OTT Release: ఒక్క రోజే 7 క్రేజీ సినిమాలు.. ఓటీటీ పండగ.. మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్ ఇవే!

OTT Release: ఓటీటీ లవర్స్ ఈ డేట్ ను మార్క్ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ 18న 7 క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్ లో వినోదాల విందు అందించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Sep 14, 2026, 10:32:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Release: సెప్టెంబర్ 18న ఓటీటీ స్పేస్‌లో అంతర్జాతీయ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ఆఫరింగ్స్‌తో ముందుకు వస్తోంది. థియేటర్లలో రూ.280 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రవితేజ, శివ నిర్వాణల 'ఇరుముడి' (Irumudi) చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

ఒక్క రోజే 7 క్రేజీ సినిమాలు.. సెప్టెంబర్ 18న ఓటీటీ పండగ.. మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్ ఇవే!
ఒక్క రోజే 7 క్రేజీ సినిమాలు.. సెప్టెంబర్ 18న ఓటీటీ పండగ.. మస్ట్ వాచ్ మూవీస్, సిరీస్ ఇవే!

ఇరుముడి ఓటీటీ

ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఇరుముడి మూవీ ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రేజీ ప్రాజెక్టులు

నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న ఈ క్రేజీ ప్రాజెక్టులు కూడా రిలీజ్ కానున్నాయి.

  • లస్ట్ స్టోరీస్ 3 (Lust Stories 3): హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ప్రసారం కానున్న ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ ఆంథాలజీ సిరీస్ మూడో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
  • మోధ రాతిరి (Modha Rathiri): తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్-ఇండియా లెవెల్లో ఈ లేటెస్ట్ మూవీ రానుంది.
  • బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (Best Of The Best): హాలీవుడ్ యాక్షన్ ప్రాజెక్ట్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ డబ్బింగ్‌తో అందుబాటులోకి వస్తోంది.

మలయాళ సూపర్ హిట్

కేవలం నెట్‌ఫ్లిక్స్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ ఓటీటీ వేదికలు కూడా బలమైన ప్రాంతీయ కంటెంట్‌తో సెప్టెంబర్ 18న అదరగొట్టబోతున్నాయి.

  • తుడక్కమ్ (Thudakkam - JioHotstar): మలయాళ చిత్రసీమ నుంచి బ్లాక్ బస్టర్ మూవీ తుడక్కమ్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. మోహన్ లాల్ కూతురు విస్మయ డెబ్యూ చేసిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా

  • రామ్ అండ్ లీలా (Ram And Leela - Prime Video): అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ తమిళ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా ప్రసారం కానుంది.
  • అంగీకారం (Angikaaram - SunNXT): ప్రాంతీయ తమిళ డ్రామాలు, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అయిన సన్ ఎన్ఎక్స్‌టీ (SunNXT) లో 'అంగీకారం' చిత్రం ప్రసారానికి సిద్ధమైంది.

సెప్టెంబర్ 18 వార్

ఈ వారం ఓటీటీలో వస్తున్న 7 ప్రధాన రిలీజులలో 'ఇరుముడి', 'తుడక్కమ్', 'మోధ రాతిరి', 'లస్ట్ స్టోరీస్ 3', 'బెస్ట్ ఆఫ్ ది బెస్ట్' చిత్రాలు ఏకకాలంలో 3 నుంచి 5 భాషల్లో ప్రసారమవుతున్నాయి. ప్రాంతీయ కంటెంట్‌ను పాన్-ఇండియా వీక్షకులకు చేర్చడమే ప్రధాన లక్ష్యంగా డిజిటల్ సంస్థలు పనిచేస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More