Ameesha Patel: ఒక్క మగాడి కోసం జీవితాన్ని మార్చుకోలేను- పెళ్లిపై 51 ఏళ్ల అమీషా పటేల్ కామెంట్స్- సల్మాన్, టబు బాటలో!

Ameesha Patel On Marriage: 51 ఏళ్ల వయసులోనూ ఒంటరిగానే ఉంటున్న బాలీవుడ్, తెలుగు అందాల భామ అమీషా పటేల్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో అమీషా పటేల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 7, 2026, 14:32:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ameesha Patel On Marriage At Age 51: సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, టబు.. బాలీవుడ్‌లో బ్యాచిలర్‌గా మిగిలిపోయిన హీరోహీరోయిన్ల జాబితా చాలా పెద్దదే. ఈ వరుసలో పవన్ కల్యాణ్ 'బద్రి', మహేశ్ బాబు 'నాని' సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న 51 ఏళ్ల అందాల భామ అమీషా పటేల్ చేరింది.

ఒక్క మగాడి కోసం జీవితాన్ని మార్చుకోలేను- పెళ్లిపై 51 ఏళ్ల అమీషా పటేల్ కామెంట్స్- సల్మాన్, టబు బాటలో!
ఒక్క మగాడి కోసం జీవితాన్ని మార్చుకోలేను- పెళ్లిపై 51 ఏళ్ల అమీషా పటేల్ కామెంట్స్- సల్మాన్, టబు బాటలో!

'ఎప్పటికీ పెళ్లి చేసుకోను': అమీషా సూటి సమాధానం

51 ఏళ్ల వయసు దాటినా పెళ్లికి దూరంగా ఉంటున్న ఈ భామ, తాజాగా తన సింగిల్ స్టేటస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్‌లో ఒక నెటిజన్ "మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?" అని ప్రశ్నించాడు. దీనికి అమీషా పటేల్ ఏమాత్రం సంకోచించకుండా మాస్ రీజన్ ఇచ్చింది.

ఒక్క మగాడు వచ్చి మార్చేయడం ఇష్టం లేదు

"ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రాణంగా ప్రేమించే 100 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు ఉన్నారు. ఒక్క మగాడు వచ్చి నా జీవితంలో ఇవన్నీ మార్చేయడాన్ని నేను అంగీకరించలేను" అని అమీషా పటేల్ సమాధానమిచ్చింది.

పెళ్లి అనేది కాంప్రమైజ్

ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి అనేది ఒక కాంప్రమైజ్ అని, ఒంటరిగా ఉన్నప్పుడే కలల వైపు స్వేచ్ఛగా సాగిపోవచ్చని కొందరు అమీషా నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు.

గతంలో ప్రేమ విఫలం.. తగిన తోడు దొరికితేనే!

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే క్రమంలో తన ప్రేమకథ విఫలమైందని అమీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను సినిమాల్లో నటించడం అప్పట్లో ప్రియుడికి నచ్చకపోవడంతో ఆ బంధం తెగిపోయిందని చెప్పింది.

వయసు కంటే పరిణతి ముఖ్యం

తన కెరీర్‌ను ప్రోత్సహించే సరైన భాగస్వామి దొరికితే పెళ్లి ఆలోచన లేకపోలేదని, అయితే మానసిక పరిణతి ఉన్న వ్యక్తులు దొరకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది అమీషా పటేల్. తనకంటే వయసులో సగం ఉన్న యువకులు కూడా డేటింగ్‌కు ఆహ్వానిస్తున్నారని, వయసు కంటే ఆలోచనల్లో పరిణతి ముఖ్యమని వ్యాఖ్యానించింది.

'గదర్ 2'తో గ్రాండ్ కమ్‌బ్యాక్

తెలుగు, హిందీ చిత్రాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అమీషా పటేల్ ఇటీవలి కాలంలో 'గదర్ 2' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. సన్నీ డియోల్ సరసన సకీనా పాత్రలో అలరించి ప్రపంచవ్యాప్తంగా రూ. 686 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత 2024లో 'తౌబా తేరా జల్వా' చిత్రంలో నటించిన అమీషా, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌లను ప్రకటించాల్సి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. పెళ్లి గురించి అమీషా పటేల్ ఏం చెప్పింది?

తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ఒక్క పురుషుడి కోసం తన సంతోషాన్ని, చుట్టూ ఉన్న ప్రేమించే మనుషులను కోల్పోలేనని అమీషా స్పష్టం చేసింది.

2. అమీషా పటేల్ వయస్సు ఎంత?

అమీషా పటేల్ వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు.

3. అమీషా పటేల్ నటించిన హిట్ సినిమాలు ఏవి?

హిందీలో 'కహో నా ప్యార్ హై', 'గదర్', 'గదర్ 2' కాగా, తెలుగులో పవన్ కళ్యాణ్‌తో 'బద్రి', మహేశ్ బాబుతో 'నాని' వంటి చిత్రాల్లో నటించింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More