Sukumar: ప్రియదర్శితో సుకుమార్ ఇడుపు కాయితం- బీహార్‌లో కూడా ఆడే కథ, హీరోయిన్ 15 రూల్స్ పెట్టిందన్న నిర్మాత బన్నీ వాసు!

Sukumar Priyadarshi Idupu Kayitham Launch: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో ప్రియదర్శి హీరోగా సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో రానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విడుదల చేశారు.

Published on: Jun 25, 2026, 18:35:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sukumar Priyadarshi Idupu Kayitham Launch: 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, తన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌పై వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తూ నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు.

ప్రియదర్శితో సుకుమార్ ఇడుపు కాయితం- బీహార్‌లో కూడా ఆడే కథ, హీరోయిన్ 15 రూల్స్ పెట్టిందన్న నిర్మాత బన్నీ వాసు!
ప్రియదర్శితో సుకుమార్ ఇడుపు కాయితం- బీహార్‌లో కూడా ఆడే కథ, హీరోయిన్ 15 రూల్స్ పెట్టిందన్న నిర్మాత బన్నీ వాసు!

రామ్ చరణ్‌తో సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సుకుమార్ చేయనున్న తదుపరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త సమయం పడుతుండటంతో, ఈ గ్యాప్‌లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో తెలంగాణ నేటివిటీతో వస్తున్న సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది.

‘బలగం’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాలు రూటెడ్ కథలకు ఉన్న డిమాండ్‌ను నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలో, పక్కా గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫ్యామిలీ డ్రామాను సుకుమార్ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతిభావంతుడైన నటుడు, ప్రియదర్శి హీరోగా ‘ఇడుపు కాయితం’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

ఘనంగా ప్రారంభమైన ‘ఇడుపు కాయితం’..

బి.వి. వర్క్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖ ఫోక్ సాంగ్ డ్యాన్సర్ నాగ దుర్గ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సుకుమార్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ క్లాప్

ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, దిల్ రాజు వంటి టాలీవుడ్ దిగ్గజాలు పాల్గొని బ్లెస్సింగ్స్ అందించారు.

‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి? పోస్టర్ విశేషాలు ఇవే..

టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉండటంతో అసలు దీని అర్థం ఏంటా అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ వాడుక భాష‌లో ‘ఇడుపు కాయితం’ అంటే ‘విడాకుల పత్రం’ అని అర్థం వస్తుంది. అయితే ఇది చట్టబద్ధంగా కోర్టులు జారీ చేసే లీగల్ నోటీసు కాదు.

తెలంగాణలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు, ఊరి పెద్దల సమక్షంలో పరస్పర ఒప్పందంతో రాసుకునే సాంప్రదాయ విడాకుల పత్రాన్ని ఇలా పిలుస్తారు. ఈ వినూత్నమైన టైటిల్, మోషన్ పోస్టర్ ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

పోస్టర్‌ను గమనిస్తే ప్రియదర్శి, నాగ దుర్గ అప్పుడే పెళ్లైన కొత్త జంటగా కనిపిస్తున్నారు. వారు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కరీంనగర్ నుంచి బైక్ మీద హైదరాబాద్ నగరానికి బయలుదేరినట్లు చిత్రించారు. బైక్ వెనుక సకినాలు, కళ్లు సీసా లాంటి తెలంగాణ సాంప్రదాయ వస్తువులు ఉండటాన్ని బట్టి, ఈ సినిమా పక్కా తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది.

బీహార్‌లో రిలీజ్ చేసినా ఆడే కథ.. బన్నీ వాసు కామెంట్స్

సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని సుకుమార్‌ భార్య తబిత ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. మంచి కథకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని తెలుగు చిత్రాలు ఎన్నోసార్లు నిరూపించాయని ఆయన గుర్తుచేశారు.

"ఇది గ్లోబల్‌ రేంజ్ స్టోరీ. ఈ సినిమాను బీహార్‌లో రిలీజ్ చేసినా అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ప్రతి ఇంట్లోనూ ఉండే ఒక సాధారణ సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. పెళ్లి అయిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు. ఏ కోడలైనా తన అత్తమామలను ఈ సినిమాకి తీసుకుని వెళ్తే.. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అత్తగారు కచ్చితంగా కోడలి చేతులు పట్టుకుని ప్రేమగా వస్తారు" అని బన్నీ వాసు ధీమా వ్యక్తం చేశారు.

15 రూల్స్ పెట్టిందన్న బన్నీ వాసు

హీరోయిన్ ఎంపిక గురించి చెబుతూ జానపద గాయని నాగ దుర్గను ఈ సినిమాలో నటించడానికి తాము సంప్రదించినప్పుడు, ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిందని బన్నీ వాసు వెల్లడించారు. సినిమాలో నటించడానికి హీరోయిన్ నాగ దుర్గ తనకు 15 రూల్స్ పెట్టిందని, అవి విన్నాక తనకు చాలా సంతోషం వేసిందని చెప్పారు.

ఒక తెలుగు అమ్మాయికి తన జీవితంపై, కెరీర్‌పై ఎంత స్పష్టమైన అవగాహన ఉందో దీని ద్వారా అర్థమైందని నిర్మాత బన్నీ వాసు కొనియాడారు. మొత్తానికి సుకుమార్ సమర్పణలో వస్తున్న ఈ 'ఇడుపు కాయితం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More