OTT Release: రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే విషం చేస్తే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Release: ఇవాళ ఓటీటీలోకి ఓ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది ఇండియా స్టోరీ’ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి లాయర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ కాజల్ అగర్వాల్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

Published on: Sep 18, 2026, 12:35:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సామాజిక కోర్టురూమ్ డ్రామా 'ది ఇండియా స్టోరీ' (The India Story) ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల వ్యవధిలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది.

రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే విషం చేస్తే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? (x/MsKajalAggarwal)
రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే విషం చేస్తే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? (x/MsKajalAggarwal)

ది ఇండియా స్టోరీ ఓటీటీ

ఇవాళ (సెప్టెంబర్ 18) ఓటీటీలోకి ది ఇండియా స్టోరీ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో ఈ మూవీ డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు నెలలకు

చేతన్ డికే దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన 'ది ఇండియా స్టోరీ' చిత్రం జూలై 24న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి అప్పుడు మిక్స్ డ్ టాక్ వినిపించింది. కానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చింది. 8 వారాల విండో తర్వాత డిజిటల్ రిలీజ్ అయింది.

కథ ఏమిటంటే?

ఈ ‘ది ఇండియా స్టోరీ’ చిత్రంలో కాజల్ అగర్వాల్ 'అడ్వకేట్ అర్చన' అనే శక్తివంతమైన లాయర్ పాత్రలో కనిపించారు. పంటలలో మితిమీరిన పురుగుమందుల వాడకం, ఆహార కల్తీ కారణంగా అనారోగ్యానికి గురైన తన కుమార్తెకు న్యాయం చేయమని కోరుతూ కోర్టుకెళ్లిన తండ్రి (శ్రేయాస్ తల్పడే) తరఫున ఆమె న్యాయపోరాటం చేస్తారు.

కార్పొరేట్ వ్యవస్థలు, లాబీయింగ్‌లకు వ్యతిరేకంగా కాజల్ వేసే ప్రశ్నలు, కోర్టురూమ్ విచారణ ఘట్టాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. లాయర్ గా కాజల్ తన నటనతో ఆకట్టుకుంటుంది. నిజ జీవిత సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు.

ఓటీటీ రియాక్షన్

కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన 'ది ఇండియా స్టోరీ' వంటి కథను ఎంచుకోవడం కాజల్ అగర్వాల్ కెరీర్‌లో మంచి పరిణామమే. థియేటర్లలో పరిమిత ఆదరణ పొందే ఇలాంటి మెసేజ్-ఓరియెంటెడ్ లేదా కోర్టురూమ్ డ్రామా చిత్రాలకు ఓటీటీ వేదికలే అసలైన బలాన్ని అందిస్తాయి.

ఆహార కల్తీ, పర్యావరణ సమస్యల నేపథ్యంలో రూపొందిన కంటెంట్ కుటుంబ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది. థియేటర్ విడుదలైన రెండు నెలలకు 1జియోహాట్‌స్టార్‌లోకి రావడం వల్ల డిజిటల్ మాధ్యమంలో ఈ చిత్రానికి విస్తృతమైన వ్యూయర్‌షిప్ దక్కే ఛాన్స్ ఉంది.అలాగే సామాజిక అంశాలపై చర్చను రేకెత్తించడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More