Peddi: అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు- పెద్దిలో బుచ్చిబాబు చేసిన పనే 19 ఏళ్ల కిందట సుకుమార్ చేశాడా? జాన్వీ లాగే ఇషా?

Buchi Babu Peddi Janhvi Kapoor Scene Inspired From Sukumar: పెద్ది సినిమాలో కరెంట్ పోయినప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్‌ను రామ్ చరణ్ ముద్దుపెట్టుకునే సీన్ తీవ్ర దుమారం రేపుతోంది. దర్శకుడు బుచ్చిబాబుపై విమర్శల పరంపర కొనసాగుతోంది. అయితే, బుచ్చిబాబు చేసిన తప్పే 19 ఏళ్ల కిందట గురువు సుకుమార్ చేశాడా?

Published on: Jun 9, 2026, 05:55:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Buchi Babu Peddi Janhvi Kapoor Scene Inspired From Sukumar: తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్ ఫార్ములాకు సరికొత్త అర్ధాలు చెప్పిన దర్శకుడు సుకుమార్. ఆర్య, ఆర్య 2, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, పుష్ప, పుష్ప 2 వంటి సినిమాలు ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాయి.

అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు- పెద్దిలో బుచ్చిబాబు చేసిన పనే 19 ఏళ్ల కిందట సుకుమార్ చేశాడా? జాన్వీ లాగే ఇషా?
అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు- పెద్దిలో బుచ్చిబాబు చేసిన పనే 19 ఏళ్ల కిందట సుకుమార్ చేశాడా? జాన్వీ లాగే ఇషా?

సుకుమార్ శిష్యులు

సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన ప్రతి దర్శకుడు కథను ఎమోషనల్‌గా, రా అండ్ రస్టిక్‌గా ప్రెజెంట్ చేయడంలో ప్రత్యేకత చూపిస్తుంటారు. సుకుమార్ శిష్యులు మంచి హిట్లతో దూసుకుపోతున్నారు. అలా సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సాన కూడా తన గురువు బాటలోనే నడుస్తూ 'ఉప్పెన' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు.

ఇటీవలే రామ్ చరణ్‌తో 'పెద్ది' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించారు మరో హిట్ అందుకుంటున్నాడు బుచ్చుబాబు సాన. జూన్ 4న థియేటర్లోల విడుదలైన పెద్ది బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లోనే రూ. 292కిపైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి దూసుకుపోతోంది.

మితిమీరిన యాంగిల్స్‌లో

అయితే, పెద్ది సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్‌ను ఓవర్ గ్లామర్‌గా, కేవలం సెక్సువలైజ్డ్ తరహాలోనే మితిమీరిన యాంగిల్స్‌లో చూపించారంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో డైరెక్టర్ బుచ్చిబాబు సాన స్పందించి క్షమాపణలు సైతం కోరాడు.

అంతేకాకుండా జాన్వీ కపూర్‌కు సంబంధించిన సీన్లను తీసేయడం లేదా మార్చేయడం వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని సోషల్ మీడియా వేదికగా బుచ్చిబాబు సాన చెప్పుకొచ్చాడు. అయితే, పెద్దిలో ఒక సీన్ 19 ఏళ్ల కిందట బుచ్చిబాబు గురువు సుకుమార్ ఓ సినిమాలో తెరకెక్కించినట్లుగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అచ్చియమ్మకు ఇష్టం లేకపోయినా.. కరెంట్ పోయిన సమయంలో పెద్ది (రామ్ చరణ్) ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్ తీవ్ర చర్చకు దారితీసింది. సేమ్ అలాంటి సన్నివేశమే సుకుమార్ తన కెరీర్‌లో తెరకెక్కించిన రెండో సినిమా జగడంలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రామ్ పోతినేని హీరోగా, ఇషా సహాని హీరోయిన్‌గా నటించిన జగడం సినిమా 2007 మార్చిలో విడుదల అయింది. జగడం సినిమాలో అర్థరాత్రి హీరోయిన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో తన గ్యాంగ్‌తో ఫాలో అయిన రామ్ పోతినేని ఓ చోట హీరోయిన్ ఇషాను వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుని పారిపోతాడు.

సేమ్ సేమ్.. బట్ డిఫరెంట్

అసలు ఎవరు హగ్ చేసుకున్నారో తెలియని హీరోయిన్ షాక్‌లో ఉండిపోతుంది. అక్కడ తన కన్సంట్ (సమ్మతి) వంటివి ఏం లేకుండా ఓ ఆకతాయిగా హీరో ప్రవర్తన ఉంటుంది. పెద్దిలో కూడా జాన్వీ కపూర్‌ పాత్రను సమ్మతి లేకుండా రామ్ చరణ్ ముద్దు పెట్టుకునే సీన్ దాదాపుగా సేమ్ సేమ్.. బట్ డిఫరెంట్ అన్నట్లుగా ఉంటుంది.

అదే కాకుండా ఓ అమ్మాయిని ముద్దు పెట్టకుంటే బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్నావని, తన తండ్రికి చెబుతానని బ్లాక్ మెయిల్ చేస్తాడు హీరో. అప్పుడు హీరోయిన్ స్కూటీ కిందపడటంతో ఆ ముద్దు కంటిన్యూ కాదు.

19 ఏళ్ల కిందట

అనంతరం రామ్ పోతినేని గల్లీ రౌడీ అయ్యాక వచ్చే సాంగ్‌లో కొంతమంది అమ్మాయిలు రాత్రిపూట ఎవరో అబ్బాయిలు అసభ్యంగా తాకుతున్నారని హీరోకే కంప్లైంట్ చేస్తారు. దాంతో హీరో తడబడతాడు. అంటే, రామ్ పోతినేని లాగే తన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఫాలో అవుతూ అమ్మాయిలను హగ్ చేసుకుంటున్నారని చెప్పేలా సాంగ్‌లో ఆ సీన్ ఉంటుంది.

అంటే, 19 ఏళ్ల కిందట సుకుమార్ జగడం సినిమాలో ఎలాంటి సీన్ తెరకెక్కించారో, పెద్ది మూవీలో శిష్యుడు బుచ్చిబాబు కూడా దాదాపుగా అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ, 2007 సమయంలో సోషల్ మీడియా ఇంపాక్ట్ పెద్దగా లేదు. కాబట్టి, సుకుమార్ తీసిన, ఆ సీన్లను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, తప్పుగా ఎవరు భావించలేదు.

జగడంలో హీరోయిన్‌ను హగ్ చేసుకునే సీన్
జగడంలో హీరోయిన్‌ను హగ్ చేసుకునే సీన్

అదే ఉదాహరణ

కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ కొంచెం తప్పు చేసి దొరికిపోయిన నెట్టింట్లో తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పుడు బుచ్చిబాబు ఎదుర్కొంటున్న విమర్శలే అందుకు ఉదాహరణ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More