఒక తల్లి సుదీర్ఘ కాలం సాగించే అన్వేషణే ఈ చిత్ర కథ. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న చేదు నిజాలు, బంధాల వెనుక ఉన్న చీకటి కోణాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇలాంటి షాక్ ట్రస్ట్ నో వన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

4. లస్ట్ స్టోరీస్ 3 (నెట్‌ఫ్లిక్స్):

విక్రమాదిత్య మోట్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ నిర్దేశకత్వంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి, రాధికా ఆప్టే, కొంకణ సేన్ శర్మ తదితర నటులతో రూపుదిద్దుకున్న బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఆంథాలజీ సిరీస్ ఇది. నాలుగు భిన్నమైన ప్రేమ, ఆకర్షణ, మానవ సంబంధాల కోణాలను నలుగురు దర్శకులు తమదైన శైలిలో చూపించారు.

5. కర్మాఖ్య (జియో హాట్‌స్టార్):

మంత్రాలు, తాంత్రిక విద్యలు, చేతబడుల నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు హారర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'కర్మాఖ్య'. భయాందోళనకు గురిచేసే సన్నివేశాలు, ఆసక్తికరమైన కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

6. కాట్టాలన్ (ఆహా):

మలయాళంలో రూపొంది ఐఎమ్‌డీబీలో 6.7 రేటింగ్ సాధించిన యాక్షన్ థ్రిల్లర్ 'కాట్టాలన్'. దట్టమైన అడవుల్లో ఏనుగుల వేట, దంతాల అక్రమ రవాణా వెనుక ఉన్న మాఫియా సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాలో తెలుగు నటుడు సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి కాట్టాలన్ ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది.

అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్

ఇవాళ (సెప్టెంబర్ 27) సండే, పైగా వీకెండ్.. కాబట్టి మీరు ఎలాంటి కథలను చూడాలనుకున్నా ప్రస్తుతం ఓటీటీల్లో సరిపడా కంటెంట్ సిద్ధంగా ఉంది. థ్రిల్లింగ్ అనుభూతి కావాలన్నా, సరదాగా నవ్వుకోవాలన్నా ఈ బెస్ట్ 6 థ్రిల్లర్స్ సినిమాలు అన్నీ తెలుగులో అలరిస్తున్నాయి. ఈ వీకెండ్‌కి బెస్ట్ ఆప్షన్‌గా వీటిని ఎంచక్కా వీక్షించండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More