ఈ ముద్దు సీన్‌లో మేము నాలుక వాడాలా?, నా కాళ్లు అంత లావుగా ఉండవు- సిద్ధార్థ్, అదితి ఇంటిమేట్ సీన్‌పై డైరెక్టర్ కామెంట్స్

Vishal Bharadwaj On Siddharth Aditi Rao Intimate Scenes: రియల్ లైఫ్ భార్యాభర్తలు అయిన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రీల్‌పై కపుల్‌గా నటించిన ఓటీటీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 3. అయితే, ఇంటిమేట్ సీన్ల షూటింగ్ సమయంలో పడే ఇబ్బందులు, ఇంటిమసీ కోఆర్డినేటర్ల ఇంపార్టెన్స్ గురించి దర్శకుడు చెప్పారు.

Published on: Sep 22, 2026, 15:00:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vishal Bharadwaj On Siddharth Aditi Rao Intimate Scenes: సినిమాల్లో లేదా ఓటీటీ సిరీస్‌లలో శృంగారభరిత లేదా ఇంటిమేట్ సన్నివేశాలను తెరకెక్కించడం దర్శకులకు, నటీనటులకు ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. హద్దులు దాటకుండా, రసభంగం కలగకుండా ఆ సీన్లు తీయాల్సి ఉంటుంది.

ఈ ముద్దు సీన్‌లో మేము నాలుక వాడాలా?, నా కాళ్లు అంత లావుగా ఉండవు- సిద్ధార్థ్, అదితి ఇంటిమేట్ సీన్‌పై డైరెక్టర్ కామెంట్స్
ఈ ముద్దు సీన్‌లో మేము నాలుక వాడాలా?, నా కాళ్లు అంత లావుగా ఉండవు- సిద్ధార్థ్, అదితి ఇంటిమేట్ సీన్‌పై డైరెక్టర్ కామెంట్స్

ఓటీటీలోకి బోల్డ్ సిరీస్

అయితే, ఇటీవలే ఓటీటీలోకి బోల్డ్ అండ్ రొమాంటిక్ అంథాలజీ సిరీస్ ఒకటి స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదే 'లస్ట్ స్టోరీస్ 3'. ఇందులో రియల్ లైఫ్ కపుల్ అయిన హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రీల్ లైఫ్ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు.

లస్ట్ స్టోరీస్ 3లోని ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఇటీవల ఈ ఇంటిమేట్ సీన్స్ తీయడంపై స్పందించారు. లస్ట్ స్టోరీస్ 3లో సిద్ధార్థ్, అదితి రావు హైదరికి సంబంధించిన ఇంటిమేట్ సీన్స్, షూటింగ్ విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

హీరోయిన్ అడిగిన ఆ విచిత్రమైన ప్రశ్న

గతంలో సెట్‌లో ఇంటిమసీ డైరెక్టర్లు (Intimacy Directors) లేని సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేవో విశాల్ భరద్వాజ్ గుర్తు చేసుకున్నారు. "గతంలో కొందరు నటీమణులు నా దగ్గరకు వచ్చి.. 'సార్, ఈ ముద్దు సీన్‌లో మేము టంగ్ (నాలుక) ఉపయోగిస్తామా? ఒకసారి ఆ హీరోను అడిగి చెప్పండి' అని అడిగేవారు" అని విశాల్ భరద్వాజ్ చెప్పారు. ఒక దర్శకుడిగా హీరో దగ్గరకు వెళ్లి ఆ మాట అడగడం తనకు చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా అనిపించేదని ఆయన వివరించారు.

బాడీ డూప్‌ను వద్దనుకున్న అదితి-సిద్ధార్థ్

'లస్ట్ స్టోరీస్ 3' షూటింగ్ సమయంలో మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా సాగిందని విశాల్ తెలిపారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ప్రాజెక్ట్‌లో జంటగా నటించడంతో 50 శాతం ఇబ్బంది తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఒక సన్నివేశంలో వీరిద్దరి కోసం బాడీ డూప్‌లను సిద్ధం చేసినా, ఆ అవసరం రాలేదని చెప్పారు.

"ఒక క్లోజప్ షాట్‌లో కేవలం అదితి కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. సిద్ధార్థ్ ఆ కాళ్ల దగ్గర పాకే సీన్ అది. దానికోసం డూప్‌ను పెడితే.. అదితి ఆ విజువల్ చూసి, 'నా కాళ్లు అంత లావుగా ఉండవు' అని నవ్వింది" అని దర్శకుడు తెలిపారు. దాంతో ఆ సీన్‌ను డూప్ లేకుండా అదితి, సిద్ధార్థ్ స్వయంగా పూర్తి చేశారని చెప్పారు.

ఇంటిమసీ డైరెక్టర్ల అవసరం పెరిగింది

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఇంటిమసీ కోఆర్డినేటర్ల సంస్కృతి వేగంగా పెరుగుతోంది. సెట్‌లో వారి ఉనికి దర్శకులకు పెద్ద ఊరటనిస్తుందని విశాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నటీనటులకు ఎలాంటి భయం, అసౌకర్యం లేకుండా స్వేచ్ఛగా నటించే వాతావరణాన్ని వారు కల్పిస్తారు. నటీనటుల సమ్మతి (Consent), భద్రత ప్రాధాన్యంగా సాగే ఈ కొత్త విధానం వల్ల నటులు ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ పాత్రల్లో జీవించగలుగుతున్నారు.

నాలుగు కథల సమాహారం 'లస్ట్ స్టోరీస్ 3'

సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళ ఇతర భాషల్లో లస్ట్ స్టోరీస్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విశాల్ భరద్వాజ్‌తో పాటు విక్రమాదిత్య మోట్వానే, కిరణ్ రావ్, శకున్ బాత్రా వేర్వేరు ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించారు.

ప్రేమ, ఆకర్షణ, మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను విశ్లేషిస్తూ ఈ కథలు సాగుతాయి. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, విజయ్ వర్మ, ఆలీ ఫజల్, రాధికా మదన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సిరీస్‌లో విభిన్న పాత్రల్లో కనిపించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More